Tuesday, September 29, 2009

విశ్వరూపం



భారత్ లో బాలికల పరిస్థితి ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా ఉందా... విద్య, వైద్య వంటివి వారికి అందాల్సిన రీతిలో అందుతున్నాయా...ఈ విషయాలపై ప్లాన్ ఇండియా రూపొందించిన రిపోర్ట్ గురించి ఓ వార్త ఇది.
-ఎస్. సత్యబాబు

స్మృతి కధలు


స్మృతి కధలు శేర్షిక కింద మరో వై ఎస్ సహచరుని జ్ఞాపకాలతో ఈ కధనం.

-ఎస్. సత్యబాబు

Sunday, September 27, 2009

ఫండే లైఫ్ స్టైల్


మూర్తిరాజు గురించిన కధనం రెండో పేజి ఇది.

ఎస్. సత్యబాబు

ఫండే


గాంధీ మార్గం గురించి మనం రోజూ చదువుతూనే ఉన్నాం. మన రాజకీయనేతల పుణ్యమాని. మహాత్ముడిని తలవని నేత లేడనేది ఎంత నిజమో, ఆయన మార్గంలో నడిచే ఉద్దేశ్యం ఉన్ననేతలు ఇపుదేవరూ లేరనేదీ అంతే నిజం. ఊపిరి వున్నంతవరకూ గాంధీ బాట లోనే అంటున్న ఓ గొప్ప నేత మూర్తిరాజు. ఆయన గురించి రాసానని చెప్పడం కన్నా గాంధీ ఎంతో గురించి తెలుసుకున్నాను అని అంతే మనసుకు తృప్తిగా ఉంటోంది.

-ఎస్. సత్యబాబు

Tuesday, September 22, 2009

స్మృతి కథలు

ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు కంటే ఆయన లేనపుడే ఆ జ్ఞాపకాలు బాగా బ్రతుకుతాయి. అందులో సందేహం లేదు. మన మధ్య లేని వ్యక్తిని గురించి మనస్పూర్తిగా మాట్లాడతాం. ఆ మాటలు వినడానికే కాదు చదవడానికి కూడా బాగుంటై. అదీ వై ఎస్ లాంటి ప్రముఖుని గురించైతే ఇంకా బాగుంటై. వై ఎస్ గురించి ఆయన ను రాజకీయాల లోకి తీసుకువచ్చిన ఓ పెద్దాయన చెప్పిన స్మృతులే ఈ కధనం.
ఎస్. సత్యబాబు

Monday, September 21, 2009

విశ్వరూపం


హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటున్న ప్రేక్షకులకు జూలియా రాబర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే నేను ఆ పని చేయలేదు. ప్రస్తుతం ఇండియా లో ఉన్న జూలియా సినిమా షూటింగ్ గురించి మాత్రం కాస్త ఏదో తెలిసింది పంచుకున్నా.
-యస్. సత్యబాబు

Friday, September 18, 2009


మనలో చాలామందిమి చదువుకునే ఉంటాం. ఆ చదువుకు తగ్గ ఉద్యోగాన్నే చేస్తూంటాం. కాని ఆ చదువు విలువ అపుడపుడు మర్చిపోతూ ఉంటాం. . దాన్ని నలుగురికి పంచడంలో ఉన్న ఆనందాన్ని, అది పంచుకున్న కొద్దీ పెంచుకోవడంలో ఉన్న సంతోషాన్ని... కూడా. వాలంటరీ టీచింగ్ ని ప్రోత్సహించేందుకు రాసిన కధనం ఇది.
-యస్. సత్యబాబు

Wednesday, September 16, 2009

ఫ్లెమింగో


చాలా రోజుల క్రితం రాసిన వార్త ఇది. బ్లాగ్ లో పెట్టడం లేట్ అయింది. హైవే నవాబ్స్ అనే బైక్ యజమానుల క్లబ్, బైక్ ల మీద వారు వేసిన టూర్ గురించిన కధనం. వీరిని కలవడం, లైఫ్ ని వీళ్ళు డ్రైవ్ చేస్తున్న విధానం కొంత కష్టంగానే అర్ధం చేసుకోవడం ఒక వినూత్న అనుభవం.

-యస్. సత్యబాబు

Sunday, September 13, 2009

రిపోర్టర్స్ డైరీ


ప్రతి ఏడాదీ షిర్డీ వెళతాం. కాని ఈ సారి షిర్డీ ప్రయాణం మాత్రం ఎప్పటికీ గుర్తుండి పోయేదే. రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నాలాగే చాలామంది అభిమానించే వ్యక్తి... రాజశేఖరరెడ్డి. ఆయన హెలికాప్టర్ మిస్ అయింది అని తెలిసిన కొన్ని గంటలకు మా ప్రయాణం ప్రారంభమైంది. అక్కడి నుంచి మా టూర్ అంతా, వై ఎస్ మాతోనే ఉన్నారు. ఆ జ్ఞాపకాలే ఈ కధనం.

-యస్. సత్యబాబు

Tuesday, September 8, 2009

రిలేషన్ షిప్స్

చాలా నచ్చింది. మనసుకు దగ్గరగా వచ్చింది. నిజం. ప్రాస కోసం చేప్పడంలేదు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఊరి బాగుకోసం తపించే అందమైన పల్లె కధ. స్వయంగా వెళ్లి చూసి, మురిసి ముచ్చటగా రాసిన స్టొరీ ఇది. పల్లెలో ఉండే పచ్చదనం, అక్కడి మనస్సులో ఉండే స్వచ్చమైన అనుభంధం మనం పుట్టిన ఊరు ఎందుకు పల్లె కాకుండా పోయిందా అనిపిస్తే అది మన తప్పు కాదు.
యస్. సత్యబాబు

Monday, September 7, 2009

రిపోర్టర్స్ డైరీ


రాష్ట్రమంతా వై ఎస్ స్మరణ. నేను కూడా షిర్డిలో ఆయన్ను తలచుకున్న తీరును వివరిస్తూ రిపోర్టర్స్ డైరీ రాసాను. కాని చివరి క్షణంలో జరిగిన మార్పు వల్ల అది వెనుకడుగు వేసింది.

గ్రామాల్లో పని పాటల్లో ఆటలు ఓ మంచి విరామం. వెస్ట్ గోదావరి జిల్లాలో వాలిబాల్ కు ఉన్నఆటవిడుపు క్రేజ్ ను వివరించిన కధనం ఇది. ముఖ్యంగా గ్రామీణ కూలీలు ఆ ఆటను కష్టాన్ని మరిపించేదిగా భావిస్తుండడం విశేషం.
-యస్. సత్యబాబు

Sunday, September 6, 2009

రిపోర్టర్స్ డైరీ


అక్షరం నేర్పే గురువుల గురించి, అక్షర భక్తుల ఆలయాల గురించి ఒకే రోజు రాయగలగడం రాసే అవకాశం రావడం అదృష్టం కాదేమో గాని, అనిర్వచనీయం అనవచ్చు. విద్యాలయాలు, గ్రంధాలయాలు రెండూ దేవాలయాలతో సమానమే. గుడులను కాపాడుకుంటున్నట్టే బడులను, లైబ్రరీ లను కూడా కాపాడుకోవాలని ఓ సూచన. అదే ఈ కధనం.
యస్. సత్యబాబు

పెరెంటింగ్




టీచర్ లు లేకపొతే... అక్షరాలు లేవు, అభివృద్ధి లేదు, ఆశావాదమే లేదు. చిన్నప్పటి నుంచి మనం తల్లితండ్రుల తర్వాత ఎవరికైనా రునపడ్డామంటే అది టీచర్ కే. ఈ విషయం మన అందరికీ తెలుసు. కాని అభివృద్ధి కోసం పడే ఆరాటంలో తరచూ మరచిపోతుంటాం. అందుకే టీచర్స్ డే వచ్చింది. మనం మర్చిపోయింది గుర్తుచేయడానికి మాత్రమే కాదు. మన పిల్లలకు ఎప్పటికీ మరిచిపోని విధంగా తెలియచెప్పడానికి కూడా.
-యస్. సత్యబాబు

Wednesday, September 2, 2009

విశ్వరూపం


ప్రపంచ యుద్దానికి (రెండో) డెబ్భై ఏళ్ళు. ఆ టైములో మహిళలు పోషించిన పాత్ర మీద పెద్దగ ప్రచారం లోకి రాలేదు. అదే ఈ కధనం.
-యస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


ఒక మీడియా లో ఉంటూ మరో మీడియా యజమానుల గురించి గొప్పగా రాసిన ఆర్టికల్ బహుశ ఇదే అనుకుంటున్నా. ఆ భాగ్యం తెలుగు జర్నలిస్టు లలో నాకే దొరికినందుకు కొంచెం సంతోషం. ఎన్ టి వి తో మొదలు పెట్టి కేవలం రెండే సంవత్సరాల్లో మూడు చానెళ్ళు నడిపే స్థాయికి చేరుకున్న ప్రస్థానాన్ని విజయంగా వర్ణించడంలో సందేహించనక్కర్లేదు కదా. ఆ యజమానుల మధ్య ఉన్న చక్కని అనుభందాన్ని గురించిన కధనం ఇది.

-యస్. సత్యబాబు