Saturday, February 28, 2009

ఫిట్ నెస్

ఏమిట్రా ఎప్పుడూ చూస్తున్నట్టే ఉంటోంది... అన్నాడు లాస్ట్ వీక్ విజయవాడ ఫ్రెండ్ రమేష్ గాడు. వాడలా అన్నది న ఫిట్ నెస్ పేజి విషయంలో. వాడికి కూడా అల అనిపించిందంటే మార్చవలసిందే. బ్రెయిన్ కి ఎందుకు వ్యాయామం అవసరం లేదు అని ఆలోచించి రాసిన కధనం ఇది.
-యస్. సత్యబాబు

Thursday, February 26, 2009

సాహిల్


సిటీకి వార్తలు రాస్తే ఉండే కిక్ వేరు. అది సాక్షి లో చేరినదగ్గరనుంచి కోల్పోతున్నా. అడపా దడపా రాస్తున్న వాటిలో ఈ ఇంటర్వ్యూ కూడా ఒకటి. సాహిల్ తో ఉన్న్నస్నేహం మాత్రమె కాదు పి ఆర్ కూడా పని చేసింది.

-యస్. సత్యబాబు

ఫ్యాషన్ అండ్ బ్యూటీ


జుట్టుకు నల్ల రంగు వేసుకోవడం ఎలా అనేది వివరించడం ఈ కధనం. ఇలాంటి వార్తలు రాస్తుంటే నా జుట్టు మరింత తెల్లబోవడం ఖాయం...

-యస్. సత్యబాబు

పేరెంటింగ్


మంచి ఐడియా. పరీక్షల టైములో లిటిల్ స్టార్స్ ఎలా ప్రిపేర్ అవుతారనేది చెప్పడమే ఈ కధనం ఉద్దేశ్యం. దానితో పిల్లల్లో స్ప్పూర్తి నింపాలని. గంగాధర్ నేను కలిసి చేసిన రెండో స్టొరీ ఇది. మొత్తం మీద ఓకే.

-యస్. సత్యబాబు

Sunday, February 22, 2009

ఫిట్ నెస్


ఈ సారి కాస్త ఓకే. ఒక కొత్త విషయం చెప్పినట్టున్నాను. వ్యాయామం అంటే కదలకుండా కూడా చేయవచ్చని, చేయాలని చెప్పే స్టాటిక్ ట్రైనింగ్ గురించిన కధనం ఇది. మొత్తం మీద ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటే మనలో కూడా కదలిక వస్తుందన్నమాట. మార్పు వస్తుందన్నమాట.

-యస్. సత్యబాబు

Sunday, February 15, 2009

ఫిట్ నెస్


వ్యాయామాలు చేస్తున్నప్పుడు సపోర్ట్ గ కొన్ని వస్తువులు వాడాలని చెప్పిన కధనం ఇది. ఎప్పటి లాగే చివరి క్షణం దాక ఫోటోలు, హడావిడి... లోపం ఎక్కడుందో తెలియకపోతే ఒక సమస్య. తెలిస్తే, దాన్ని సరిదిద్దుకోలేకపోతే అంతా సమస్యే. నావరకు నేను చాల తృప్తిగా భావించే స్థాయిలో నా పని తీరు ఎప్పటికి చేరుతుందో... దానికి నేనేటువంటి సపోర్ట్ తీసుకోవాలో...

యస్. సత్యబాబు

Friday, February 13, 2009

ఫ్యాషన్ బ్యూటీ


తప్పనిసరి తతంగం అంటే ఇదేనా. ఏమి రాస్తున్నట్టు. అసలు ఏమి రాద్దమనుకున్నట్టు? చాల సాదా సీదా ఆలోచన ఇది. పొట్టిగా వున్నవాళ్ళు, లావుగావున్నవాళ్ళు... ఇలా చిన్ని చిన్ని లోపాలతో ఉన్నవాళ్లు ఎలాంటి ద్రెస్సెస్ వాడాలనే కధనం ఇది. చాల పాత ఐడియా... ఇలాంటి ఐడియాలు నిజంగానే జీవితాన్ని మార్చేస్తాయి. నాలాంటి రిపోర్టర్లను మీడియాకు దూరం చేస్తాయి...యస్. సత్యబాబు

ఫ్యాషన్

ఫ్యాషన్ అండ్ బ్యూటీ

తప్పనిసరి తతంగం అంటే ఇదేనా. ఏమి రాస్తున్నట్టు. అసలు ఏమి రాద్దమనుకున్నట్టు? చాల సాదా సీదా ఆలోచన ఇది. పొట్టిగా వున్నవాళ్ళు, లావుగావున్నవాళ్ళు... ఇలా చిన్ని చిన్ని లోపాలతో ఉన్నవాళ్లు ఎలాంటి ద్రెస్సెస్ వాడాలనే కధనం ఇది. చాల పాత ఐడియా... ఇలాంటి ఐడియాలు నిజంగానే జీవితాన్ని మార్చేస్తాయి. నాలాంటి రిపోర్టర్లను మీడియాకు దూరం చేస్తాయి...
యస్. సత్యబాబు

Sunday, February 8, 2009

సతీష్ 2


ఎందుకో ఫండే కధనంలో కొంత మిగిలిపోయింది. ఆ కొంతే ఇది.

-యస్. సత్యబాబు

లైఫ్ స్టైల్


జీవనశైలి కధనాల పరంపర ఫండే కోసం అందిస్తున్నాను. ఇది నాలుగోది. ప్రతి వారం నువ్వే రాయాలనుకునే దుర్భుద్ది ఎందుకు? అని నన్ను ప్రశ్నించాడు రాజిరెడ్డి. డెస్క్ ఇంచార్జ్ లు అందరూ ఇంచుమించు ఒకేలా ఆలోచిస్తారేమో. డబ్బులు తీసుకోకుండా ఉచితంగా సంగీత ప్రదర్శనలిచ్చే సతీష్ గురించి ఈవారం కధనం. ఫోటో అస్సలు బాగోలేదు.

-యస్. సత్యబాబు

ఫిట్ నెస్


ప్రతి వారం ఇదే పరిస్థితి. ఏదేదో స్టొరీ చేద్దామని, ఏదో చేయడం. వ్యాయామంలో భాగంగా బాడీని స్ట్రెచ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో చెప్తూ కొన్ని స్ట్రెచ్ లను చేసే విధానం కూడా చెప్పే కధనం ఇది. గత కొన్ని వారాలుగా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటున్నట్టే ఈవారం కూడా... నాలోని ఈ ప్లానింగ్ లోపం ఇంక ఎంత కాలం కోన సాగు...(స్ట్రెచ్)తుందో...

యస్. సత్యబాబు

Tuesday, February 3, 2009

రిలేషన్ షిప్స్


వందేళ్ళ బామ్మ ఆవిడ కుటుంబం... అనుభంధాలు ఇది ఈ కధనం. ఈ స్టొరీ చేస్తున్నప్పుడు హడావిడి లేకుండా ఇంకా చెప్పాలంటే ఆసక్తి కూడా లేకుండా చేశాను. కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే అంటారు పాత్రికేయుడు ఒకటి తలిస్తే పాఠకుడు మరొకటి తలుస్తాడని.

-యస్. సత్యబాబు

Monday, February 2, 2009

విశ్వ రూపం


మనుషులకు లాగానే కుక్కలకు కూడా ఫుడ్ సప్లయ్ చేస్తున్నారట ముంబాయిలో. భలే కొత్త ఆలోచన కదూ... అలా మాధవ్ కూడా భావించబట్టే ఆ వార్త నన్ను రాయమన్నాడు. తప్పించుకున్దమనుకుంటూనే విశ్వ రూపంలో నేనూ ఒక భాగంగా మారిపోతున్నా... కాదు కాదు మార్చేస్తున్నాడు మాధవన్నయ్య.

-యస్. సత్యబాబు

Sunday, February 1, 2009

లైఫ్ స్టైల్


భర్త స్మృతికి నివాళిగా సినిమా విశేషాలను గ్రంధస్థం చేస్తున్న మహిళా సరోజినీ గురించి ఈ వారం ఫండేలో రాసాను. ఈనాడులో రాసిన వార్తే ఇది కూడా. అప్పుడు న పేరుతో సహా పబ్లిష్ అయింది. మళ్ళీ రాయడంలో స్వార్ధమే తప్ప మరేమీ లేదు. ఫండే కోసం రాసిన వాటికీ సపరేట్ గ పేమెంట్ ఉందట. మొన్నే తెలిసింది...

యస్. సత్యబాబు

ఫిట్ నెస్


బ్రిస్క్ వాక్ గురించి చాలాతేలిగ్గా రాసేయవచ్చు. అందులో సందేహమే లేదు. కానీ ఫోటోల విషయంలో ప్లానింగ్ లేక పోతే ఎంత సమస్యో ఇపుడర్ధమైంది. పేజీలకు పేజీలు రాసేయడం సరే. కానీ ప్లానింగ్ సంగతి ఏమిటి? అటు రన్నింగ్ ఇటు జాగింగ్ కాకుండా పరుగులాంటి నడకే బ్రిస్క్ వాక్ అని రాసాను. స్టోరీ చేయడంలో నేను కూడా అలాగే నడచుకోవాలి.

-యస్. సత్యబాబు