Friday, March 19, 2010

సెల్ఫ్ చెక్


నో చెప్పడం కూడా ఒక కళ . అందులో మనకు ఎంత ప్రావీణ్యం ఉంది?

-ఎస్.సత్యబాబు

పరిచయం

బలవంతంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడానికి ఎన్ని
కారణాలు కావాలి? ఎన్నయినా ఉండొచ్చు. కాని అందులో
డబ్బు అనే కారణం అవ్వడం మాత్రం ఘోరం. అంతే కాదు అది సామాజిక నేరం కూడా. సుభద్ర గడ్డు పరిస్తితులను ఎదుర్కుని జీవితాన్ని నిలబెట్టుకున్నారు.
-ఎస్. సత్యబాబు

మిస్టరీ


దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగితే... ఇక్కడ మాత్రం ఇరవై సంవత్సరాలకు కూడా పోలీసులు తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. అందుకే ఆ చోరీ ఇప్పటికీ ఒక మిస్టరీ.

-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


మనిషి ఆశాజీవి. తీవ్రవాదం కాదు, ఉగ్రవాదం కాదు కేవలం ఆశావాదం మాత్రమే మనిషిని బ్రతికిస్తుంది. బ్రతుకుని ఇస్తుంది. అది కోల్పోవడమంటే... అన్నిటినీ కోల్పోవడమే.

-ఎస్. సత్యబాబు

విశ్వరూపం


సైన్యంలో మహిళలకు ప్రత్యక్ష పాత్ర ఎందుకు లేదు? ఒక విశ్లేషణ ఇది...

Thursday, March 11, 2010

మై సెంటిమెంట్


సెంటిమెంట్లు కొందర్ని బలహీన పరిస్తే మరికొందర్ని బలవంతులుగా మారుస్తాయి. సినీ నటులకు సెంటిమెంట్ లు ఎక్కువ అనే దానికి సురేఖ ఒక ఉదాహరణ.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


చూపులకు సామాన్యంగా కనిపించే వాళ్ళు అసామాన్య విజయాలు సాధించడం కొత్త విషయం కాదు. ఐతే పల్లె తనపు అమాయకత్వం తో ఒక అమ్మాయి సాధించిన ఈ విజయాన్ని మాత్రం తెలుసుకోవడం అపుడపుడు తలచుకోవడం అవసరం.

-ఎస్.సత్యబాబు

స్పెషల్


మహిళాదినోత్సవం వయసు వందేళ్ళు. ఒక మహిళ నవ మాసాలు మోయకుండానే కన్న ఈ బిడ్డ ఇప్పుడు ఎందరో తల్లులకు, పిల్లలకు తోడవుతోంది. ఏటేటా తన పుట్టున రోజును ఘనంగా జరుపుకుంటోంది.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


సర్వ పాపాలు సర్వాంతర్యామి దర్శనంతో పోతాయంటారు. కాని మనం ఆలయాల్లో, ఆ పరిసరాల్లో దర్శించు కుంటున్నది ఏమిటి? సర్వపాపాలను కాదా....

-ఎస్. సత్యబాబు

మిస్టరీ


గతం, అందులోని రహస్యాలు వింటే, కంటే ఆసక్తిగా ఉంటాయి. అవి రహస్యాలుగా ఉండి పోవడమే మంచిదేమో... ఎందుకంటే ఆసక్తిగా ఉంటాయి కాబట్టి.

-ఎస్. సత్యబాబు

Sunday, March 7, 2010

రిపోర్టర్స్ డైరీ


నాన్న చివరి రోజులు నాకు బాగా గురుతున్నై. తన పిల్లలతో సహా ఎన్నిటినో ఆయన మరిచిపోయేలా చేసిన వ్యాధి పేరు ఏమిటో అప్పట్లో చిన్నవాడినైన నాకు తెలియదు. వృధ్యాప్యం లో ఉన్నవారిని ఆప్యాయంగా పలకరించే ఈ మరపు వ్యాధికి మన డాక్టర్లు ఇప్పటివరకూ మందు కనిపెట్టారో లేదో కాని బోలెడన్ని పేర్లు మాత్రం కనిపెట్టారు. అల్జీమర్స్, డిమెన్ షియా వంటివి వాటిలో కొన్ని. మలిదశ జీవితాన్ని మరింత సంక్లిష్టంగా మలిచే ఈ వ్యాధి బారిన పడిన తల్లిని, అలాంటి ఎందరో తల్లుల్ని మామూలు మనుష్యులుగా చేయడానికి ఒక మహిళ చేస్తున్న ప్రయత్నం... ఆమెను మరచిపోలేని వ్యక్తిగా మార్చుతోంది.

-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


నిజం చెప్పడం ఎంత కష్టమో... అబద్దం చెప్పడం అంత సులువు ఇప్పుడు. నా చిన్నప్పుడు... చిన్న అబద్దం చేప్పినా చాలా సార్లు వీపు వాతలు తేలినట్టు గుర్తే. ఇప్పుడు కూడా దాదాపు అంత పనీ జరుగుతోంది కొందరు పిల్లల విషయంలో. ఐతే చిన్న తేడాఏమిటంటే ఇప్పుడు నిజం చెప్పినందుకు. అబద్దాలకు ఎంత బాగా అలవాటు పడుతున్నామంటే ఒక్క రోజు పూర్తిగా నిజాలు మాట్లాడితే మరుసటి రోజు ఉండదన్నంత బాగా.
ఎస్. సత్యబాబు

Saturday, March 6, 2010

మై సెంటిమెంట్


రాజకీయ నాయకుల్లో భావుకత్వం ఉంటుందా... సెంటిమెంట్ ఉన్నంత గారెంటీ గ ఉంటుంది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయ్.

-ఎస్.. సత్యబాబు

విశ్వరూపం


సిస్టర్... మన తోడబుట్టిన అక్కనో చేల్లెనో పిల్చినట్టు పిలుస్తాం. ఈ పిలుపు అక్క చెల్లెళ్ళు లేకపోయినా పలికించే వారున్నారు... వారే నన్ డాక్టర్స్. తమ తోడబుట్టిన వారిని మర్చిపోయి ఆపన్నులు అందర్నీ తమ అనుకునే గొప్ప త్యాగమయ జీవితం వారిది.

-ఎస్. సత్యబాబు