Wednesday, July 29, 2009

జెంటిల్ మెన్


బిల్ గేట్స్ గురించి చాలా మందికి తెలియని విశేషాలతో ఈ కధనం రాసాను. విషయ సేకరణలో కొలీగ్ కవిత బాగా హెల్ప్ చేసారు. ఈ సందర్భంగా నా గురించి నాకూ గతంలో తెలియని... ఇపుడు తెలిసిన విషయమేమిటి అంటే నేను ప్రతీ వార్త ఎవరి సహాయం లేకుండా రాయగలను అని అనుకోకూడదని.

-యస్. satyababu

Sunday, July 26, 2009


భ 'వనానికి' రాజు కధనానికి కొనసాగింపు పేజి ఇది.

లైఫ్ స్టైల్


బిల్డింగ్లు అందరూ కట్టొచ్చు. కానీ భ 'వనాలు' మాత్రం కొందరే కడతారు. అలాంటి భ 'వనానికి' రూపకల్పన చేసిన రామరాజు అనే ఒక వ్యక్తి కధ ఇది. పల్లె వదిలి నగరానికి వచ్చిన పచ్చదనం పైన ఇష్టాన్ని తగ్గించుకొని ప్రకృతి ప్రేమికుడు రామరాజు. ప్రకృతి ని ప్రేమించే వ్యక్తుల్లో నేనూ ఒకడిని కాబట్టి సహజంగానే ఈ భ 'వనం' నన్ను బాగా ఆకట్టుకుంది. ఫండే కు చాలాకాలం గ్యాప్ తర్వాత రాసిన స్టొరీ ఇది. ప్రకృతిని కేవలం ప్రేమించడం తో సరిపెట్టుకోకుండా తనవంతు గ తన పరిధిలో రామరాజు ఆవిష్కరించిన పచ్చని పొదరిల్లు నాలాంటి స్టొరీ మాత్రమె కాదు స్ఫూర్తి ని కూడా ఇవ్వాలి.

-యస్. సత్యబాబు

Friday, July 24, 2009

రిపోర్టర్స్ డైరీ

మనలో చాలా భావాలుంటాయి. అన్నీ బయటపెట్టలేమేమో... స్మశానానికి వెళితే వైరాగ్యం కలుగుతుంది అంటారు. కలగాలి కూడా. కాని అక్కడ కూడా కొన్ని సౌభాగ్యాలు చూసే అసూయ వంటివి కలిగితే... అలాంటి పరిస్థితి కల్పించిన వారిదే కావచ్చు ఆ తప్పు. ఆ ఉద్దేశ్యంతోనే ఇది రాసాను. మనలో కలిగే భావాలనన్నిటినీ బయటపెట్టలేము కాని పేపర్ మీద పెట్టగలము. కాని అందులో కొన్నే ప్రచురింప చేసుకోగలము.
-యస్. సత్యబాబు

Tuesday, July 21, 2009

రిలేషన్ షిప్స్


చికిత్స లేని జబ్బుతో బాధ పడుతూ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తామూ బ్రతకడమే కాకుండా తమలాంటి మరెంతోమందిని మేల్కొలుపుతున్న అక్క తమ్ముళ్ళ కధ ఇది. అనుకోకుండా వెళితే దొరికింది. బావుందని సెక్షన్లో అందరూ అన్నారు. నాకూ బావుంది.

యస్. సత్యబాబు

Monday, July 20, 2009

విశ్వరూపం


హిల్లరీ క్లింటన్ ఇండియా కి వచ్చారు. విశ్వరూపం పేజీలోకి కూడా వచ్చారు. ఆ రావడం నా చేతుల మీదుగా కావడం బహుశా నా అదృష్టం కావచ్చు. మాధవన్నయ్య చెప్పిన పని తూ చా తప్పకుండ చేసుకుపోతుంటే ఇలాంటి అదృష్టాలు చాలా సార్లు కలిగే ఛాన్స్ ఉన్నట్టుంది.

-యస్. సత్యబాబు

Saturday, July 18, 2009

రిపోర్టర్స్ డైరీ

ఈ శీర్షిక మొదలు పెట్టిన దగ్గరనుంచి స్టోరీస్ కి కొరత లేకుండా ఉంది. కాదేదీ స్టోరీకి అనర్హం అన్నట్టుగా ఉంది. వీటన్నిటికీ మించి సమాజం పట్ల నా భాద్యత నెరవేర్చుకోవడానికి ఒక మార్గం దొరికినట్టుంది. ఇంటి ముందుకు వచ్చిన యాచకుల జీవితాలను కూడా పట్టించుకునే మర్యాద నేర్పింది. థాంక్స్ టు రిపోర్టర్స్ డైరీ.
-యస్. సత్యబాబు

Monday, July 13, 2009

విశ్వరూపం


దీపావళి టపాసుల సౌండ్ కి భయపడే మధ్య తరగతి మహిళల సంగతెలా ఉన్నా... మందుపాతరల ను కూడా లెక్క చేయని సబలల గురించి తెలుసుకోవడం చాల అవసరం. అలాంటి మహిళల గురించిన కధనమే ఇది. విశ్వరూపం పేజి లో ఎవరూ రాయని ఐటెం రాయాలనే కోరిక అరుదుగా మాత్రమె తీరుతుంటుంది. ఈ స్టొరీ అలాంటిదే. మాధవన్నయ్య కు థాంక్స్. కూర్చుని రాసే ఐటెం ల లోనూ పాఠకులను ఆసక్తిగా చదివింపజేసేవి వుంటాయి అని నాకింకా అర్ధం కావలసి ఉంది.

-యస్. సత్యబాబు

Saturday, July 11, 2009

రిపోర్టర్ డైరీ


ఈ శీర్షిక ఏదో నా మంచికే వచ్చినట్టుంది. మొదటి నుంచి దీనికి మంచి వార్తలే ఇవ్వగలుగుతున్నాను. ఈ రోజు ఇచ్చింది కూడా బావుందని టాక్. రోడ్ పక్కన ఫుట్ పాత్ మీద ఉన్న వారికి దుప్పట్లు, రగ్గులు కప్పుతున్న స్వచ్ఛంద సేవ గురించిన కధనం ఇది. అనుకోని విధంగా కొందరు స్పందించి అభినందించారు. థాంక్స్ టు దేవ్. మారుస్తున్నానో, మారుతున్నానో... మొత్తానికి ఐటెం లు మాత్రం ఒకదాని వెంట మరొకటి పేరుస్తున్నాను అనేది నిజం.

-యస్. సత్యబాబు

Wednesday, July 8, 2009

పేరెంటింగ్


చాల రోజులైంది. పేరెంటింగ్ పేజి కి రాసి. సెల్ ఫోన్స్ వాడడానికి యూత్ ని అనుమతించేముందు తల్లితండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కధన సారాంశం. మరింత మనసు పెట్టి రాసుంటే బాగుండేదనిపించిన స్టొరీ. స్టొరీ రాసే ముందు ఎలాంటి కేర్ తీసుకోవాలో నాకు కూడా ఎవరైనా చెపితే బాగుండు.

-యస్. సత్యబాబు

Tuesday, July 7, 2009

ఆర్ట్ అండ్ కల్చర్


ఆలస్యంగా చేసిన మరో పోస్టింగ్ ఇది. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటిన రాసిన ప్రత్యెక కధనం .నచ్చిన పాటల గురించి ప్రముఖులు చెప్పిన సంగతులివి. ఈ రోజు పోస్ట్ చేశాను. గొప్ప కధనం రాసానని కాదు గాని గొప్ప రోజున నా బై లైన్ వచ్చిందని హ్యాపీ.
-యస్. సత్యబాబు

Monday, July 6, 2009

రిపోర్టర్స్ డైరీ



నిజంగా కళ్ళ ముందు కనపడిన వాస్తవం. చెత్త కుండీ లోని కూరగాయలను ఇంట్లో వాడకం కోసం తీసుకెళుతున్నవారిని చూసి రాసిన డైరీ ఇది. మనసు చలిస్తే, పెన్ను ఝులిపిస్తే పదునైన పదాలు అలవోకగా వస్తాయేమో... కాని ఒక మంచి వార్త రాసాను అనే తృప్తి లేదు. ఎందుకంటే ఈ వార్తకు ముందు మంచి అనే పదం వాడడం ఘోరం అనిపిస్తోంది -యస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ

Friday, July 3, 2009

విశ్వ రూపం

మహిళలు స్పోర్ట్స్ లో ఎంత బాగా రాణిస్తున్నప్పటికీ వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. అదే ఈ కధనం. రెండు వారాల క్రితమే రాసినది. ఇప్పుడు అప్ లోడ్ చేశా. మొత్తం మీద డెస్క్ స్టోరీస్ కి అలవాటు పడుతూ నన్ను నేను డౌన్ లోడ్ చేసుకోవడం లేదు కదా.
-యస్. సత్యబాబు

Thursday, July 2, 2009

పరిచయం


ఈ స్టొరీ ని వేరే ఫీచెర్ కోసమని అనుకున్నా. కాని ఫోటో చాలా బాగా రావడంతో పరిచయం పేజీకి మారింది. బీదరికంలో మగ్గుతూ కూడా బ్యాడ్మింటన్ తార గ ఎదుగుతున్న యువతి గురించిన కధనం ఇది. ఒక మంచి స్టొరీ రాసాననే ఫీలింగ్ కన్నా ఒక మంచి పనిచేసాననే ఫీలింగ్ కలిగింది.

-యస్. సత్యబాబు