Sunday, May 31, 2009

విశ్వ రూపం


మాధవ్ పుణ్యమాని విశ్వ రూపం పేజీలో తరచుగా బైలైన్ ఐటెం వస్తోంది. భర్తల చాటు భార్యలుగా మిగిలిపోకుండా తమదైన శైలిలో విజయాలు నమోదు చేస్తున్న బాలివుడ్ మహిళల గురించిన కధనం ఇది. నా జన్మతః వచ్చిన బలహీనతల మాటున క్రుంగిపోకుండా నేనెపుడు విజయాలు నమోదు చేస్తానో...

-యస్. సత్యబాబు

Monday, May 25, 2009

విశ్వరూపం


పవర్ ని లెక్క చేయని పవర్ ఫుల్ మనిషి సోనియా. నాకు వ్యక్తిగతంగానూ చాలా నచ్చిన నేత. ఇటీవలి ఎన్నికల ఫలితాలతో మరింత పవర్ ఫుల్ గా మారిన సోనియా గురించిన కధనం ఇది.
-యస్. సత్యబాబు

లైఫ్ స్టైల్


రెండు పార్ట్ లుగా ఇది నెట్ లో పెట్టడంతో ఇలా వచ్చింది. అలాగే పోస్ట్ చేయవలసి వచ్చింది.
యస్. సత్యబాబు

Sunday, May 24, 2009

లైఫ్ స్టైల్


ఫండే కోసం రాసిన కధనం ఇది. రక్త దాతలుగా మొదలై దాతల సమాచారాన్ని అందించే డైరెక్టరీ ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్న యువకుల గురించిన కధనం. గొప్ప ఆలోచనలేపుడూ గుర్తింపుకు నోచుకుంటూనే ఉంటై. దాన్ని తెలుసుకుని కూడా సాధారణంగా ఆలోచించే వారు ఇక అంతే నాలాగా.

యస్. సత్యబాబు

Saturday, May 23, 2009

మాతృదినోత్సవం కోసం రాసిన ఐటెం ఇది. వీదిపాలైన ముసలివాళ్ళని చేరదీసి ఆశ్రయం ఇస్తున్న మహిళ గురించిన కధనం ఇది. ఇప్పుడు పబ్లిష్ అయింది. అయితేనేం నేను రాసిన అన్ని వార్త కధనాల కన్నా మిన్నగా అపూర్వమైన స్పందన వచ్చింది. ఇలా కూడా స్వచ్ఛంద సేవ చేయవచ్చునని నాకు తెలియచెప్పిన స్పందన ఇది.
-యస్. సత్యబాబు

స్పెషల్ పరిచయం

చిరంజీవి మీద గెలవడమంటే ఆషామాషీ కాదు. అందులో సందేహంలేదు. ఒక మహిళగా మెగాస్టార్తో పోటీపడి గెలవడం, ఎన్నికల్లో ఆ అనుభవాలు పాలకొల్లు ఎం ఎల్ ఎ ఉషారాణి చెప్తేనే బాగుంటుంది. ఈ ఐడియా నాకు మిగతవారికన్నా ముందుగ రావడం, నేను స్కోరు చేయడం వల్ల నాకు కూడా బాగుంది.
-యస్. సత్యబాబు

Tuesday, May 12, 2009

రిలేషన్ షిప్స్

నిజంగా భలే స్టొరీ ఐడియా ఇది. సర్కస్ లో పనిచేసే కళాకారులూ, జంతువులూ, ప్రాణం లేని వస్తువులూ వీటన్నింటి మధ్య ఉండే రిలేషన్ ఎంత బావుంటుందో... ఇలా అనిపించే ఈ కధనం రాసాను. అచ్చుతప్పులు మాత్రం అక్కడక్కడ కనిపిస్తూ నాకూ , పని పట్ల నాలో ఉన్న నిర్లక్ష్యనికీ మధ్య ఉన్న తరగని అనుభందాన్ని గుర్తు చేస్తాయి.
-యస్. సత్యబాబు

Tuesday, May 5, 2009

రిలేషన్ షిప్స్

చిన్న వయసులోనే పెద్ద సంస్థ పగ్గాలు చేపట్టి రాణిస్తున్న
అక్క చెల్లెళ్ళ గురించిన కధనం ఇది. కాపీ బాగోలేదని కదిర్ గారు అన్నారు.
-యస్. సత్యబాబు

Sunday, May 3, 2009

లైఫ్ స్టైల్

పాటల పుస్తకాలను సేకరిస్తూ ఏకంగా సినీ పరిశోధనాకేంద్రం ఏర్పాటు చేసిన వ్యక్తి గురించిన కధనం ఇది. విజయవాడ వెళ్ళినప్పుడు చేసినది. ఫండే లో రాస్తున్న లైఫ్ స్టైల్ కధనాల పరంపర వల్ల కాస్త తృప్తి గానే ఉన్నట్టుంది. ఏదైనా అసలుకన్న కొసరు బావుంటుంది. నేను చేయవలసిన పని కన్నా ఇదే నాకు బాగున్నట్టుంది.
-యస్. సత్యబాబు