Thursday, January 29, 2009

ఫ్యాషన్

ఈసారి ఫ్యాషన్ పేజి పెద్ద తలనొప్పి గ మారింది. ప్రతూష కొంచెం ఇబ్బందిపదినట్టే ఉంది. ఏదేమైనా నేను ఇంకొంచెం ముందస్తుగ ప్రిపేర్ కావడం అలవాటు చేసుకోవాలి.
యస్. సత్యబాబు

Monday, January 26, 2009

విశ్వరూపం


కింది పార్ట్ నీదే అన్నయ్యా అంటాడు మాధవ్ ఎపుడు చూసినా. రామ్ గారేమో విశ్వరూపం పేజీలో కింద మహిళలకు సంభందం లేని ఐటెం ఇవ్వమంటున్నారు. నేను రాసినదైతే రామ్ గారు ఓకె అంటారట. మొత్తం మీద ఐ లవ్ యు అంటూ మాధవ్ నా ఆదివారపు ఆనందాలను చాకచక్యంగా కాజేస్తున్నట్టుంది. ఏదేమైనా ఎంత రాస్తే అంత మంచిది కదా. ఈరోజు గణతంత్ర దినోత్సవం కావడంతో జాతీయ జెండాని గౌరవించడం ఎలా అనే ఐటెం రమ్మిశర్మ రాసినది తీసుకుని విశ్వరూపం కోసం ఇచ్చాను.

-యస్. సత్యబాబు

Saturday, January 24, 2009

లైఫ్ స్టైల్


విజయవంతమైన మూడో వారం. ఈనాడులో ఉన్నప్పటినుంచి అనుకుంటున్నమరో ఐటెం ఫండే కోసం తెరకెక్కింది. పోలీస్ కేసుల కు ఉపకరించేందుకు అస్గర్ అనే ఫోటో గ్రాఫర్ ఫొటోలతోచేస్తున్న సర్వీసు ఇది. బై లైన్ అనే పిచ్చి ముదురుతున్నట్టుగా ఉంది నాక్కూడా.

యస్.సత్యబాబు

ఫిట్ నెస్


నలభై దాటిన మహిళలు కూడా టీనేజ్ లో లాగానే మేనేజ్ చేయవచ్చని చెప్పే కధనం ఇది. చాల వివరాలు ఇద్దామనుకుని ఇవ్వలేకపోయననిపించింది. మరికొంత మనసు పెట్టి పనిచేయాలి ఇక.

.-యస్.సత్యబాబు

Friday, January 23, 2009

ఫ్యాషన్


ప్రత్యూష నేను కలసి ఫ్యాషన్ పేజి బాధ్యతలు చూడడం మొదలుపెట్టి ఇంకా రెండవ వారం కాలేదు. అప్పుడే విభేదాలు. ఏదైతేనేం రెండో పేజి బాగానే వచ్చింది. ప్రత్యూష తో వర్క్ చేస్తూ తను నేర్చుకుంటుందో నేనో... చూద్దాం.

-యస్. సత్యబాబు

Monday, January 19, 2009

విశ్వరూపం


మాధవ్ గారు ఐటెం తీసి ఇవ్వడం దాన్ని నేను రాసి ఇవ్వడం. విశ్వరూపం పేజి కోసం మా సహచర్యం ఇలా ఎంతకాలమో

-యస్. సత్యబాబు

వంటలు


ఫండే లో సునీత వండిన వంటలు మంజుల గారు చక్కగా వడ్డించారు. ఈ పేజీలో నా పాత్ర పరిమితం.

యస్.సత్యబాబు

లైఫ్ స్టైల్


సాక్షి మాగజైన్ కోసం రాస్తున్న లైఫ్ స్టైల్ కధనాల్లో రెండవది ఇది. జంటిల్మన్ పేజి గురించి ప్రారంభంలో చేసిన స్టొరీ ని ఫండే కోసం ఇచ్చాను. ముగ్గురు పిల్లలను ఫ్లాట్లోఉంచి పోషిస్తోన్న యువకుని కధనం ఇది.

-యస్. సత్యబాబు

ఫిట్ నెస్


రోజు రోజుకూ ఫిట్ నెస్ స్టోరీస్ సింపుల్ గ చుట్టేస్తున్నానేమో అనిపిస్తోంది. ఇంక నాలో పాతబుద్దులు పోలేదు. నేను ఒక పేజి ఇన్ ఛార్జ్ ని అని గుర్తుంచుకోవాలి.

-యస్. సత్యబాబు

Tuesday, January 13, 2009

సినిమా


అన్ని పేజీ లలో రాయాలనే సరదా ఎందుకో నాకు? సినమా పేజీలో రాసిన ఫస్ట్ కధనం ఇది.

-యస్. సత్యబాబు

Saturday, January 10, 2009

లైఫ్ స్టైల్


సాక్షిలో జాయిన్ అయ్యినదగ్గర్నుంచి సండే బుక్ లో పేరు చూసుకోవాలనే సరదా ఈరోజుతో తీరింది. ఫ్రెండ్ ప్రవీణ్ వాళ్ళనాన్న హాబీ తో సాక్షి ఫండే లో నా ప్రయాణం మొదలైంది. లైఫ్ స్టైల్ పేరిట ఫీచర్ ని ఎన్నివారాలు నడపగలనో చూడాలి... ఏదేమైనా రాజిరెడ్డి కి థాంక్స్.

-యస్. సత్యబాబు

ఫిట్ నెస్


ఒక బరువు దిగినట్టుంది. నిజంగా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా... అండర్ వెయిట్ సమస్య మీద రాద్దామని. చాలమంది ప్రశ్నలు పంపారు కూడా. ఇప్పటికి కుదిరింది. ఏది రాసిన ఇంకా ఏదో అసంతృప్తి ఉంటూనే ఉంటుంది కదా. ఈ కధనం కూడా అంతే.

-యస్. సత్యబాబు

Thursday, January 8, 2009

ఫ్యాషన్


సాక్షి ప్రారంభం నుంచి ఫ్యాషన్ అండ్ బూటి పేజి చూస్తున్న కవిత వెళ్లిపోవడంతో ఫ్యాషన్ పేజి బాధ్యత నేను తీసుకోవలసి వచ్చింది. అలా తీసుకున్న తరువాత పెట్టిన తొలి పేజి ఇది. ఈ సంవత్సరం ఎటువంటి ఫ్యాషన్ రానుందో చెప్పడమే ఈ కధనం...

యస్.సత్యబాబు

Tuesday, January 6, 2009

ఫిట్ నెస్


డాన్స్ ఒక మంచి వ్యాయామం. చక్కని వినోదంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా డాన్స్ తో పొందవచ్చు. ఈ వారం రాసిన ఫిట్ నెస్ పేజి ప్రధానకధనంలో అదే చెప్పాము.

యస్. సత్యబాబు

Monday, January 5, 2009

విశ్వరూపం


తొలిసారిగా విశ్వరూపం పేజి కోసం పెద్ద లీడ్ స్టొరీ కావాలని ఆ పేజి ఇన్ ఛార్జ్ మాధవ్ అడగడంతో ఈ కధనం ప్లాన్ చేసాము. బయట నుంచి అభిప్రాయాలూ తీసుకోవడంతో ఇది నిజంగా ఒక మంచి స్టోరీగా మారింది. థాంక్స్ టూ మాధవ్...

యస్.సత్యబాబు

Sunday, January 4, 2009

ఫిట్ నెస్


బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గునే అమ్మాయిలకు అవసరమైన ఫిట్ నెస్ రొటీన్ గురించిన కధనం మిస్ సౌతిండియా పోటీలో

పాల్గొన్న వారి వ్యాయామాల ఫోటోలతో అందించాం

-యస్. సత్యబాబు