Sunday, March 29, 2009

ఫిట్ నెస్


ఈ పేజీకి ఇంక ఆయువు తీరలేదు. సిక్కిరెడ్డి అనే బ్యాడ్మింటన్ ప్లేయర్ గురించి రాయాలన్నయ్య అని రామ్ గారు చెప్పగానే మరో పేజీకి చాన్స్ వచ్చింది. ఆటలతో ఆరోగ్యం సాధించమంటూ చెప్పిన కధనం ఇది. నా పేజి తో ఆటలు ఆడుకోవడం ఎప్పుడు ఆగుతుందో...

యస్. సత్యబాబు

Wednesday, March 25, 2009

పెరెంటింగ్


అనుకోకుండా ఈ పరీక్షల సీజన్ లో వరుసగా కధనాలు రాస్తున్నాను. ఎగ్జామ్స్ టైములో ఒత్తిడి ఎలా తట్టుకోవాలో చెప్పే స్టొరీ ఇది. నేను కూడా పాటిస్తే మంచిది...

-యస్. సత్యబాబు

Monday, March 23, 2009

విశ్వరూపం


జీవన వైవిధ్యం అంటే ఇదే. బ్రతుకు ముగిసి సమాధిలో చేరేవారు ఒకరైతే బ్రతకడం కోసం ఆ సమాధులు తవ్వేవారు మరొకరు... నెట్ నుంచి తీసిన ఈ ఐటెం మాధవన్నయ్య నాకు ఇచ్చినపుడే నచ్చింది. సమాధులు తవ్వే వ్యక్తీ, దెయ్యాలతో అతని స్నేహం... ఈ కధనం.

యస్. సత్యబాబు

Sunday, March 22, 2009

ఫండే


వారానికి ఒకసారి ఇద్దామనుకున్న జీవనశైలి కధనాలు అంతగా కాకున్నా బాగానే వస్తున్నై. దేశాల జెండాలు సేకరిస్తున్న ఖమ్మం జిల్లా వాసి గురించిన కధనం ఇది.

-యస్. సత్యబాబు

ఫిట్ నెస్


ఉండేనా ఊదేనా అంటూ ఊగిసలాడుతున్న ఫిట్ నెస్ పేజి మరో వారం ఉండింది. నా తప్పు ఏమిటో అర్ధమవుతూనే ఉంది. కాని నా తీరు మారదనీ అర్ధమవుతోంది. వచ్చే వారం ఉంటుందో లేదో తెలీని ఈ పేజి కోసం నేను ఈ వారం రాసిన కధనం ఇది. బరువు తగ్గడానికి ఎండాకాలం మంచిదని, ఇద్దరు బరువు తగ్గిన వారి అనుభవాలను కూడా తీసుకుని అందించిన కధనం... వీక్ గడుస్తుంటే వీక్ అవుతున్న నా పేజి బరువు ఎవరు పెంచగలరు

-యస్. సత్యబాబు

Wednesday, March 18, 2009

ఫిట్ నెస్


ఈ స్టొరీ రాసిన తేది ఆరు ఏడు ఎనిమిది బావుంది కదా. పేజి కూడా చూడ్డానికి అంతే బాగా వచ్చింది. ఆడవాళ్ళు బరువులు మోస్తూ వ్యాయామం చేయవచ్చునని, చేయాలని చెప్పే కధనం ఇది. నా తల మీద బరువు దిగింది ఈ మద్యనే. (ఫిట్ నెస్ పేజి ఆగిపోయింది కదా )
యస్. సత్యబాబు

ఫిట్ నెస్

సంగీతం లేని జీవితాన్ని ఊహించలేం. అలాగే జిమ్*దగి కూడా. వ్యాయామం లో మ్యూజిక్ పాత్ర ఎంత ? ప్రాధాన్యత ఎంత? ఎలాంటి మ్యూజిక్ తో జిమ్ లో మేజిక్ చేయవచ్చు? ఇది ఈ కధనం. ఈనాడులో టచ్ చేసిన టాపిక్ ఇది. మరింత సమగ్రంగా అక్టోబర్ నెలలో రాసాను.
యస్. సత్యబాబు

ఫిట్ నెస్


రెసిస్టన్స్ ట్యూబ్ అనే ఐటెం తో వ్యాయామాలు ఎలా చేయాలో చెప్పే కధనం ఇది. మూడవ తేది ఎనిమిదవ నెల రెండువేల ఎనిమిదవ సంవత్సరం దీని ప్రచురణ తేది. బాడీ లోని అన్ని పార్ట్ లకు వ్యాయామాలు అందించ వచ్చు నని చెప్పడమే కధనోద్దేశ్యం. సరదాగా సాగుదాం అనే టైటిల్ బావుందని అనిపించింది. నా లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా.

యస్. సత్యబాబు

ఫిట్ నెస్

ఫిట్ నెస్ పేజి మొదలైన తరువాత మే నెలలో ఈ కధనం రాసాక రామ్ గారు నా కళ్లు తెరిపించారు. వాటర్ ఎరోబిక్స్ అనేది ఎంతమందికి అందుబాటులో ఉంటుందన్నయ్య అని రామ్ గారు వేసిన ప్రశ్నకి నా వద్ద ఆన్సర్ లేదు. అప్పటి నుంచి అందరికి అందుబాటులో ఉండే కధనాల నే ఇవ్వాలని నిశ్చయించుకున్నా అదే నా ఆన్సర్.
యస్. సత్యబాబు

Monday, March 16, 2009

విశ్వ రూపం


వారాంతపు వినోదం అంటే ఇదే కావచ్చు. వారం వారం మాధవ్ ఏదో ఒక ఐటెం ఇవ్వడం, అది హైదరాబాద్ లో తప్ప అన్నిచోట్లా పబ్లిష్ అవ్వడం... ఏదైతేనేం అలా సాగిపోతోంది. అమెరికా లో ఆర్దిక మాంద్యం కారణంగా పాన్ బ్రోకర్స్ హవా బాగా పెరిగిందట. అవార్డులు కూడా తాకట్టు కు వస్తున్నాయట. అది విషయం.

-యస్. సత్యబాబు

Sunday, March 15, 2009

ఫిట్ నెస్


నిజానికి చాలా మంచి సబ్జెక్టు ఇది. మజిల్ కు సంబంధించిన వివరాలివి. ప్రతి పార్ట్ లోని ముఖ్యమైన కండరం దాని పనితీరు ను చెప్పడానికి ట్రై చేశాను. ఫర్వాలేదనిపించిన స్టొరీ ఇది. ఈ ఫర్వాలేదనిపించే స్థాయి

నుంచి నా పనితీరు ను ఎలా మెరుగుపరచుకోవాలో...

-యస్. సత్యబాబు

Wednesday, March 11, 2009

జెంటిల్ మెన్

విజయ్ మాల్య వంటి బిజినెస్ మాన్ గురించి రాసిన ఆర్టికల్ ఇది. వ్యాపారంలో జీవన శైలిలో తనకంటూ ఒక రూటు ఆయనది. ఈ ఫీచర్ ప్రారంభం నుంచి ఒకటీ అర రాసినా ప్రోఫైల్స్ ప్రారంభమయ్యాక ఏమి రాయలేదనే లోటు నేటితో తీరింది. అంతటి విజయ మాల్య కైనా ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది కదా. జీవితమంటేనే లోటు-భర్తీ...
యస్. సత్యబాబు

Tuesday, March 10, 2009

విశ్వ రూపం


ఈ సారి మాధవన్నయ్య వాళ్ల సన్ కి హెల్త్ బాగోలేదని రాలేదు. దాంతో మాకు కొంచెం విశ్వ రూపం పని పడింది. ఏదేమైనా కవిత గారు చెప్పిన ఐటెం బాగా ఉందని పించి రాసాను. సంవత్సరానికి ఒకసారి టైం ని ముందుకు జరిపే దేశాల గురించిన కధనం ఇది. మొత్తం మీద నా టైం బాగానే ఉంది.

యస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


ఫండే కోసం రాసిన సారీ రాద్దామనుకున్నా ఐటెం ఇది. కదిర్ గారు బావుందని అనడంతో రిలేషన్ షిప్స్ గ మారింది. మొత్తం మీద మంచి ఐటెం. ఆఫీసులో అందరు బాగుంది అన్నారు. ముప్పై అయిదు సంవత్సరాలుగా చలివేంద్రం నిర్వహిస్తున్న వ్యక్తి గురించిన కధనం ఇది.

యస్. సత్యబాబు

Sunday, March 8, 2009

ఫండే


బైక్ అంటే ఇష్టం కేవలం దాన్ని నడపడంతో ఆగిపోకుండా లాంగ్ టూర్స్ కి ఆ పైన బైక్ క్లబ్స్ ఏర్పాటు కి దారి తీస్తోంది. మారుతున్న బైక్ డ్రైవింగ్ స్టైల్ గురించిన కధనం ఇది. ఈనాడు లో ఉన్నప్పుడు వాండరర్స్ గురించి సాక్షి కి వచ్చాక హైవే నవాబ్స్ గురించి రాసి ఇప్పుడు మరో రెండు క్లబ్స్ కలిపి ఈ స్టొరీ అందించాను. మొత్తం మీద దాదాపు నెల తర్వాత నా ఐటెం ఫండే లో వచ్చింది.
యస్. సత్యబాబు

Saturday, March 7, 2009


మహిళా దినోత్సవం


ఈ రోజు ఫిట్ నెస్ పేజి ఎగిరిపోయింది. మహిళదినోత్సవం స్పెషల్ గ నేను కూడా ఫిట్ నెస్ స్టొరీ ఇద్దామనుకున్నా. కానీ నేను ఒకటి తలిస్తే ఎప్పటి లాగే మా ఎడిటర్ రామ్ గారు మరోటి తలిచారు. ఫలితం ఈ స్టొరీ. కేవలం ఆడపిల్లలే ఉన్న ప్రముఖుల కుటుంబాలని, ఆ ఆడపిల్లల విజయాలని గుర్తు చేసే కధనం. మా ఆఫీసు పాత భవనం లో లేదని రామ్ అన్నయ్య సన్నిధి కి చేరిందని, నాకు మరొక్కసారి గుర్తు చేసే కధనం కూడా...

యస్. సత్యబాబు

Wednesday, March 4, 2009

పీరెంటింగ్


తెల్లారకముందే పొద్దున్నే లేచి చదువుకోవడం ఇప్పటి పిల్లలకు నేర్పాల్సిన అలవాటే. అందులో సందేహమే లేదు. కదిర్ గారు చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చడం తో ఈ స్టొరీ ని ఇష్టపడి, దానికి తగ్గట్టే కష్టపడి చేశాను. ఫోటోల విషయం కాస్త ఇబ్బంది పెట్టినా మంచి స్టొరీ చేశాననే తృప్తి...

యస్. సత్యబాబు

Tuesday, March 3, 2009

విశ్వ రూపం


...కొన... సాగుతొంది నాకు విశ్వరూపం తో అనుభందం... కొనకు చేరిందని కూడఅనిపిస్తోంది. మాధవ్ చెప్పిన ఈ ఐటెం లో మంచు కురిసేచోట పెళ్ళాడడం అనేది విశేషం. శీర్షిక మంచు ముడి. బావుంది కదూ...

యస్. సత్యబాబు