Thursday, October 29, 2009

పిట్ట గోడ


నాలుగు గోడల మధ్య కూర్చుంటే తెలిసే విషయాలకన్నా గోడ దాటితే తెలిసేవే బాగుంటై. మొట్ట మొదటి సారిగా ఈ కాలంకి రాసా.

-ఎస్. సత్యబాబు

Wednesday, October 28, 2009

రిపోర్టర్స్ డైరీ


వైద్యం పేదవాడికి చేరువ కావాలని అందరూ కోరుకుంటున్నారు. కాని నకిలీ వైద్యులు చేరువవుతున్నారు. ఆయుర్వేదం అంటే ఒక అద్భుతం. దాన్ని నడిరోడ్డు మీద అవమానించడం, అది చూస్తూ మనం ఊరుకోవడం సరైన పనేనా... ఫుట్ పాత్ మీద బ్లాంకెట్లు అమ్మొచ్చు. చాక్లెట్లూ అమ్మొచ్చు. కాని వైద్యం పేరిట మోసాన్ని కాదు.

-ఎస్. సత్యబాబు

స్మృతి కధలు


గాంధీ భవన్ కి వెళ్లి ఆ భవనంతో వై ఎస్ కి ఉన్నఅనుభందం రాసా. అనుకోకుండా అది స్మృతి కధలుగా మారింది.

-ఎస్. సత్యబాబు

Monday, October 26, 2009

విశ్వరూపం


వరదల వల్ల విద్యార్ధుల కు కలిగే నష్టాన్ని పూడ్చడానికి రెడ్డీస్ ఫౌండేషన్ కు చెందిన మహిళలు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. వాటికి మా వంతు తోడ్పాటే ఈ కధనం. కొన్నివారాల అనంతరం విశ్వరూపం పేజీ కి రాసాను. సరిత కి ( సబ్-ఎడిటర్) పాపం ఉపాధి కోల్పోయింది ఈ ఒక్క రోజుకి.

-ఎస్. సత్యబాబు

Sunday, October 25, 2009

స్మృతి కధలు


పెద్ద బావగారికి వై ఎస్ తో కాస్తో కూస్తో అనుబందముంది. అదే ఈ సారి స్మృతి కధ.

-ఎస్.సత్యబాబు

Friday, October 23, 2009

పరిచయం


చిన్నప్పుడు నేను ఎన్ ఎస్ ఎస్ లో చాల సార్లు పార్టిసిపేట్ చేశాను. బిస్కెట్స్, సమోసాలు ఎంజాయ్ చేశాను. అంతే. అంతకు మించి దాని స్ఫూర్తి ఏమిటో దాని ద్వారా సమాజానికి ఎంత మేలు చేయవచ్చో... తెలియదు. కాదు. తెలియజేయలేదు. నా టీచర్లు గాని, పేరెంట్స్ గాని. పద్మ గారిని కలిసినపుడు ఇలాంటి టీచర్ నా చిన్నతనంలో దొరికుంటే ఎంత బాగుణ్ణు... అనిపించింది. ఆమె గురించి ఈ కధనం లో చెప్పడం ద్వారా నా చిన్నతనంలో ఎన్ ఎస్ ఎస్ కు చేసిన ద్రోహానికి కొంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకున్నానేమో...

-ఎస్. సత్యబాబు

Wednesday, October 21, 2009

రిపోర్టర్స్ డైరీ


మనిషి మనసును గుర్తించనపుడు ఉన్నంత ఆనందంగా ఎపుడూ ఉండలేదేమో... ఇపుడు అదే మనిషికి గుదిబండ అవుతోంది. అది ఎదిగితే ఒక సమస్య, ఎదగకపోతే మరో సమస్య. మానసికంగా పరిణితి చెందని కొందరు వ్యక్తుల గురించి రాసేటప్పుడు నాకో సందేహం. అసలు నా మనసు ఎదిగిందా అని?
-ఎస్. సత్యబాబు

స్మృతి కధలు


వై ఎస్ ఆర్ స్మృతి కధల్లో నా వంతుగా మరొకటి.
-ఎస్. సత్యబాబు

Tuesday, October 13, 2009

లైఫ్ స్టైల్


బోనులో ఉన్నప్పుడు వాటిని ఆడిస్తాం. బయట అవి కనబడితే తోక జాడిస్తాం. జంతువులంటే మనిషికి ఒక్కో సారి వినోదం. ఒక్కో సారి ప్రమాదం. సినిమాల్లో చూసే అడవి అంటేనే మనకు భయం. అలాంటిది రోజుల తరబడి అడవుల్లోనే ఉంటూ వన్యప్రాణులను కెమెరా లో నిక్షిప్తం చేసున్న ఒక ఫోటో గ్రాఫర్ గురించిన కధనం ఇది. జీవితంలో అధిక భాగం కుటుంబానికి దూరంగా వన్యప్రాణులకు దగ్గరగా ఉండే వెంకట్ ఈ అభిరుచి గురించి వైద్య వృత్తిని కూడా వదులుకున్నారు. ఫండే కు రాస్తున్న వార్త కధనాల్లో రెండవ అధ్యాయానికి బ్రేక్. ఇదే చివరిది. మళ్ళీ ఎపుడు రిస్టార్ట్ చేస్తానో...

ఎస్. సత్యబాబు

Thursday, October 8, 2009

సినిమా


ఫిట్ నెస్ కధనాలు రాసి చాల కాలమైంది. సినిమా పేజీలో గత వారం నుంచి రాస్తున్న ఫోకస్ కోసం హీరోయిన్ ఫిట్ నెస్ మీద రాసాను. వారితో ఫిట్ నెస్ ట్రైనింగ్ చేయించిన చంద్ర శేఖర్ వాళ్ల గురించి చెప్పిన విషయాలే ఈ కధనం.

-ఎస్. సత్యబాబు

Wednesday, October 7, 2009

పేరెంటింగ్


పిల్లలకి ఎన్నో నేర్పుతున్నాం, ఒక్క మానవత్వాన్ని తప్ప. మనిషిగా బ్రతకడానికి, మనిషి అని పిలిపించుకోవడానికి కావలసిన మానవత్వాన్ని తప్ప. మనం నేర్పడం మరిచిపోయినా ఒక్కో సారి పరిస్థితులే నేర్పుతాయి. కనీసం అవి నేర్పెటప్పుడైన మనం మేలుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఊళ్ళను ముంచెత్తిన గడ్డు పరిస్థితుల్లో... పిల్లలని సేవోన్ముఖులను చేయాలని చెప్పడమే ఈ కధనం ఉద్దేశ్యం.

-ఎస్.సత్యబాబు

Monday, October 5, 2009

విశ్వరూపం


నిజంగా ... ఒక్కోసారి భయం వేస్తుంది. కొంతమంది ధైర్యాన్ని చూసి. వాళ్లు ఎదుర్కున్న పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే. మనమేగాని అలాంటి పరిస్థితి లో ఉండి ఉంటే... అనే ఆలోచన నిజంగా భయ పెడుతుంది. మంచినీళ్ళు తాగినంత తేలికగా ప్రాణాలు తీసేసే తీవ్రవాదులు మనకు ఎదురు కాకుండా ఉండాలనే కదా కోరుకుంటాం... ఒక వేళ ఎదురైనా మనలని ఏమీ చేయకుండా వదిలితే చాలనుకుంటాం. అంతే గాని వాళ్ళని చంపడం అనే ఆలోచన కలలో కూడా మనకి రాదు. అందుకే ఓ కాశ్మీరీ అమ్మాయి ఇపుడు దేశం ద్రష్టిలో హీరోయిన్ అయింది. ఆమెని సముచితంగా గౌరవించక తప్పని పరిస్థితిని ప్రభుత్వానికి తెచ్చింది. అదే ఈ కధనం.
-ఎస్. సత్యబాబు

Sunday, October 4, 2009

రిపోర్టర్స్ డైరీ

పిచ్చుక ఓ గొప్ప స్నేహశీలి. నిరాడంబర జీవి. అంతే కాదు గొప్ప ఆర్కిటెక్ట్ కూడా. దాని గూడు అది కట్టుకునే తీరు చూస్తె తెలుస్తూంది. చిన్న వయసులో పిచ్చుకల సందడిని చూస్తూ ఆనందించిన వాడిగా... అవి కనుమరుగు అవుతుంటే... ఇలా -అక్షరాలా -భాధ పడుతున్నా.
-ఎస్. సత్యబాబు

Friday, October 2, 2009

ముందుజాగ్రత్త


పుస్తకంలో మరో పేజీ. ఇప్పటిదాకా రాయని ముందుజాగ్రత్త పేజీ. నాకు ఇన్సూరెన్స్ వ్యాపారం లో ఉన్న అనుభవం ఉపయోగపడింది. నిర్మలారెడ్డి బై లైన్ పక్కన చోటు దక్కింది. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు. బీమా అందించే ధీమాని మించిన ధైర్యం లేదు.

-ఎస్. సత్యబాబు

Thursday, October 1, 2009

సినిమా


మరో సారి సినిమా పేజి లో కనిపించాలనుకున్న. నా లుక్ మార్చుకోవదానికో, లక్ మార్చుకోవడానికో మరి. రాసిన కధనం కూడా అలాంటిదే. లక్ ను మార్చే లుక్ కోసం హీరోలు లుక్ మార్చుకుంటున్న వైనం పైన. ఒకప్పటిలా యాక్షన్ తో కాకున్నా ఇలాగన్నజనాలను మెప్పిద్ద్దాము అనుకునే తాపత్రయం అర్ధం చేసుకోదగినదే.

-ఎస్. సత్యబాబు