Monday, March 21, 2011

రిపోర్టర్స్ డైరీ


మనిషికి కలిసి ఉండడం అనేది ఒక సెంటిమెంట్. విడిపోవడం అనేది మరో సెంటిమెంట్. కలిసుంటూ విడిపోవడం అనేది ఇంకో సెంటిమెంట్. పర్లేదు. ఎలాగైనా ఉండవచ్చు. లేనిదే గొప్ప కాబట్టి, లోటు పాట్లు అన్నిటికీ ఏదో ఒక కారణం కావాలి కాబట్టి లేనిదేదో వస్తే అన్నీ ఉన్నవాళ్ళం అయిపోతాం అని నమ్మవచ్చు. సెంటిమెంట్లు, నమ్మకాలు ఏవి ఎలా ఉన్న సరే... మనసుల్ని అలాగే ఉండనిద్దాం. హాయిగా, ఎప్పటిలా కలివిడిగా, కలసికట్టుగా.

-ఎస్. సత్యబాబు

పరిచయం


గాల్లో ఎగరడానికి మాత్రమే కాదు నేల మీద నడపడానికి కూడా చక్రాలు కావాలి. నాలుగు అక్షరం ముక్కలు నాలుగు చక్రాలు గ మారి మనిషిని నడిపించేందుకు, గెలిపించేందుకు కూడా ఉపయోగపడతాయి. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. తెలిసినవారు వారికి తెలియచెప్పాలి. అవసరమైతే తామే బండి కట్టాలి. ఎందుకంటే సమాజమనే బండి సజావుగా నడవలిగా...

-ఎస్. సత్యబాబు

స్పెషల్


పెద్దల మాట చద్దన్నం మూట. పెద్దలకి పెట్టేందుకు చద్దన్నం కూడా కరువే అంటున్న రోజుల్లో... పెద్ద వాళ్ళ మాటలు ఎంత గొప్పవో... అవి వినడం మనకి ఎంత అవసరమో... ఎవరు చెప్తారు?

-ఎస్. సత్యబాబు

Saturday, November 20, 2010

చౌరస్తా


నువ్వు ఎంత గోప్పతన్నాన్ని అయిన ప్రదర్శించవచ్చు. కాని మానవత్వం అనేది దానికి జత కాకపొతే ఆ ప్రదర్శన ఎప్పటికీ గొప్పది కాదు. జపాన్ నేర్చుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం అంటూ లేని రోజు రావచ్చేమో... కాని మరో వైపు ఆ దేశం నేర్చుకోవలసిన కనీస మానవ ధర్మాల చిట్టా చాంతాడులా పెరిగి పోతోంది. అందులో మొదటిది వృద్దుల పట్ల చూపవలసిన భాద్యత.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


కర్ర పుచ్చుకుంటే గాని బుర్రని పని చేయించ లేము. ప్రతి మనిషీ ఇక్కడికి వచ్చింది నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్షా అనుకుంటూ బ్రతికేయడానికి కాదు.. ఎదుటి వారి ఆకలి ని తడిమి... దానిని తీర్చడానికి. ఆ ఆకలి ఏదైనా కావచ్చు. పొట్టకి సంభందించిందో... జ్ఞానానికి సంభందించిందో, ప్రేమకు సంభందించిందో... ఏదైనా సరే మన వద్ద ఉన్న దానిని అది కరువైన వారికి పంచడమే మానవ ధర్మం. సుఖాలను మరిగిన మనిషి భాధ్యతలను మరచిపోకుండా దేవుడు చూస్తున్నాడు. అవసరమైనపుడు కర్ర పుచ్చుకుంటాడు. మనిషి బుర్ర సరిగా పనిచేసేలా చేస్తాడు.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


పెళ్లి... చాలా మందిని ఏకకాలంలో సంతోషపెట్టే భయపెట్టే విషయం. మనిషికి మనిషి తొడు అవసరం. అది ఎప్పటికీ ఉండాలి అంటే పెళ్లి అనే భంధమూ అవసరం. కాని ప్రపంచం ఒక గ్రామంగా మారిపోతూ ఈ భందాన్ని బలహీనంగా మార్చేస్తోంది.. శతదినోత్సవాల నుంచి అర్ధ శతదినోత్సవాలకి, అక్కడ నుంచి పావు శతదినోత్సవాలకి పడిపోతున్న సినిమాల లాగానే వైవాహిక భంధం కూడా చిక్కి పోతోంది. పదేళ్ళు కలిసి కాపురం చేయడం కూడా వేడుక చేసుకునే విషయంగా మారిన పరిస్థితుల్లో... డెబ్బై సంవత్సరాల ఈ దాంపత్యం నుంచి నేర్చుకోవలసింది ఎంతో... ఎంతెంతో... అందుకే ఈ పెద్దల మాట పెళ్ళికి, నవదంపతులకు చద్దన్నం మూట.
-ఎస్. సత్యబాబు

పరిచయం


మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. మానుగా మారితే వంగదు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మన సాంకేతిక సంతర్పణ పుణ్యమా అని పర్యావరణానికి అవుతున్న గాయం ఎన్ని -మొక్క-లు నాటితే -మాను- తుందో... లీల రెడ్డి ఇంటింటికీ తిరిగి మరీ మొక్కలు పంచుతున్నారు. మీ పిల్లల్లా చూసుకోండి అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు. లక్ష మొక్కల నోము పెట్టుకున్నారట ఆమె. ఇలాంటి మొక్కవోని నోములే ప్రమాదకరమైన మానులా మారిన కాలుష్యాన్ని వంచేవి.
-ఎస్. సత్యబాబు