Thursday, February 25, 2010

పరిచయం


మనిషి బ్రతకడానికి నిజ్జంగా ఏం కావాలి? నా అన్న తోడూ, నోటిలోకి నాలుగు మెతుకులు... నుంచి మొదలై, తెలివితేటలూ, డబ్బులు... అలా లిస్టు చాంతాడంత పెరుగుతూనే ఉంటుంది. కాని ఇవేవీ అక్కరలేకుండానే బ్రతుకుతున్న వాళ్ళు మన మధ్యనే ఉన్నారు. మీనాదేవి కూడా అంతే. ఆమె ఒకప్పుడు మంచి నటి. ఇప్పుడు...
ఎస్. సత్యబాబు

మై సెంటిమెంట్


నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవండి. ఈ మాట వినని, అనని వారు తక్కువే. అలాంటివి లేవంటే ఎలాంటివో ఉన్నట్టే కదా. సిని గీత రచయిత భువన చంద్ర కు కూడా అంతే. సెంటిమెంట్స్ ఏమీ లేవుట.

-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


నెలవారీ కార్డు తీసుకుని, రోజూ భోజనం చేస్తూ... భోజనం అనంతరం ఇచ్చే అరటిపండో స్వీటో నిదానంగా తింటూ... ఆదివారం ఒక్క రోజు వండే నాన్-వెజ్ కోసం వారమంతా ఆవురావురుమంటూ వెయిట్ చేయడం... ఇవన్నీ జీవితం లో మధురమైన విందు స్మృతులు. కేవలం మెస్ లలో తిన్న వారికి మాత్రమే దక్కేవి. అనుభూతిన్చాలే కాని ఆనందం ఎందులో లేదు?

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


వరదలంటే... మునిగే జీవితాలు, భాధల బ్రతుకులు. ఒక చోట వరద వస్తే... ఆ ప్రవాహంలో ఎన్నో కొట్టుకు పోతాయ్. ఆ కష్టాల గురుతులు ఎన్నో ఊర్లకు కొట్టుకు వస్తాయ్. చెత్త చెదారం, పాత సామాన్లు.... ఒక్కోసారి... కొన్ని జీవితాలు కూడా. అవి మనల్ని కలిసినపుడు... మన మనసు భాధలో మునిగిపోతుంది.

-ఎస్. సత్యబాబు

Friday, February 19, 2010

సెల్ఫ్ చెక్

ఉన్నత స్థానంలో ఉన్నాము అనే ఆలోచన మన ప్రవర్తనను తీర్చిదిద్దాలి... అంటే తప్ప దిగజార్చకూడదు. ఎదుటి వారి స్థాయి ని తగ్గిస్తే మన స్థాయి పెరుగుతుందా... వారి స్థాయి ని గుర్తిస్తే పెరుగుతుందా... డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గౌరవిన్చేలా మన ప్రవర్తనను మార్చుకోవడంలో... మనం ఎలా ఉన్నాం?
-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


తప్పు పట్టడం చాల ఈజీ. తప్పు తెలుసుకోవడం చాలా కష్టం. తప్పులు పట్టడం అలవాటైతే కూడా చాలా కష్టం. అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటున్నామా మరి?
-ఎస్. సత్యబాబు

ఒకటి సున్నా ఎనిమిది. ఒకప్పుడైతే ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే. కాని ఇప్పుడు... ప్రాణం పోసే సమాఖ్య. అవును. మారు మూల పల్లెల నుంచి మహా నగరాల దాక... ప్రతి చోటా... ప్రతి బాట... కుయ్ కుయ్ కుయ్ మని ప్రతిద్వనిస్తోంది. అరచేత ప్రాణాలు పెట్టుకున్న వారిని రక్షిస్తోంది. ఆ సేవలకు ఎలా విలువ కట్టగలం?
-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


మనలో సినిమా చూసే వారిని ఎందుకు చూస్తున్నారంటే ఆ... ఏదో కాలక్షేపం కోసం అంటారు. అంతే తప్ప అదొక ముఖ్యమైన విషయంలా మాట్లాడరు. సినిమాలు చూసే వాళ్ళు ఎందరో.... కాని ఉత్తమ ప్రేక్షకులు కొందరే.
-ఎస్. సత్యబాబు

Saturday, February 13, 2010

సెల్ఫ్ చెక్


సినిమా అంటే ఇపుడు చాల మందికి కాలక్షేపం. కేవలం టైంపాస్. డబ్బులు, సమయాన్ని ఖర్చు చేస్తూ కూడా సినిమాను మనస్పూర్తిగా ఆస్వాదించ లేకపోతున్నాం. అందుకు ఈ భావన కూడా ఒక కారణం. ఎంతో మంది కళాకారుల సమిష్టి కృషి ఫలంగా వెలుగు చూసే సినిమా ను అంత తేలికగా పరిగణించడం సరికాదేమో... దాని వల్ల లభించే అసలైన అనుభవాన్ని పొందినపుడే... మనం అసలైన సిని అభిమానులం అవుతాం.

-ఎస్. సత్యబాబు

Thursday, February 11, 2010

రిలేషన్ షిప్స్


ప్రతిష్ట కోసం ప్రాణం పెట్టె పల్లె జనాలకు పోట్లగిత్తలు ఒక మంచి పెట్టుబడి మార్గం. అవి ఆదాయానికి ఉపయోగ పడకపోయినా పేరు ప్రతిష్టలను మోసుకు వస్తాయని ఆలోచించి వాటి కోసం ఎంతైనా ఖర్చు పెట్టె వారికి కొదవ లేదు. ఐతే నేను రాసిన ఈ కధనంలో ఒక సన్న కారు రైతు ఎద్దులతో పెంచుకున్న అనుభందం ప్రధాన అంశం.

-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


పోలీసు వాళ్ళని చూస్తేనే మంట కొందరికి. మన అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో జనాభాకు తగ్గట్టుగా లేని పోలీసులు... తీవ్రవాదం, అతివాదం, రోజుకో వివాదం... ఇలా అతి పెద్ద ప్రజాస్వామ్యంలో అన్నిటికీ సమాధానం చెప్పలేని పోలీసులు... వేల పాళా లేని ఉద్యోగం చేస్తున్న పోలీసులు... ప్రజల తిరస్కారానికి కూడా గురవ్వడం... అసలు అన్నీ పోలీసులే ఎందుకు చేయాలి? మనలో ఒక పోలీసు లేడా ...

-ఎస్.సత్యబాబు

సెల్ఫ్ చెక్


అసలు అందానికి నిర్వచనం ఏమిటో... ఒక చోట తెలుపు, మరో చోట చామనచాయ, మరో చోట నలుపు... ఒక చోట పొట్టి, మరో చోట పొడుగు, మరో చోట మధ్యస్తం... ప్రాంతాలవారీగా ప్రమాణాలను మార్చుకునే అందం గురించి ఎందుకు అందరం ఇంతగా పట్టిచ్చుకుంటామో అర్ధం కాదు.

-ఎస్. సత్యబాబు

Friday, February 5, 2010

సెల్ఫ్ చెక్


చేతిలో సెల్ ఫోన్ ఉంటె చాలు. ఇంక ఏమీ అక్కర్లేదు అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. ఐతే సెల్ ఫోన్ వాడుతున్నవారికి తప్పకుండ ఎటికేట్ తెలిసి ఉండాలట. మరి మనకు తెలుసా...

-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


పాకిస్తాన్ ప్లేయర్స్ ని తన పి ఎల్ టీం లోకి తీసుకుంటా అంటే కోపం, తన కి నచ్చిన చిత్రాలను తను గీసుకుంటే కోపం... బాలీవుడ్ సూపర్ స్టార్ కావచ్చు, టాప్ ఆర్టిస్ట్ ఎం. ఎఫ్. హుస్సేన్ కావచ్చు. ఎవ్వరికీ భావవ్యక్తీకరణ స్వేఛ్చ లేనట్టేనా... ఈ ఒరవడి దేనికి సూచిక? ఇదే కరెక్ట్ అని మన పిల్లలు అనుకుంటే భవిష్యత్తులో జనం నోరేత్తగలరా...

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


సాఫ్ట్ గ వేల్లిపోతున్నంత కాలం అన్నీ బావుంటై. కొంచం హార్డ్ అయితేనే సాఫ్ట్ వేర్ అంటూ వెతుకుతాం. ఆర్ధిక మాంద్యం వల్ల అమీర్ పేట లో బ్యానర్స్ పలచబడ్డై. కోచింగ్ సెంటర్స్ కు కోతపడింది. ఇవన్నీ పనిమంతులకు పట్టవు. వారికి ఆర్దిక మాంద్యం అంటే ఏమిటో తెలియదు. అందుకేనేమో... పని మాంద్యం వారికి ఎపుడూ ఉండదు.

-ఎస్. సత్యబాబు

మై సెంటిమెంట్


సెంటిమెంట్లు లేక పొతే వారిని మనుషులు అనడానికి కూడా సందేహిస్తారు చాలామంది. ఐతే అదే సెంటిమెంట్లు ఎక్కువై కూడా కొంతమంది మనుషుల మని మర్చిపోతారు. అది వేరే విషయం. ఎదుటివారికి హాని చేయనివి, వినడానికి, కనడానికి కూడా ముచ్చటగా, ముద్దుగావుండేవీ మనల్ని ఆకట్టుకున్టై. వాటిని గుర్తు చేసుకోవడానికే...

-ఎస్. సత్యబాబు