Wednesday, August 26, 2009

మిస్టరీ


ప్రతీది రహస్యమే తెలిసేవరకూ... విచిత్రమేమిటంటే రహస్యం కాస్తా ముడి విడిపోతే దానికి విలువ కూడా పడిపోతుంది. మనిషి అలా చాల విషయాల విలువ పడిపోయేటట్టు చేసాడు. చేస్తూనే ఉన్నాడు. అంట మాత్రాన నాదే విజయం అని పొంగిపోవడానికి కూడా లేదు. ఇంకా విలువ కోల్పోనివి చాల ఉన్నాయ్. అదే ఈ కధనం. మొదటి సారిగా మిస్టరీ రాసాను.

-యస్. సత్యబాబు

Monday, August 24, 2009

విశ్వరూపం


అమెరికా లో ఎవరో కూలింగ్ వాటర్ తాగితే ఇండియా లో ఎవరికో జలుబు చేసిందట. అదేంటీ అని అడిగితె గ్లోబలైజేషన్ అని సమాధానం ఒకటి. ఇంటర్నేషనల్ గ పవర్ ఫుల్ లేడీస్ లిస్టు ఫోర్బ్స్ పబ్లిష్ చేసింది. అందులోనుంచి స్టైలిష్ లిస్టు ని మరో వెబ్సైటు ప్రచురించింది. దాన్ని తెలుగు పాఠకులకు మేము అందించాము. ప్రపంచమే కుగ్రామం అయిపోయినప్పుడు మనకి అనవసరం అంటూ ఏదీ ఉండదేమో. మహిళల విజయాల వెనుక వారి లైఫ్ పార్ట్ నర్ ఉంటాడో లేదో గాని వాళ్ల స్టైల్ మాత్రం ఉంటుందట.

-యస్. సత్యబాబు

Friday, August 21, 2009

పరిచయం


ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఆలోచన వచ్చిన దగ్గరనుంచి పెద్ద పెద్ద ప్లాన్స్ వేసేవారు ఉన్నారు. నిలబడి నీళ్లు తాగుదామని అనుకునేవాళ్లు తక్కువ. అల్లాంటి వాళ్లు తప్పకుండ విజయాల పాలు రుచి చూస్తారు. మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు.

స్ఫూర్తి నింపే మనుష్యులు చుట్టూతా ఉన్నారు. ఎక్కడో వెతకనక్కర్లేదు. నేను ఈ మాటని బలంగా నమ్మే వ్యక్తిని. భీమవరం దగ్గర్లోని చిన అమిరం అనే చిన్న గ్రామం లో నివసించే రామసీత స్వీట్స్ తయారీలో స్పెషల్. ఆవిడ ను కలిసి నేను తయారు చేసిన ఈ స్టొరీ కూడా అందుకే స్పెషల్.

-యస్. సత్యబాబు

Thursday, August 20, 2009

రిపోర్టర్స్ డైరీ


నవనాగరీకులం మనమంతా. సున్నితం, సెన్సిటివ్ నెస్ మనసంతా. ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకుంటాం. ఎడా పెడ విశ్లేషించి పారేస్తుంటాం. కాని సమస్య మనదైన రోజున బేర్ బేర్ మంటాం. అంతటి కష్టం ఎవరికీ రాకూడదంటూ బెంగపడి పోతుంటాం. ఎందుకంటే మనమంతా నవనాగరీకులం. ఐతే దీనికి భిన్నంగా కొందరుంటారు. అ అంటే పక్కన న్నం తప్ప మరేమీ లేదనే వారు. కష్టమే జీవిత అభీష్టం అన్నట్టుగా ఉండేవారు. వారికి ప్రపంచం గురించి తెలీదు. వారి ప్రపంచం లో వారుంటారు. మాటల్లో, చేతల్లో ఎక్కడా సున్నితత్త్వం లేనట్టు ఉండే వీరికి తాము బ్రతకడం మాత్రమే తెలుసు. తమవార్ని బ్రతికించుకోవడం మాత్రమే తెలుసు. అదెలాగో తెలుసుకోవలసిన అవసరం ఇపుడు మనకుంది.
-యస్. సత్యబాబు

Wednesday, August 19, 2009

విశ్వరూపం


చల్లని సి వాతావరణం, అడుగడుగునా ఉట్టిపడే రిచ్ నెస్, హాల్లో, వాష్ రూం లలో కూడా ఎలా బిహేవ్ చేయాలో చెప్పే బోర్డులు... ఇవన్నీ ఉంటే చాలా? మహిళలు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చా ? అలాంటి ఆఫీసుల్లో ఉన్నవాళ్ళంతా మర్యాదస్తులేనా? పైకి డీసెంట్ గ కనపడే పురుష పుంగవులు పంపే సెల్ ఫోన్ సందేశాలు, మెయిల్స్ చూపే రెండో కోణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు జాబ్ చేసే మహిళలే జవాబు చెప్పాలి. అవును. వారే చెప్పారు. విశ్వరూపం పేజి మహిళలకోసం స్పెషల్. అది నన్ను కూడా మహిళా పక్షపాతి గ మార్చేస్తున్నట్టుంది.

-యస్. సత్యబాబు

లైఫ్ స్టైల్


చిన్న ఉత్తరం. చాల పెద్ద భాద్యతలు మోస్తుంది. దాని విలువను మనం మర్చిపోతున్నామనిపిస్తోంది. సొంతవారికి కూడా ఉత్తరం రాసే తీరిక దొరకని ఈ రోజుల్లో పనిగట్టుకుని అందరి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఒక మాజీ వైద్యుడు చేపట్టిన ఉత్తరాల ఉద్యమం ఇది. అర్ధవంతమైన అభిరుచులను గుర్తించాలని, నలుగురూ గుర్తించేలా చెయాలని ఫండే లో నేను రాస్తున్న కధనాల పరంపర కూడా బహుశ అలాంటి ఉద్యమమే కావచ్చు. కాని ఈయన శ్రమ మాత్రం సాటిలేనిది.

-యస్. సత్యబాబు

Monday, August 10, 2009

విశ్వరూపం


తల్లుల తొడు లేకుండా కూడా సినిమా సెట్స్ మీద ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకుంటున్న కధా నాయికల గురించిన కధనం ఇది. విశ్వ రూపం పేజీకి ఇస్తున్న స్టోరీస్ చూస్తుంటే నా విశ్వరూపం చూపిస్తున్నట్టుంది. రాసి సరే మరి వాసి సంగతేమిటి? ఆ ఒక్కటి అడగొద్దు.

-యస్. సత్యబాబు

Sunday, August 9, 2009

లైఫ్ స్టైల్


సంతకాలను చేదించే సైనికుడు రెండో పార్ట్ ఇది.

-యస్. సత్యబాబు

లైఫ్ స్టైల్


తెలియని విషయమేమీ కాదు. రణధీర్ గురించి గతంలోనూ ఎన్నో కధనాలు వచ్చాయి. కొత్తగా రాయడానికి ఏముంటుందని? ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడం ఫైటర్స్ సంతకాల ప్రదర్శన పెడుతున్నట్టు ఆయన చెప్పగానే తీగ కాలికి తగిలింది. ఫండే కి స్టోరీగా మారింది. వేదకబోయే తీగలు కాలికి తగిలితే ఆనందమే. కాని కాలికి అడ్డం పడితేనే...

-యస్. సత్యబాబు

Thursday, August 6, 2009

రిపోర్టర్స్ డైరీ


నిజంగా భక్తుడు కోరిందీ దేవుడు ప్రసాదించినదీ ఒకటే అన్నట్టు ఉంది. నాలోని భావాలను కాస్తైనా స్వేచ్ఛగా అక్షర బద్దం చేసే అవకాశం కోసం చేసిన తపస్సు ఫలించింది. ఈ సోదంతా రిపోర్టర్స్ డైరీ గురించే. రోడ్ మీద పసిపిల్లలను పడుకోబెట్టి వ్యాపారమో, మరేదైననో చేసుకోవడం లోని సాధక బాధకాలు ఎలా ఉన్నా... అది చూసే వారికి మాత్రం బాధ కలిగించడం ఖాయం. ఆ నా బాధ ఈ కధనం.

-యస్. సత్యబాబు

Monday, August 3, 2009

విశ్వరూపం


నిర్విరామంగా రాస్తున్న పేజి ఏదైనా ఉందంటే అది ఇదే. కేవలం బై లైన్ కోసం మాత్రమే రాస్తున్న పేజి కూడా ఇదే. మన లోని ఆత్రమో, మాధవన్నయ్య పుణ్యమో... జయహో విశ్వరూపం.

-యస్. సత్యబాబు

Sunday, August 2, 2009

లైఫ్ స్టైల్


ఫండేలో పరంపర మొదలు. పునరాగమనాన్ని ఘనంగానే చాటుతున్నట్టున్నా. కొన్ని వాహనాల ద్వారా పాఠశాలల్లో సైన్సు ల్యాబ్ వంటివి నిర్వహిస్తూన్న డాక్టర్ గురించి కధనం ఇది. ఫండే లో ఈ పరంపర సుదీర్ఘ కాలం కొనసాగించాలనేది ప్రస్తుత ఆశయం. ఆశయ సాధనలో అడ్డంకులు ఎలా ఎదుర్కోవాలో... అసలు అడ్డంకులు ఉన్నాయా...

-యస్. సత్యబాబు

Saturday, August 1, 2009

రిపోర్టర్స్ డైరీ


ఈ యాచకులతో నాకేదో అనుబంధం ఉన్నట్టుంది. వరుసగా రాస్తున్నాను. రిపోర్టర్స్ డైరీ ప్రారంభమైన దగ్గరనుండి రాసిన వార్త రాయకుండా. స్మాల్ అండ్ స్వీట్ అంటే ఇదే. చిన్న వార్తలైన దమ్మున్న వార్తలుగా ఇవి చాలామందిని ఆకట్టు కుంటున్నై.

-యస్. సత్యబాబు