Saturday, November 20, 2010

చౌరస్తా


నువ్వు ఎంత గోప్పతన్నాన్ని అయిన ప్రదర్శించవచ్చు. కాని మానవత్వం అనేది దానికి జత కాకపొతే ఆ ప్రదర్శన ఎప్పటికీ గొప్పది కాదు. జపాన్ నేర్చుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం అంటూ లేని రోజు రావచ్చేమో... కాని మరో వైపు ఆ దేశం నేర్చుకోవలసిన కనీస మానవ ధర్మాల చిట్టా చాంతాడులా పెరిగి పోతోంది. అందులో మొదటిది వృద్దుల పట్ల చూపవలసిన భాద్యత.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


కర్ర పుచ్చుకుంటే గాని బుర్రని పని చేయించ లేము. ప్రతి మనిషీ ఇక్కడికి వచ్చింది నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్షా అనుకుంటూ బ్రతికేయడానికి కాదు.. ఎదుటి వారి ఆకలి ని తడిమి... దానిని తీర్చడానికి. ఆ ఆకలి ఏదైనా కావచ్చు. పొట్టకి సంభందించిందో... జ్ఞానానికి సంభందించిందో, ప్రేమకు సంభందించిందో... ఏదైనా సరే మన వద్ద ఉన్న దానిని అది కరువైన వారికి పంచడమే మానవ ధర్మం. సుఖాలను మరిగిన మనిషి భాధ్యతలను మరచిపోకుండా దేవుడు చూస్తున్నాడు. అవసరమైనపుడు కర్ర పుచ్చుకుంటాడు. మనిషి బుర్ర సరిగా పనిచేసేలా చేస్తాడు.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


పెళ్లి... చాలా మందిని ఏకకాలంలో సంతోషపెట్టే భయపెట్టే విషయం. మనిషికి మనిషి తొడు అవసరం. అది ఎప్పటికీ ఉండాలి అంటే పెళ్లి అనే భంధమూ అవసరం. కాని ప్రపంచం ఒక గ్రామంగా మారిపోతూ ఈ భందాన్ని బలహీనంగా మార్చేస్తోంది.. శతదినోత్సవాల నుంచి అర్ధ శతదినోత్సవాలకి, అక్కడ నుంచి పావు శతదినోత్సవాలకి పడిపోతున్న సినిమాల లాగానే వైవాహిక భంధం కూడా చిక్కి పోతోంది. పదేళ్ళు కలిసి కాపురం చేయడం కూడా వేడుక చేసుకునే విషయంగా మారిన పరిస్థితుల్లో... డెబ్బై సంవత్సరాల ఈ దాంపత్యం నుంచి నేర్చుకోవలసింది ఎంతో... ఎంతెంతో... అందుకే ఈ పెద్దల మాట పెళ్ళికి, నవదంపతులకు చద్దన్నం మూట.
-ఎస్. సత్యబాబు

పరిచయం


మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. మానుగా మారితే వంగదు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మన సాంకేతిక సంతర్పణ పుణ్యమా అని పర్యావరణానికి అవుతున్న గాయం ఎన్ని -మొక్క-లు నాటితే -మాను- తుందో... లీల రెడ్డి ఇంటింటికీ తిరిగి మరీ మొక్కలు పంచుతున్నారు. మీ పిల్లల్లా చూసుకోండి అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు. లక్ష మొక్కల నోము పెట్టుకున్నారట ఆమె. ఇలాంటి మొక్కవోని నోములే ప్రమాదకరమైన మానులా మారిన కాలుష్యాన్ని వంచేవి.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


యుద్ధం. ఆ పదమే చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక యుద్దరంగంలో ఉన్నవారికి శక్తి ఇంటి పేరు అవుతుంది. దేశభక్తి వారి వంటి పేరుగా అంటిపెట్టుకుంటుంది. అందుకేనేమో... సైనికులను గౌరవించడానికి ఎన్ని పదాలైన సరిపోవు. పదాల గారడీ కన్నా, మాటలతో మాయ చేయడం కన్నా... చేతలతో వారిపైన ఉన్న గౌరవాన్ని చాటడానికి ఎం చేయాలి? ఇక్కడ ఒక నలుగురు చేతలే సమాధానం.
- ఎస్. సత్యబాబు

చౌరస్తా


నేరం చేసిన వాడు చట్టానికి చిక్కలి. శిక్షకు గురి కావాలి. అప్పుడే జనానికి పోలీసుల మీద, ప్రభుత్వం మీద మొత్తంగా వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే ఆ నమ్మకం ఏర్పడకపోవడం మాత్రమే కాదు... రేపు నేను నేరం చేసినా తప్పిన్చుకోవచ్చుననే నమ్మకం పెరిగిపోతుంది. అది సమాజానికి ప్రమాదం. ఒక సీరియల్ కిల్లెర్ ఇప్పటికీ దొరకక పోవడం అంటే ప్రమాద ఘంటిక మొగినట్టే.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


రోగం చెడ్డది. దానికి పాప పుణ్యాలు లేవు. దయ దాక్షిణ్యాలు లేవు. ఇవన్నీ లేక పోయినా పర్లేదు. దానికి బీదా గొప్ప తేడా కూడా లేదు. అదే పెద్ద సమస్య. ఈ విషయం మనకి తెలుసు. ఎన్ని ఆరోగ్యశ్రీలు వచ్చినా నిరుపేదను కాపాడలేవనీ తెలుసు. కాని రాజేష్ కి దీనితో పాటే తన వంతుగా చేయాల్సినది కూడా తెలుసు. అదే చేస్తున్నాడు. అనాధ రోగులను అక్కున చేర్చుకుంటున్నాడు. నేటి కుర్రాళ్ళకు తోటి మనిషి భాధలకు స్పందించడం తెలుసు అని నిరూపిస్తున్నాడు.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


అమ్మను చూడడానికే వంతులు వేసుకునే దరిద్రపు రోజులివి. ఇక అవ్వను చూడాలి అంటే... మా వల్ల కాదని తేల్చి చెప్పేస్తారు. ఒకప్పుడు నూరేళ్ళు బతకడం అంటే ఎంతో గొప్ప. ఇప్పుడు వయసు పెరుగుతుంటే భయం. ఇంకా బతకవలసి వస్తుందేమో... పిల్లల చీత్కారాలు పడవలసి వస్తుందేమో అని ఆందోళన. ఒక బామ్మ గారు నూట ఆరేళ్ళు బతికారు. కాదు కాదు ఆమె కుటుంబ సభ్యులే ఆమెను శతక విజేతను చేసారు. అవ్వకు జై. అనుభందాలకు జై.
-ఎస్. సత్యబాబు

వానకతలు


ఒక్కసారిగా వాన వచ్చి మీద పడితే... తలారా స్నానం ఇలా చేయాలిరా భడవా... అని నేర్పినట్టు ఉంటుంది . అమ్మ లాంటిదే వాన కూడా. అన్నం పెట్టినా... నెత్తి మీద ఆప్యాయంగా మొట్టినా... అమ్మకు సాటిలేదు. వానకూ సాటి లేదు.
-ఎస్.సత్యబాబు

పరిచయం


కాసేపు మాట్లాడకుండా నోరుమూసుకో... అంటే తెగ గింజు కుంటాం. అసలు మాట్లాడకుండా ఉంటే ఎలా? అడగక పొతే అమ్మ ఐనా పెట్టదు అంటారు... మరి మాటకు నోచుకోని వారి పరిస్తితి? పుట్టుకతోనే మాట చచ్చిపోయిన వారి సంగతేమిటి? వారి హక్కుల గురించి ఎవరు మాట్లాడతారు? మూగ వ్యక్తిని భర్తగా మార్చుకున్న నస్రీన్ మూగ భాష నేర్చుకున్నారు. అంత కాదు వారి గుండెల్లోని ఆవేదనను కూడా తెలుసుకున్నారు. అందుకే ఆమె మాట్లాడుతున్నారు. మూగ వాళ్ళ తరపున పోట్లాడుతున్నారు...
-ఎస్.సత్యబాబు

Thursday, November 4, 2010

రిపోర్టర్స్ డైరీ


వంటింటి నుంచి బయటకు వస్తే... విశాలప్రపంచం దర్శనమిస్తుంది. ఆడదానిగా మాత్రమే కాదు ఒక వ్యక్తిగా కూడా తనను తానూ ఆవిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ పని ఇందిర చేసారు. భర్త, పిల్లల సేవలో గడుపుతూ... గడప దాటని మహిళ గొప్ప ఇల్లాలు అనిపించుకోవచ్చు. కాని ఆమె జీవితం గొప్పది అనిపించుకోదు.
ఇదే ఇందిర తన షార్ట్ ఫిలిం లో చెప్పారు. తనూ చేసి చూపారు.
-ఎస్. సత్యబాబు

పెరెంటింగ్


భగవంతుడు తలరాత రాస్తాడట. దాన్ని మన చేతి రాతతో మార్చగలమా... చిన్నపిల్లలకు చక్కని దస్తూరి వచ్చేల చేస్తే అది వారిని వృద్దిలోకి తీసుకేల్తుందట. నవతరపు రాతనిపుణులు చెప్తున్న మాట ఇది.
-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


విలేఖరిగా భాద్యతలు నిర్వహించడం మొదలుపెట్టి దాదాపు పదేళ్ళు కావస్తోందేమో... ఎన్నో సార్లు ఎంతో మందికి మనస్సు చివుక్కు మనిపించేవి, నా మీద కోపం కలిగించేవి, కొండకచో పగను పుట్టించేవి కూడా రాసుంటాను... అలాగే దీనికి పూర్తీ విరుద్దమైన భావాలు ఇతరులలో కలిగించేవి కూడా రాసుంటాను. అలాగే నాకు తృప్తిని ఇచ్చేవి, అసంతృప్తిని మిగిల్చేవి... లాంటివి కూడా ఎన్నో రాసుంటాను. ఏదైనా రాసి మాత్రమే దాని ఫలితాన్ని చవి చూడడం అలవాటైన నాకు ఈ సారి ఒక వింతైన అనుభవం... రాయనందుకు, అసలు రాయాలనే ఆలోచనే నాకు వచ్చినందుకు.... నేను మనస్పూర్తిగా భాధ పడ్డ అంశం ఇది. మన స్థిమితం లేని ఒక పిచ్చి తల్లి కి ఎలా క్షమాపణలు చెప్పాలో....
-ఎస్. సత్యబాబు

Saturday, October 2, 2010

చౌరాస్తా


బిల్లా రంగాలు ఒక చిన్నారిని చాలా క్రూరంగా చంపి కొంతకాలం పాటు ప్రజల చేత అసహ్యించు కోబడ్డారు. ఐతే ఇప్పుడు అంతకు మించిన క్రూరత్వం సమాజాన్ని ఆవహించింది. చిన్నారులు ఎంతో మంది దానికి ప్రతిరోజూ బలి అవుతూనే ఉన్నారు. ఇప్పుడు బిల్లా రంగాలను గుర్తు చేసుకుంటే అసహ్యం కలిగే పరిస్తితి ఉందా?

-ఎస్.సత్యబాబు

Tuesday, August 10, 2010

చౌరస్తా


మరో నేర ఉదంతం.
-ఎస్. సత్యబాబు

చౌరస్తా


కొన్ని నేరాలు కొంతమంది నేరస్తులు చరిత్రలో నిలిచిపోతారు. వారి జీవితాలు మనం తరచుగా తలచుకుంటాం. ఐతే ఆ తలంపు మానవత్వానికి తలవంపులు తెచ్చే మరిన్ని నేరాలకు దోహదం చేస్తుండడమే ఇప్పటి విషాదం.

-ఎస్. సత్యబాబు

పరిచయం


రోడ్డు మీద ఒక పక్కగా నుల్చుని వుంటారు. నాసిరకం పౌడర్ పూసుకుని, ఆకలికి బక్క చిక్కిన వంటిని చూపించీ చూపించకుండా బలిసిన మారాజుల్నికవ్వించుతున్నాం అనుకుంటారు. వందో యాభయ్యో... ఒక పూట భోజనం. అదీ అంత తేలికగా రాదు. స్టార్ హోటల్ ని కన్నెత్తి చూడడానికి కూడా జంకే పోలీసోల్ల దగ్గరి నుంచి రోడ్డు మీద పడే అచ్చోసిన ఆంబోతులా దాక అందరికీ ఆట బొమ్మలు వీరే. ఈ మధ్య వీరిని నమ్మించి వీరి ఆకలి తీరుస్తామని నమ్మించి, తమ ఆకలి తీర్చుకుని ఆ తర్వాత డబ్బులు అడిగితే ప్రాణాలు తీయడం కూడా జరుగుతోంది. అసలు వ్యభిచారం అంటే ఏమిటి? అదే తప్పు ఐతే శారీరకంగానో మానసికంగానో మనలో ఆ తప్పు చేయని వారున్నార?

-ఎస్. సత్యబాబు

Monday, June 28, 2010

పరిచయం


దేవుడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు. మనిషి నడవడానికి వీల్లేకుండా చేస్తున్నాడు.
ఎ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం? పాదచారి చరిత్ర సమస్తం వాహన పీడన ప్రమాద నృత్యం.
సర్కస్ లో ఫీట్లు నేర్చుకున్న వాడైనా హైదరాబాద్ రోడ్ల మీద నడిచే సాహసం చేయగలడా?
పాదచారం పెద్ద అపచారంగా మారుస్తోన్నది ఎవరు?
ఇలాంటి విషయాలపై కాంతిమతి రోడ్డెక్కారు.
నడిచేవారి హక్కుల కోసం ఫీట్లు చేస్తున్నారు.
-ఎస్.సత్యబాబు

విశ్వరూపం


అహంకారంతో కొన్నిసార్లు, అతిశయంతో మరికొన్ని సార్లు, అవివేకంతో ఇంకొన్నిసార్లు, అనుమానంతో ఎన్నో సార్లు... మనకి కళ్ళు మూసుకుపోతాయ్. నిజాన్ని చూడగలిగినప్పుడు... ఎటువంటి పొరలు కమ్మని స్పష్టమైన చూపు ఉన్నప్పుడు మాత్రమే ఆ చూపు నిజమైనది అవుతుంది.
కళ్ళతోనే కాదు మనసుతో కూడా చూడవచ్చు. ఆత్మవిశ్వాసంతో కూడా చూడవచ్చు.

-ఎస్.సత్యబాబు

పరిచయం


పెళ్ళిళ్ళు అన్నీ ఒకలా ఉండవు. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీలో. నిఖా పేరుతొ అమ్మాయికి వృద్ద వరులతో జరిగే తంతు, ఆ తర్వాత ఆ అమ్మాయి పడే భాధలు ఇప్పటికీ కొనసాగుతూ ఉండడమే విచిత్రం. ముక్కు చెవులు కోసే మొగుళ్ళు, నిఖా ముసుగులో మోసం చేసే సంపన్నులు, ఆడపిల్లలను ఆదాయ మార్గాలుగా భావించే తల్లి తండ్రులు... వీరందరి మధ్య చిక్కుకున్న అమ్మాయిలను రక్షించడానికి ఎంత మంది జమీల నిషాత్ లు రావాలో...
-ఎస్.సత్యబాబు

Friday, June 25, 2010

సెల్ఫ్ చెక్


నిలబడడానికి, నడవడానికి కాళ్ళు ఉంటే చాలు. కాని మాట మీద నిలబడడానికి సత్తా ఉండాలి. ఇచ్చిన మాట తప్ప కుండా పాస్ అవ్వడానికి మాట ఇచ్చే ముందే మనుషుల్ని మనసుల్ని బట్టి పట్టే నేర్పు ఉండాలి. మొత్తం మీద మన మాటకు విలువ ఉంటేనే మనకు విలువ ఉంటుందనే విషయం ఎప్పుడూ గుర్తుండాలి.
-ఎస్.సత్యబాబు

విశ్వరూపం


ఆరడుగుల ఎత్తు ఉంటె అందంగా ఉండడానికి అర్హత వచ్చినట్టే. ఐతే అది అబ్బాయిలకే. మరి అమ్మాయి ఆరు అడుగులు ఉంటే... అందాల తారగా మారి అందనంత ఎత్తు ఎదుగుతా అంటున్న రెహా చెప్పిన సంగతులవి.

-ఎస్.సత్యబాబు

స్పెషల్


పూనకం రావాలంటే దేవుడే పూనాలా? కంట నీరు తిరగాలంటే కష్టమే రావాలా? నిద్రపోవాలంటే ఉయ్యాల కావాలా? ఊహల్లో వూరేగాలంటే లాటరీ గెలవాలా... నా అన్న వాళ్ళు గుర్తుండాలి అంటే ఆల్బం లు నిండాలా...

పాట ఒక్కటి ఉంటె చాలదా... మన వెంట.

-ఎస్.సత్యబాబు

పరిచయం


మనకి బుర్ర పని చేస్తోందా... ఈ ప్రశ్నవేసుకోవలసిన అవసరం జీవితంలో మనకు ఎన్ని సార్లో వచ్చి ఉంటుంది. పైసా నష్ట పోయినా పనిలో వెనుకబడినా... ఎన్నో సార్లు అసలు బుర్ర ఉందా అని కూడా తిట్టుకునే ఉంటాం. కాని వారికా అవసరం రాదు. బుద్దిమాంద్యం ఉందని వైద్యలోకం అచ్చుగుద్దిన జీవితాలు వారివి. వారిని వారి మానాన వదిలేస్తే... ఇంతతిండి పెట్టి సరిపోతుంది అనుకుంటే... వారి బుద్ది వికసించేందుకు, వారి కాళ్ళ మీద వారు బతికేందుకు సాటి మనిషిగా కూసింతైనా చేయూత అందివ్వకపోతే... ... మనకు బుర్ర పనిచేస్తోందా?

-ఎస్.సత్యబాబు

రిలేషన్ షిప్స్

కృష్ణ రామ అనుకోవలసిన వయసులో... అంటూ మొదలుపెడితే... అది ఎంత వయసు వారి గురించో యిట్టె చెప్పెయవచ్చు. చలాకీగా చిన్న పిల్లలతో సమానంగా హుషారుగా తిరిగే వాళ్ళని చూస్తె వారికి ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది అని అనడానికి మనసు రాదు. తిరుపతిలో నేను కలిసిన దంపతులను చూసినా, వారు చేస్తున్న సేవను చూసినా... మరో మాట మాట్లాడడానికి నోరు పెగలదు.

ఎస్.సత్యబాబు

రిలేషన్ షిప్స్

Thursday, June 24, 2010

విశ్వరూపం


పద్నాలుగు సంవత్సరాలు. మహిళ బిల్లు ఇంకా చట్ట సభల్లో ఆమోదం పొందలేదు.. రాజకీయాల లోకి రావడానికి, చట్ట సభల్లో మహిళ ప్రాతినిధ్యం ౩౩ శాతం కావాలని నిరీక్షిస్తున్న మహిళల కల నెరవేరుతుందా... అసలీ రాజకీయ నేతల్లో అసలు చిత్త శుద్ధి ఉందా...
-ఎస్.సత్యబాబు

Tuesday, June 8, 2010

పరిచయం


పర్యావరణం పరిరక్షించాలి అంటూ ఎ సి హోటల్స్ లోజరిగే సెమినార్లు, లఘు చిత్ర ప్రదర్శనలు చాలా చూసాను. అవన్నీ మరుసటి రోజు పేపర్లో పెద్దగ ప్రింట్ అవ్వడం కూడా. కాని తను ఉండేది బస్తి ఐనా కాలనీ ఐనా దాన్ని శుబ్రంగా ఉంచుకుందాం అని తపన పడే వాళ్ళ గురించి మాత్రం పెద్దగ వినలేదు. చూడ లేదు. అందుకే ఈ మహిళల గురించి తెలియగానే వీరిని ప్రపంచానికి పరిచయం చేద్దాం అని తపన పడ్డాను. అది వీరి కోసం కాదు. ఇది చదివే వారిలో కలిగే స్పూర్తి కోసం.

-ఎస్. సత్యబాబు

విశ్వరూపం


మరో జీవికి జన్మని ఇవ్వడం అంటే అది తన జీవితం పైన ఆశలు వదులు కోవలసినంత పెద్ద కష్టమా.... ఇప్పటికీ అలాంటి దుర్భర పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా... అవును అనే సమాధానానికే ఈ ఛాయ చిత్ర ప్రదర్శన కట్టుబడింది. సందర్శకుల అభివృద్ధి కలలకు అడ్డుపడింది.

-ఎస్. సత్యబాబు

Friday, May 28, 2010

రిలేషన్ షిప్స్


హైదరాబాద్ బస్సు స్టాండ్ లో దిగి ఒక్కసారి ఆ సిటీని చూడగానే గుండె గుభిల్లుమంటుంది. ఈ మహా నగరంలో ఎక్కడ ఉండాలి? ఎం చేయాలి? బ్రతుకు తెరువును వెతుక్కుంటూ మహానగరాలకు వచ్చేవారికి నిలువ నీడ దొరకడం ఎంత కష్టమో... ఎంత ఖరీదో... ఇది అనుభవించిన అమర్నాథ్ లాంటి వారికి బాగా తెలుసు. అందుకనే ఆ నీడ తానె కావాలని ఈ వికలాంగుడు ఆరాటపడుతున్నాడు.

-ఎస్.సత్యబాబు

రిలేషన్ షిప్స్




సంస్కారం ఉన్న్న వ్యక్తుల్ని గౌరవిస్తాం. మనిషి చివరి నిమిషంలో కూడా సంస్కారాన్ని ఆశిస్తాడు. డబ్బులేకపోవడం, నా అనే వాళ్ళు లేకపోవడం... వంటి ఎన్నో లేకపోవడాలు... ఈ లోకం నుంచి వెళ్ళిపోతూ ఒక మనిషి కోరుకునే అంతిమ సంస్కారానికి కూడా నోచుకోలేకుండా చేస్తున్నాయి. దీనికి తమ వంతు సమాధానం చెప్తున్న ఈ అన్నదమ్ములను మించిన సంస్కార వంతులు ఎవరున్నారు?


-ఎస్. సత్యబాబు

విశ్వరూపం


ఆడవాళ్ళు కండలు తిరిగే దేహాన్ని సొంతం చేసుకుంటే... ఆ లుక్కే వేరు. వంపుసొంపులు సొంతం చేసుకునే పనిలో ఇక మగవాళ్ళు భేషుగ్గా నిమగ్నమవ్వచ్చు.

-ఎస్. సత్యబాబు

పరిచయం


అన్ని సినిమాలూ ఒకేలా వుండవు. అన్ని వరకట్న వేధింపుల కేసులూ ఒకలా ఉండవ్. మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కే ఆడవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. మీడియా కు అటువైపు దృష్టి సారించాల్సిన సమయం వచ్చేసింది. వివాహితులైన ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గత కొంతకాలంగా నివేదికలు వెల్లడిస్తున్నాయ్.

-ఎస్. సత్యబాబు

పెరెంటింగ్

ప్రపంచం కుగ్రామం అవుతుంటే సంస్క్రుతులన్నీ సంగమిస్తున్నాయి. ఎవరు ఏదైనా నేర్చుకోవచ్చు. కళాభిలాషను తీర్చుకోవచ్చు. చిన్నపిల్లలు కూచిపూడి నృత్యం చేసినా... పాప్ రాగాలు తీసినా ముచ్చటగానే ఉంటుంది. ఐతే అది శృతి తప్పకుండా చూసుకోవలసిన భాధ్యత తప్పనిసరిగా మనదే.
-ఎస్. సత్యబాబు

విశ్వరూపం

హద్దుల్లో ఉండి ఎన్ని సాధించినా హద్దులు దాటి సాదించిన విజయాలతో పోల్చలేం. మహిళలు గెలుపుబాట పట్టడం ఎప్పుడో ప్రారంభమైంది. ఇపుడు ఆ బాటలో వాళ్ళు దాటుతున్న హద్దులు, చేరుతున్న మైలురాళ్ళను కళ్ళింత చేసుకుని చూడడం చాలా బావుంది.
-ఎస్. సత్యబాబు

ఫండే


పుస్తకాల విలువ తెలుసుకోలేకపోతే పుట్టడమే దండగ. అందులో సందేహం లేదు. మనలో చాలా మందికి పాత బడిన పుస్తకాలు పారేయాలన్నా కూడా ఏదో భాధ. ఎంత పాతబడిన విలువ కోల్పోనిది ఒక్క పుస్తకం మాత్రమేనేమో... చివరి ముక్క చిరిగే వరకూ చేతనైనంత సేవ చేసేది కూడా అదొక్కటే.
-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


ఎంత చెట్టుకు అంత గాలి. మనిషి కూడా అంతే. ఎంత స్థాయికి అంత ఇగో. ఒక్కోసారి మన స్థాయిని కూడా ఇది మించి పోతుంది. ఈజీ గోయింగ్ మనిషికి గొప్ప సుఖాన్నిస్తుంది. ఇగో పెరుగుతున్న కొద్దీ మన ఫేసు లో గ్లో తరిగిపోతుంటుంది.

-ఎస్. సత్యబాబు

Friday, April 23, 2010

పరిచయం


దుస్తులతో లోపాలని కప్పుకుని, ముఖాన అబద్దపు నవ్వు పులుముకుని, అరువు తెచ్చుకున్న మర్యాదలతో, మాటలతో విజయాలు సాధిస్తున్నాం అనుకుంటూ ఒక పిచ్చివాళ్ళ స్వర్గాన్ని సృష్టించుకుంటూ...

ఎవరిని చీత్కరించు కుంటున్నాం? ఆడ మగ తేడాలు తెలిసేలా ప్రపంచం ఉందా? అసలు సంపూర్ణ స్త్రీతత్వం, మూర్తీభవించిన పురుషత్వం మావి అంటూ చెప్పే దమ్ము ఎంత మందికి ఉండి? అలాంటపుడు తాము ఆడ కాదు మగా కాదు అని ధైర్యంగా చెప్పుకుని తిరిగే వారిని ఎందుకు ఎగతాళి చేస్తున్నాం?

-ఎస్. సత్యబాబు

స్పెషల్


పొదుగు కోసుకుని పాలు తాగడం అంటే ఇదే. మన కడుపు నింపుతున్నాం తప్ప ఒక కడుపుకోతకు కారణం అవుతున్నాం అని అనుకోవడం లేదు. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవికి ఆ భూమి విలువ తెలుసు. తెలివిగల మనిషికి తప్ప. అందుకే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు.

-ఎస్. సత్యబాబు

విశ్వరూపం


నాన్న అంటే నమ్మకం... అమ్మ అంటే నిజం... నిన్నటి మాట. ఇపుడు అమ్మ అంటే కూడా... కేవలం నమ్మకం అనే స్థితికి వచ్చేసిందా... సరోగసి పద్దతిలో ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే తల్లులు పెరుగుతున్నారు. తొమ్మిది నెలలు మోయడం, కాళ్ళతో తన్నడం, పెగుతెన్చుకుని పుట్టడం... వీటిలో ఎలాంటి మార్పూ లేదు. ఇవన్నీ ఒక అమ్మకంగా మారడం తప్ప...

-ఎస్.సత్యబాబు

Friday, April 16, 2010

మై సెంటిమెంట్


నవ్వులు పూయించే శివారెడ్డి... బిజీ జీవితంలో పది... మనలో కొందరం మరచిపోతున్న చక్కని విషయాన్ని గురుతు చేస్తున్నారు. వేల్లోస్తానమ్మ.... ఈ పదంలో ఎంత అమ్మ ప్రేమ ఉంది మరెంత నమ్మకముంది... అదే సెంటిమెంట్. అమ్మ పట్ల ఉండాల్సిన కమిట్ మెంట్.

-ఎస్.సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ

గాలి కూడా చొరబడని విధంగా అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంట్స్ కట్టుకోవడంలో నగర జీవితాలు ఇరుకవుతోన్న తీరు కనపడుతుంది. నాగరికత కోసం, నాగరిక జీవనం కోసం ఎంత ఇరుకుగా ఐనా బ్రతకడానికి మనిషి రెడీ అవుతాడు.
ఐతే నమ్మకాల విషయంలో మాత్రం ఎంత విశాలంగా మారతాడో...
-ఎస్. satyababu

రిపోర్టర్స్ డైరీ

ఒక సిటీలో ఉంటూ ఆ సిటీకి అలవాటు పడ్డం వేరు... ఆ సిటీని ఇష్టపడడం వేరు. అలవాటు పడ్డాం కాబట్టి ఉండడం వేరు ఇష్టపడి వుండడం వేరు. హైదరాబాద్ ని ఇష్టపడిన వారిలో అక్కడే ఉండడానికి మాత్రం ఇష్టపడని వారు ఉంటారు. అలాంటి వారిలో ఒకడిగా నేనున్నాను. ఈ సిటీని ఇష్టపడుతూనే... ఇక్కడ ఉండడానికి కష్టపడుతున్నాను. ఈ సిటీ గురించి వచ్చినన్ని బుక్స్ మరే సిటీ మీద ఐన వచ్చి ఉంటాయా...
-ఎస్.సత్యబాబు

మై సెంటిమెంట్


సత్తా ఉందా... ఈ ప్రశ్నను వోటర్లకు వేస్తూ రాజకీయాలలోకి వచ్చారు లోక్ సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ. రాజకీయాలను మార్చే సత్తా ఆయనకు ఉందని వోటర్లు ఇంకా నమ్మినట్టు లేదు. ప్రజల సెంటిమెంట్ మీద గేమ్స్ ఆడుకునే అలవాటు లేని నేతగా జయప్రకాశ్... తనకు కూడా ఎటువంటి సెంటిమెంట్లు లేవంటున్నారు.

-ఎస్. సత్యబాబు

Monday, April 5, 2010

మై సెంటిమెంట్


ప్రత్యర్థులను సెంటిమెంట్స్ లేకుండా నిర్దాక్షిణ్యంగా

నరికి పారేసే బొబ్బిలి బ్రహ్మన్న ను కదిలిస్తే అంతా సెంటిమెంటే.

-ఎస్. సత్యబాబు

స్పందన


సందేహం వద్దు అంటూ రాసిన కధనానికి వచ్చిన స్పందనే ఇది. -సందేహం లేదు- మరో సారి జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన స్టోరి.
-ఎస్. సత్యబాబు

Friday, April 2, 2010

రిలేషన్ షిప్స్


పౌడర్లు, స్నో లు, క్రీం లు, లిప్ స్టిక్ లు... ఇంకా ఏమేమి పూయాలి? ఎన్ని చేస్తే ఈ దేహం ధగ ధగ లాడుతుంది? ఎన్ని పూస్తే కాంతులీనుతుంది? అన్నీ చేసేస్తున్నాం? ఈ రక్తమాంసాల ఆస్థి పంజరం మీద ఎంతో ప్రేమ పెంచుకుంటున్నాం... సరే. ఉన్నప్పుడు ఎన్ని చేసినా మన దేహం సాటిలేనిదిగ మారదు. పోయాక ఒక్కటి చేస్తే చిరకాలం మన శరీరం చిరంజీవిగా మారుతుంది. చివరిగా ఒక్కటి చేస్తే మన శరీరం తన జన్మకు సార్ధకత పొందుతుంది. అదే... మరణానంతరం... శరీరదానం. వైద్య పరిశోధనలకు వీలుగా చేసే ఓ గొప్ప త్యాగం. అలాంటి త్యాగాన్ని కలుద్దాం రండి.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ




అందం అంటే ఏమిటి? వికలాంగులకు అందం ఉండదా.. అందం ప్రధానమైన వృత్తులు, ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యం ఉండదా...


-ఎస్. సత్యబాబు

పరిచయం


నోరు ఉంది కదా అని ఎడాపెడా వాగేస్తుంటారు కొందరు. అవసరం ఉన్న చోట కూడా మూగనోముతో విసుగు పుట్టిస్తుంటారు మరికొందరు... పుట్టుకతో పలుకుకు నోచుకోని, వినికిడి శక్తి లేని మనుష్యులది దీనికి భిన్నమైన ప్రపంచం. ఆ ప్రపంచమే తనకు కావాలంటారు అనురాధ. ఎడా పెదా వాగినా... మూగనోము పట్టినా అన్నీ ఆ ప్రపంచం కోసమే అంటారు...

-ఎస్. సత్యబాబు

మై సెంటిమెంట్


టీవీ చూసే అలవాటు ఉన్నవారికి ఝాన్సీ ఎవరో చెప్పనక్కర్లేదు. కాని ఆమె సెంటిమెంట్స్ గురించి తప్పకుండా చెప్పాలి...

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


మంచిపని. ఎండాకాలంలో ఎందేగొంతులు తడపాలనే ఆలోచనతో చల్లని నీరు ఉచితంగా అందివ్వడం చాలా మంచిపని. చలివేంద్రాలు రోడ్ పక్కగా ఏర్పాటు చేస్తారు. మండే ఎండల్లో ఏర్పాటు చేసిన ఆ గుడారాలలో నీళ్ళు పోసేందుకు మనుషులను పెడతారు. అలా పెట్టిన వారిలో ఒక వృద్దురాలు కూడా ఉండడం అన్యాయం అనిపించింది. ఒక రాజకీయనాయకుడు ఏర్పాటు చేసిన చలివెంద్రంలో ఆ పార్టీ కార్యకర్త తన తల్లిని ఉంచాడు. పైసా ఖర్చు చేయకుండా ముసలమ్మను మండుటెండలో నిలబెట్టి వందలమందికి నీళ్ళు పోయమనడం ఎంత అన్యాయం? అదే రాసాను. దానికి రిసల్ట్ కనిపించింది. ఆ మామ్మ కు విముక్తి లభించింది. నిజంగా నేను చేసింది కూడా మంచిపనే. కాదంటారా?

-ఎస్.సత్యబాబు