Sunday, January 31, 2010

సెల్ఫ్ చెక్


చేతిలో సెల్లూ, క్లిక్ మంటే నెట్టూ... ఇవన్నీ మన మేధ ను ప్రతిబింబిస్తున్నాయి. మరో వైపు ప్రతి పనికీ ఉపయోగపడుతున్నట్టే మన తెలివి తేటలని హరిస్తున్నాయి. మేధస్సు ను పదును పెట్టుకోవడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నామో.... లేదో... చూద్దాం.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


రోడ్ మీద ఆర్మీ వాహనం కనపడితేనే ఏదో తెలియని గౌరవ భావం మనసంతా నిండిపోతుంది. అందులో కృతజ్ఞత ఉండొచ్చు. దేశభక్తి ఉండొచ్చు. కాని ఆ భావం నిండడంతోనే మనకు తెలిసేది ఒకటే. అర్మి జాబు అన్ని జాబ్స్ లాంటిది కాదని. అది జీతం కోసం కాక జాతి కోసం చేసే ఒక గొప్ప త్యాగమని. ఇదంతా మన మనసులోనే ఉండిపోతే చాలదు. కనిపించే ప్రతి ఖద్దరు చొక్కాకు దండం పెడుతూ సాగిలపడే వాళ్ళు ఎందరో. సైనికుడికి ఒక్క సారైనా సలాం చెప్పమా? వీర మరణం పొందిన జవాను కుటుంబాన్ని ఒక్కసారైనా పరమర్శించామా... అందరూ ఉద్యోగం చేస్తారు. సైనికుడోక్కడే త్యాగం చేస్తాడు. జై జవాన్... జై జై జవాన్. మేరా సైనిక్ మహాన్.

-ఎస్. సత్యబాబు

Friday, January 29, 2010

సెల్ఫ్ చెక్


సీజన్లో వచ్చే మార్పుల గురించి ముందస్తు అవగాహన ఉండడం మంచిది. ఆ అవగాహన మనలో ఎంత ఉంది అనేది పరీక్షించు కోవడానికే ఈ స్వీయ శోధన...

-ఎస్. సత్యబాబు

Thursday, January 28, 2010

ట్రావెల్


లంక కూ భారతీయులకూ ఉన్న అనుభందం రామాయణ కాలం నాటిది. లంకలో రావణాసురుడు ఇష్టా రాజ్యం చేసినప్పటి రోజుల్ని, తమిళ ఈలం తీవ్ర వాదులు సాగించిన యుద్దాన్ని పోల్చడం సరైన పనేనా... కాకపోవచ్చు. ఏదేమైనా శ్రీలంక అందమైన దేశం. ఇపుడు అక్కడ ఏర్పడిన ప్రశాంతత ఆ అందానికి ఆనందపు వన్నేలద్దింది. ఆ వన్నెలు చిన్నెలు తిలకించిన వారితో మాట్లాడితే ఈ కధనం రూపుదిద్దుకుంది.

-ఎస్. సత్యబాబు

Wednesday, January 27, 2010

స్పెషల్


పండగ అంటే మన అందరికీ చిన్ననాటి రోజులే గుర్తొస్తాయి. అవును ఎందుకంటే బాల్యమంతేనే జీవితానికి పండగ. అవి ఒక్కసారి నెమరు వేసుకోమంటే... ఎంత గొప్ప జ్ఞాపకాలు ముసురుకున్టయో అవి గుర్తు తెచ్చుకోవడం కూడా ఒక పండగే...

-ఎస్. సత్యబాబు

స్పెషల్


చాలా ప్రేమలు చూసాం. ఒకరి కోసం ఒకరు చచ్చేవీ, చంపుకునేవీ, చచ్చినట్టు బతికేవీ... ఎన్నో. కానీ విజయలక్ష్మి లాంటి ప్రేమకధలు చాల తక్కువగా చూసుంటాం. అవి కూడా ఒకప్పటి సినిమాల్లో చూసి ఉంటామంతే. చావు బ్రతుకుల మధ్య ఉన్న తన ప్రేమను బ్రతికిన్చుకుంటున్న ఈ నిరుపేద అమ్మాయి... ఎన్నో రకాల గొప్ప ప్రేమకధలను తిరగ రాసింది.

-ఎస్. సత్యబాబు

Thursday, January 21, 2010

రిపోర్టర్స్ డైరీ


కొంతమంది కొన్ని సంవత్సరాలు కష్టపడి భవిష్యత్తు మొత్తం సుఖపడేలా సంపాదిస్తారు. కొంతమంది కష్టమే గతాన్ని, రేపటిని, మొత్తంగా జీవితాన్ని నడిపిస్తుందనే నమ్మకంతో బ్రతుకుతుంటారు. ఆ జీవితాల ప్రస్తుతం వెనుక, గతం వెనుక, ఉండేది ఒకటే. భవిష్యత్తు కూడా అంతే. ఇది జోస్యం కాదు. ఆధునికత కష్టజీవులను చేస్తున్న అపహాస్యం. ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


పండుగలంటే అర్ధం ఉంది. ఎంతో పరమార్ధముంది. వాటిమీద ప్రేమ పెరగాలంటే మనకు అవన్నీ తెలియాలి. భావితరాలకు వాటిని తెలియజేయాలి.
-ఎస్. సత్యబాబు

Monday, January 11, 2010

సెల్ఫ్ చెక్


పండుగ అంటే అది కూడా ఒక మామూలు సెలవురోజు అని భావిస్తూ... గడిపేయడం సరికాదు. ఏదో చేసుకున్నాం అంటే చేసుకున్నాం అన్నట్టుగా కాకుండా అందులోని అసలైన స్పూర్తిని గుర్తించి దాన్ని సరైన రీతిలో అనుభూటించడంఅవసరం. మనలో ఆ స్ఫూర్తి ఉందొ లేదో తెలుసుకోవడానికి ఇదో చిన్న పరీక్ష.
-ఎస్. సత్యబాబు

Sunday, January 10, 2010

ఫండే

సైన్యం... ఆ పదం తలచుకుంటే తెలియని ధైర్యం వస్తుంది. నిటారుగా నిలిచినఒక ఆత్మవిశ్వాసం వెనుక మనం నిండైన భద్రతతో నిదురిస్తుంటాం. ఆ ఆత్మవిశ్వాసం పేరే సైనికుడు. మన జాతి రక్షణకు కట్టుబడిన నిరంతర శ్రామికుడు. సైనికులను గౌరవించడంలో ఏదో కొరత ఉందంటారు హీరాలాల్ యాదవ్. సమాజం తరపున ఆ కొరత తీర్చే భాద్యతను ఆయన తన భుజాన సారీ సైకిల్ పైన వేసుకున్నారు. సైనికుల కోసం ఓ సైక్లిస్ట్ చేస్తున్న యాత్రే ఈ కధనం. ఆర్మీ అనే బ్రాండ్ కి ఒంటరిగా ప్రచారం చేస్తున్న అంబాసిడర్ హీరో లాల్ .
-ఎస్. సత్యబాబు

ట్రావెల్


శిల్పారామం ఓ అద్భుతమైన ప్రయోగం. విజయవంతమైన ప్రయోగం. నగరాలను మనం ఎంచుకుంటాం కాని మనసుని మాత్రం పల్లె తోనే పంచుకుంటాం. అందుకే పొట్టకూటికి నగరాల బాట పట్టిన మనసు గూటిలో ఎల్లప్పుడూ పల్లె కొలువు అయ్యే ఉంటుంది. ఆ పల్లె అందాలకు ఇల్లు లాంటి శిల్పారామం గురించి సంక్రాంతి నేపధ్యంలో...

-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


సంప్రదాయాలను కాదనడం, అదే నవీన జీవన విధానమనడం, అనుకోవడం చూడ్డానికి, వినడానికి నాగరికులు అని విర్రవీగుతున్నవారిని మెప్పించడానికి బావుంటాఎమో కాని... మన పుట్టుకను, పెద్దలను కాదన్నంత నేరం అది. చదవడానికి కాస్త కటువుగా ఉన్నా... చదివించడానికి ఇంత ఉండాల్సిందే.


-ఎస్. సత్యబాబు

Thursday, January 7, 2010

సెల్ఫ్ చెక్


చుట్టూ ఏం జరిగినా... జానేదో అని అనుకునే జీవితాలు పెరిగిపోతున్నాయి. పక్క ఇంటిలో అంటుకున్నది మన ఇంటిని కూడా చుట్టుకుంటుందని ఆ సెగ తగిలేదాక తెలియకపోవడం అంటే అది అజ్ఞానమే. సమాజంలో జరుగుతున్న వాటిని పట్టించుకోక పోవడం ఒక ఫ్యాషన్ గ మారిపోతోంది. ఆ ఫ్యాషన్ సమాజాన్నే కబళించే లోపు... మేలుకోవాలి. అసలు మనకు సామాజిక పరిణామాలపై అవగాహన ఉందా?

-ఎస్. సత్యబాబు

Wednesday, January 6, 2010

టాలెంట్


వేదిక మీద నృత్యం చూస్తె మనసు మైమరచిపోతుంది. అది సంప్రదాయ నృత్యం ఐతే మరీనూ. భారతీయ కళలకు ఇంకా ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తోందంటే దానికి ఎందరో కళాకారులు తమ వంతు చేసిన కృషే కారణం. అలాంటి వారిలో ఒకరు విజయలక్ష్మి. ఊరి పేరు లోను, తన పేరు లో మాత్రమే కాదు ఎంచుకున్న రంగం లోనూ విజయాన్ని కలుపుకున్న ఈ నాట్యకారిణి గురించి తెలుసుకోవడం అంటే మన సంప్రదాయ కళా వైభవాన్ని మనస్పూర్హిగా మననం చేసుకున్నట్టే.

-ఎస్. సత్యబాబు

Saturday, January 2, 2010

కవిత


కొత్త సంవత్సరాన్ని కొత్త కవితలతో స్వాగతిస్తే ఇలా...

-ఎస్. సత్యబాబు

న్యూ ఇయర్ స్పెషల్


నిర్ణయించుకున్నా... అంటూ చెప్పడంలో, ప్రకటించడంలో ఒక గాంభీర్యం ఉంది. గర్వం ఉంది. కాని దానిని అమలు చేయడం... గర్వపడినంత సులభం కాదు. అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించ మంటారు. న్యూ ఇయర్ నిర్ణయాలు కూడా అంతే. ప్రపంచం లో కొన్ని లక్షల మంది నిర్ణయాలు తీసుకునే సందర్భం అది. అలాగే వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఆ తర్వాత ఆచరించేలా చేసే సందర్భం కూడా అదే. అలాంటి కొత్త సందర్భంలో విభిన్న రంగాల వ్యక్తులు తీసుకునే నిర్ణయాల - గోల ఇది.

-ఎస్. సత్యబాబు