Monday, June 28, 2010

పరిచయం


దేవుడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు. మనిషి నడవడానికి వీల్లేకుండా చేస్తున్నాడు.
ఎ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం? పాదచారి చరిత్ర సమస్తం వాహన పీడన ప్రమాద నృత్యం.
సర్కస్ లో ఫీట్లు నేర్చుకున్న వాడైనా హైదరాబాద్ రోడ్ల మీద నడిచే సాహసం చేయగలడా?
పాదచారం పెద్ద అపచారంగా మారుస్తోన్నది ఎవరు?
ఇలాంటి విషయాలపై కాంతిమతి రోడ్డెక్కారు.
నడిచేవారి హక్కుల కోసం ఫీట్లు చేస్తున్నారు.
-ఎస్.సత్యబాబు

విశ్వరూపం


అహంకారంతో కొన్నిసార్లు, అతిశయంతో మరికొన్ని సార్లు, అవివేకంతో ఇంకొన్నిసార్లు, అనుమానంతో ఎన్నో సార్లు... మనకి కళ్ళు మూసుకుపోతాయ్. నిజాన్ని చూడగలిగినప్పుడు... ఎటువంటి పొరలు కమ్మని స్పష్టమైన చూపు ఉన్నప్పుడు మాత్రమే ఆ చూపు నిజమైనది అవుతుంది.
కళ్ళతోనే కాదు మనసుతో కూడా చూడవచ్చు. ఆత్మవిశ్వాసంతో కూడా చూడవచ్చు.

-ఎస్.సత్యబాబు

పరిచయం


పెళ్ళిళ్ళు అన్నీ ఒకలా ఉండవు. ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీలో. నిఖా పేరుతొ అమ్మాయికి వృద్ద వరులతో జరిగే తంతు, ఆ తర్వాత ఆ అమ్మాయి పడే భాధలు ఇప్పటికీ కొనసాగుతూ ఉండడమే విచిత్రం. ముక్కు చెవులు కోసే మొగుళ్ళు, నిఖా ముసుగులో మోసం చేసే సంపన్నులు, ఆడపిల్లలను ఆదాయ మార్గాలుగా భావించే తల్లి తండ్రులు... వీరందరి మధ్య చిక్కుకున్న అమ్మాయిలను రక్షించడానికి ఎంత మంది జమీల నిషాత్ లు రావాలో...
-ఎస్.సత్యబాబు

Friday, June 25, 2010

సెల్ఫ్ చెక్


నిలబడడానికి, నడవడానికి కాళ్ళు ఉంటే చాలు. కాని మాట మీద నిలబడడానికి సత్తా ఉండాలి. ఇచ్చిన మాట తప్ప కుండా పాస్ అవ్వడానికి మాట ఇచ్చే ముందే మనుషుల్ని మనసుల్ని బట్టి పట్టే నేర్పు ఉండాలి. మొత్తం మీద మన మాటకు విలువ ఉంటేనే మనకు విలువ ఉంటుందనే విషయం ఎప్పుడూ గుర్తుండాలి.
-ఎస్.సత్యబాబు

విశ్వరూపం


ఆరడుగుల ఎత్తు ఉంటె అందంగా ఉండడానికి అర్హత వచ్చినట్టే. ఐతే అది అబ్బాయిలకే. మరి అమ్మాయి ఆరు అడుగులు ఉంటే... అందాల తారగా మారి అందనంత ఎత్తు ఎదుగుతా అంటున్న రెహా చెప్పిన సంగతులవి.

-ఎస్.సత్యబాబు

స్పెషల్


పూనకం రావాలంటే దేవుడే పూనాలా? కంట నీరు తిరగాలంటే కష్టమే రావాలా? నిద్రపోవాలంటే ఉయ్యాల కావాలా? ఊహల్లో వూరేగాలంటే లాటరీ గెలవాలా... నా అన్న వాళ్ళు గుర్తుండాలి అంటే ఆల్బం లు నిండాలా...

పాట ఒక్కటి ఉంటె చాలదా... మన వెంట.

-ఎస్.సత్యబాబు

పరిచయం


మనకి బుర్ర పని చేస్తోందా... ఈ ప్రశ్నవేసుకోవలసిన అవసరం జీవితంలో మనకు ఎన్ని సార్లో వచ్చి ఉంటుంది. పైసా నష్ట పోయినా పనిలో వెనుకబడినా... ఎన్నో సార్లు అసలు బుర్ర ఉందా అని కూడా తిట్టుకునే ఉంటాం. కాని వారికా అవసరం రాదు. బుద్దిమాంద్యం ఉందని వైద్యలోకం అచ్చుగుద్దిన జీవితాలు వారివి. వారిని వారి మానాన వదిలేస్తే... ఇంతతిండి పెట్టి సరిపోతుంది అనుకుంటే... వారి బుద్ది వికసించేందుకు, వారి కాళ్ళ మీద వారు బతికేందుకు సాటి మనిషిగా కూసింతైనా చేయూత అందివ్వకపోతే... ... మనకు బుర్ర పనిచేస్తోందా?

-ఎస్.సత్యబాబు

రిలేషన్ షిప్స్

కృష్ణ రామ అనుకోవలసిన వయసులో... అంటూ మొదలుపెడితే... అది ఎంత వయసు వారి గురించో యిట్టె చెప్పెయవచ్చు. చలాకీగా చిన్న పిల్లలతో సమానంగా హుషారుగా తిరిగే వాళ్ళని చూస్తె వారికి ఎనభై సంవత్సరాల వయసు ఉంటుంది అని అనడానికి మనసు రాదు. తిరుపతిలో నేను కలిసిన దంపతులను చూసినా, వారు చేస్తున్న సేవను చూసినా... మరో మాట మాట్లాడడానికి నోరు పెగలదు.

ఎస్.సత్యబాబు

రిలేషన్ షిప్స్

Thursday, June 24, 2010

విశ్వరూపం


పద్నాలుగు సంవత్సరాలు. మహిళ బిల్లు ఇంకా చట్ట సభల్లో ఆమోదం పొందలేదు.. రాజకీయాల లోకి రావడానికి, చట్ట సభల్లో మహిళ ప్రాతినిధ్యం ౩౩ శాతం కావాలని నిరీక్షిస్తున్న మహిళల కల నెరవేరుతుందా... అసలీ రాజకీయ నేతల్లో అసలు చిత్త శుద్ధి ఉందా...
-ఎస్.సత్యబాబు

Tuesday, June 8, 2010

పరిచయం


పర్యావరణం పరిరక్షించాలి అంటూ ఎ సి హోటల్స్ లోజరిగే సెమినార్లు, లఘు చిత్ర ప్రదర్శనలు చాలా చూసాను. అవన్నీ మరుసటి రోజు పేపర్లో పెద్దగ ప్రింట్ అవ్వడం కూడా. కాని తను ఉండేది బస్తి ఐనా కాలనీ ఐనా దాన్ని శుబ్రంగా ఉంచుకుందాం అని తపన పడే వాళ్ళ గురించి మాత్రం పెద్దగ వినలేదు. చూడ లేదు. అందుకే ఈ మహిళల గురించి తెలియగానే వీరిని ప్రపంచానికి పరిచయం చేద్దాం అని తపన పడ్డాను. అది వీరి కోసం కాదు. ఇది చదివే వారిలో కలిగే స్పూర్తి కోసం.

-ఎస్. సత్యబాబు

విశ్వరూపం


మరో జీవికి జన్మని ఇవ్వడం అంటే అది తన జీవితం పైన ఆశలు వదులు కోవలసినంత పెద్ద కష్టమా.... ఇప్పటికీ అలాంటి దుర్భర పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా... అవును అనే సమాధానానికే ఈ ఛాయ చిత్ర ప్రదర్శన కట్టుబడింది. సందర్శకుల అభివృద్ధి కలలకు అడ్డుపడింది.

-ఎస్. సత్యబాబు