Thursday, December 31, 2009

సెల్ప్ చెక్


కానుకలు ఇవ్వడం కొందరికి బాగుంటుంది. తీసుకోవడం మరి కొందరికి బాగుంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం చాలామందికి బావుంటుంది. ఇలా బావుండే విషయాన్ని మరింత బావుండేలా చేసుకోవడం అందరికీ బావుంటుంది. కానుకలివ్వడం కూడా ఒక కళ అనేదే ఈ సెల్ఫ్ చెక్ చెప్పే విషయం.

-ఎస్. సత్యబాబు

Wednesday, December 30, 2009

రిపోర్టర్స్ డైరీ

చేసింది చెప్పుకోకూడదని కొందరు అంటారు. కాని తలచుకోకూడదని ఎవరూ అనరు. అందుకే నేను ఈ సంవత్సరం లో రాసిన కధనాలు, వాటి వాళ్ళ కొంత మందికి జరిగిన మేలు... ఇలా తలచుకున్నాను. వెళ్ళిపోతున్న రెండు వేల తొమ్మిది కి వీడ్కోలు పలుకుతూ అది నా వ్రుత్తికి చేసిన మేలు కూడా తలుచుకున్నా.
విలేఖరి తలుచుకుంటే అది లేఖ అవుతుందో, డైరీ లో ఒక పేజి అవుతుందో...
-ఎస్. సత్యబాబు

Monday, December 28, 2009

ఫండే

సేవామార్గం పట్టిన వారిని మనం చాల గొప్పగా చూస్తాం. నోటికొద్దీ పోగిదేస్తాం. కాని వారి నుంచి మనం స్ఫూర్తి పొందాలన్న విషయం తెలిసో తెలియకో మర్చిపోతూ ఉంటాం. స్ఫూర్తి పొందిన వారంతా మదర్ తెరిస్సాలే కానక్కర్లేదు. చిన్ని చిన్ని పనులతోనే మేము సైతం అంటూ సేవానందాన్ని స్వంతం చేసుకోవచ్చు. అదే ఈ కధనం.
-ఎస్. సత్యబాబు

సిటీ


హైదరాబాద్ ని ఇలా ఎప్పుడూ చూడలేదు. ఇలా ఎప్పుడూ చూడకూడదు కూడా. ప్రత్యేకమో, సమైక్యమో గాని... ఈ వాదాలు, వివాదాల నేపధ్యంలో... నగరంలో నూతన సంవత్సర స్వాగత సన్నాహాల్లో లోపించిన హుషారు నాలాంటి వేడుకల ప్రియులు గతంలో చూడనిది. అందుకే నేను పరిస్తితిని ప్రతిబిబించేల మా సిటీ పేజి కి ఈ కధనం రాసాను.

-ఎస్. సత్యబాబు

Saturday, December 26, 2009

రిపోర్టర్స్ డైరీ


మరపు మానవ సహజం. గతం గతః అనుకోకపొతే వర్తమానం అనుభూతించలేం. భవిష్యత్తుని స్వాగతించలేం. ఐతే పాత లోని విషాదాన్ని పట్టుకుని వేలాడ్డం ఎంత తప్పో, ఆ విషాదం నేర్పిన పాఠాలను మర్చిపోవడం అంతేతప్పు కూడా. సునామీ నేర్పిన పాఠాలను నేర్చుకున్న మత్స్యకారుల ను కలిసాను...

-ఎస్. సత్యబాబు

Friday, December 25, 2009

రిపోర్టర్స్ డైరీ


కెమెరాలు పట్టుకుని ప్రకృతి దృశ్యాలు ఫోటోలు తీస్తాం. ఫ్రెండ్స్ ని బంధువులను వీలున్నప్పుడల్లా క్లిక్ మనిపిస్తాం. కాని అసలు జీవితంలో ఫోటో తీయిన్చుకోగలమా ,ఫోటో తీస్తే తాము ఎలా ఉంటామో కూడా తెలియని వాళ్ళు మన మధ్యే ఉన్నారు. దీనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారు. వారి దీన వదనాలని ఒక్కసారి కెమెరాలో బంధిస్తే... వాళ్ళెంత దివ్యంగా ఉంటారో... ఆ ఆనందం ఎంత అందంగా ఉంటుందో... ఎన్ని ప్రక్రుతి ద్రుశ్యాలకన్న మిన్నగా ఉంటుందో... అది చవి చూసిన వారికే అర్ధమవుతుంది. ఇది చదివితే మీకూ అర్ధమవుతుంది.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


గుండు చేయించుకోవడం అనేది చాల మంది వెంకన్న భక్తులకు మొక్కు తీర్చుకోవడం. సహజంగా మొక్కులన్నీ మనవి మనమే మొక్కుకుంటాం. ఐతే చిన్న పిల్లల మొక్కులు మాత్రం వాళ్ళు కాకుండా మనమే మొక్కుకుంటాం. వారికి నచ్చో, నచ్చకున్నాకరకు చేతుల మగవాళ్ళ వొళ్ళో కూర్చుని గుక్క పెడుతూ గుండు చేయిన్చుకోవలసిందే. కనీసం మహిళ క్షురకుల పేరిట వారికి ఇపుడో లాలన లభిస్తోంది. తిరుమల వెళ్ళినపుడు మహిళా క్షురకులతో మాట్లాడాను.

-ఎస్. సత్యబాబు

Sunday, December 20, 2009

సెల్ఫ్-చెక్

పెడా వ్యాయామాలు చేసేస్తున్నాం. అందులోనుంచి ఎంత ప్రతిఫలం పొందుతున్నాం? అసలు ఆనందించకుండా చేసే పని ఏదైనా సరైన రిసల్ట్ ఇస్తుందా... ఒక్క సారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మంచిది కదా...
-ఎస్. సత్యబాబు

Thursday, December 17, 2009

పరిచయం

ఎప్పుడూ విజయం సాధించిన వారి గురించే మాట్లాడతాం. అదీ సాధించిన
తర్వాతే మాట్లాడటం. ఒక్కసారి విజయ సాధన కోసం అష్టకష్టాలు పడుతున్న వారితో కూడా మాట్లాడితే... ఇలా వుంటుంది.
-ఎస్. సత్యబాబు

Tuesday, December 15, 2009

మై ఫ్రెండ్


ఎవ్వరూ లేరు అనిపించే ఒక భయంకరమైన ఒంటరితనంలో ఒకే ఒక తోడు మనకి నేస్తమవుతుంది. ఉప్పగా రుచిన్చినా దానితో మన తీయని స్నేహాన్ని మనం ఎప్పటికీ వదులుకోలేం. నిజం. కన్నీటి విలువ తెలియాలంటే... హోదా పేరుతొ, నామోషి కి భయపడో... దాన్ని దూరం చేసుకున్న వాళ్ళని అడగాలి.

-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


ఇంటి భాద్యత కాస్త నువ్వు కూడా మొయ్యాలి అని తండ్రో తల్లో చెప్పినపుడు... చెట్టంత ఎదిగినా, పని చేయగల సామర్ధ్యం ఉన్న వాళ్ళు కూడా మంచి ఉద్యోగం వస్తే నువ్వు అడక్కుండానే నేను భాద్యత తీసుకుంటా అంటూ తప్పించుకుంటారు. ఆ మంచి ఉద్యోగం అంత తేలికగా రాదు. వచ్చేటప్పటికి తనకో కుటుంబం ఏర్పడకపోదు.

మాధవికి ఎవరూ భాద్యత అప్పగించలేదు. ఇంటి పరిస్థితి చూసి తనే తీసుకుంది. ఇంతా చేసి మాధవి వయసు పన్నెండేల్లె.

-ఎస్. సత్యబాబు

Monday, December 14, 2009

రిపోర్టర్స్ డైరీ


నెల నెలా జీతం అందుకుంటున్నప్పుడు మనందరం చాల ఆనందిస్తాం. అప్పులు, లోన్లు, వాయిదాల చెల్లింపులు... ఇవన్నీ కట్టేసి హమ్మయ్య అని హ్యాపీగా ఊపిరి తీసుకుంటాం. ఐతే నెలంతా పడిన కష్టానికి వచ్చే ఆ ప్రతిఫలం ఇచ్చే ఆనందం సంగతెలా ఉన్నా... అందులోనుంచి చాల చిన్న మొత్తాన్ని వెచ్చిస్తే వచ్చే గొప్ప ప్రశాంతతను ఇపుడు కొంతమంది కనిపెట్టారు. ఆ కొంతమంది దగ్గరనుంచి ఇంకా కొంతమంది... నేర్చుకుంటూనే ఉంటారు.

-ఎస్. సత్యబాబు

Thursday, December 10, 2009

పిట్టగోడ


జాక్సన్ చిత్రపటానికి వేలంపాటలో అత్యధిక ధర పలికింది. పాప్ సంగీత ప్రపంచాన్ని మకుటంలేని మహారాజుగా ఎంతోకాలం ఏలిన ఒక మ్యూజిక్ మాస్టర్ పట్ల పలికిన అభిమానమది.
-ఎస్. సత్యబాబు

Wednesday, December 9, 2009

మిస్టరీ


ఒక తీవ్రవాది చనిపోయాడా బ్రతికి ఉన్నాడా అనేది నిజానికి అంత చర్చనీయాంశం కాదు. కాని ఆ తీవ్రవాది బిన్ లాడెన్ కావడమే ప్రపంచానికి పెద్ద విషయం అయింది. ఆ మిస్టరీ ఎపుడు వీడుతుందో...

-ఎస్. సత్యబాబు

Tuesday, December 8, 2009

రిపోర్టర్స్ డైరీ


చదువుకున్న టైములో నేనెప్పుడూ కాలేజీ నుంచి రాగానే ఏదో పెద్ద కష్ట పడిపోయినట్టు ఫ్రెండ్స్ షికార్లు అనే వాడ్ని. హాస్టల్ లో ఉండి చదువుకుంటూ సాయత్రం పూట నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాలనే ఆలోచన ఆ విద్యార్ధిని లకు వచ్చినందుకు అభినందిన్చాలనిపించింది. అదే చేశా.

-ఎస్. సత్యబాబు

Monday, December 7, 2009

విశ్వరూపం


హైదరాబాద్ మేయర్ గ మహిళఎంపికైంది. ఆమెతో కాసేపు ముచ్చట్లు.

-ఎస్. సత్యబాబు

Thursday, December 3, 2009

రిపోర్టర్స్ డైరీ


తిరుపతి దేవుడు ఎందరికో ఇష్ట దైవం. చిన్న పిల్లలు కూడా అంతే. ఎందరికో ఇష్టమైన వారు. ఐతే మన ఇష్ట దైవం ఎదుటే మన కెంతో ఇష్తులైన చిన్నారులు అష్ట కష్టాలు పడుతుంటే చూడగలమా... తిరుమలలో నిరుపేద బాలలు యాచాకులుగా, బాలకార్మికులుగా ... కనపడుతుంటే కలిగిన స్పందనే ఇది.

-ఎస్. సత్యబాబు

మై హాబిట్


కొత్త శీర్షిక ఇది. కొన్ని అలవాట్లు ఎందుకు అవుతాయో ఎందుకు మనతో పాటు జీవితాంతం ప్రయానిస్తాయో మనకే తెలియదు. వాటిలో చాల ఆసక్తికరమైనవి కూడా ఉంటై. నోటికీ కంటికీ ఒకే సారి పని చెప్తూ నేను చేసుకున్న ఒక అలవాటే రీడ్ వైల్ ఫుడ్. తింటూ చదవడం. చాలామందికి ఇదే అలవాటట. నేను రాసింది చూసాక చెప్పారు.

-ఎస్. సత్యబాబు

Wednesday, December 2, 2009

సినిమా


సినిమా వాళ్లు ఎవరినీ పనులు చేసుకోనీయరు. ఇంకా మాట్లాడితే ఎవరి పని వాళ్ళని చేసుకోనీయరు. మోడల్స్ వాళ్ళే, మూవీస్ లో వాళ్ళే. ప్రకటనల్లో వాళ్ళే, పోలిటిక్స్ లో వాళ్ళే. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవడమే తెలిసిన తారలే కనపడుతున్నారు. వాళ్ళేమి చేసినా చూడబుల్ గానే ఉంటుంది కాబట్టి మనం చూసేస్తున్నాం వల్లేమో ఏది పడితే అది చేసేస్తున్నారు. రాంప్ మీద తారల హంగామా గురించే ఈ కధనం...

-ఎస్. సత్యబాబు

Wednesday, November 18, 2009

రిపోర్టర్స్ డైరీ


సమాజం అంటే మన చుట్టూ ఉన్నది మాత్రమే కాదు. ఇక్కడంతా క్షేమం అనుకుంటే సరిపోదు. మన పక్కన ఉన్ననలుగురూ కాకుండా చాల ప్రపంచం ఉంది. మనకు కనపడే ఆధునికత కు భిన్నంగా అంధ విశ్వశాలు రాజ్యమేలుతున్న ప్రాంతాలున్నై. విగ్రహాల కోసం కర్రలతో తలలు పగలగొట్టుకునే వాళ్లు , ముక్కు పచ్చలారని బాల్యాన్ని పెళ్లి తంతులో ఇరికించే వారు ఇంకా చాల చోట్ల ఉన్నారు. ఈ విషయం ఎ పల్లెకు వెళ్ళినా తెలుస్తుంది. నేను కొమ్మర వెళ్ళినపుడు కూడా తెలిసిన్దదే.

-ఎస్. సత్యబాబు

Tuesday, November 17, 2009

రిలేషన్ షిప్స్


ఎవరూ ఆలోచించని వైపు చాల అరుదుగా మాత్రమే ఆలోచిస్తాం. అలా ఆలోచించినపుడు మాత్రం ఆనందిస్తాం. ముఖ్యంగా మీడియాలో ఉన్నవాళ్ళకి ఇలాంటి ఆనందం మరీ ఎక్కువ కలుగుతుంది. రాష్ట్రమంతా వరదల టైములో వినిపించిన వదంతి...శ్రీశైలం డ్యాం పడిపోతుందని. కాని అలాంటి ఉపద్రవం జరగలేదు. అంటా ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆ వరద టైములో ఆ డ్యాం మీద పనిచేసిన వారెలా భావించారు? ఎంత కష్టపడి పనిచేస్తే అంత సజావుగా వరద సాగింది? ఆ ఆలోచనే ఈ కధనం...

-ఎస్. సత్యబాబు

Saturday, November 14, 2009

రిపోర్టర్స్ డైరీ


మేము విజయవాడ లో ఉండేటప్పుడు హైదరాబాద్ వస్తే స్టార్ హోటల్ తాజ్ కృష్ణ ని చూడడానికే ప్రత్యేకంగా వెళ్ళేవాళ్ళం. అందులోకి జీవితంలో ఎపుడైనా వెళ్లగలమా అనుకునే వాళ్ళం. విలేఖరి గ ఏదో అవకాశం రాబట్టి చాల సార్లు తాజ్ కృష్ణ లోకి వెల్ల గలిగాననుకో... ఐతే ఇప్పటికీ దాని దరిదాపుల్లోకి వెల్ల డానికి కూడ ఆలోచించే వాల్లెన్తమందో... అల్లాంటి వాళ్ల కోసం స్టార్ దిగొచ్చింది. వండి వడ్డించింది.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


కొన్ని ఉద్యోగాలు ఉన్నాయ్ అని కూడా మనం మర్చిపోయాం. మనం బ్రతుకుతూనే సమాజానికి కేవలం మేలు తప్ప మరి ఎటువంటి హానీ కలిగించని సద్యోగాలవి. సోషల్ వర్కర్ అనే ఉద్యోగం ఒకటుందని దానితో మనకు ఉపాధి మాత్రమే కాకుండా, మన ద్వారా మరి కొంత మందికి ఉపకారం కూడా జరుగుతుందని గుర్తుంచుకుందాం. మన పిల్లలకి గుర్తు చేద్దాం.

-ఎస్. సత్యబాబు

Monday, November 9, 2009

ట్రావెల్


ఫ్లెమింగో అనే పేరుతొ ఉన్నప్పుడు ఈ పేజీకి రాసాను. మళ్ళీ ఇప్పుడు. ట్రావెల్ పేజీకి ఐటెం. బదరీ, కేదార్... టూర్స్ చేసిన కుటుంబం అనుభవాలను ఇలా పేర్చి కూర్చాను.

-ఎస్. సత్యబాబు

Friday, November 6, 2009

ముందుజాగ్రత్త


మొదటిసారి ముందుజాగ్రత్త పేజీలో ఫుల్ స్టొరీ రాసాను. సెల్ ఫోన్లు తెచ్చే ఆరోగ్య సమస్యలపైనే ఈ కధనం.

-ఎస్.సత్యబాబు

Tuesday, November 3, 2009

రిలేషన్ షిప్స్

మానవ సేవ, పరోపకారం ఇలాంటి మాటలు ఎవరి నోటి నుంచైనా వస్తే వారు వయసు మీద పడిన వారే అయి వుండేవారు. ఇపుడు కూడా సేవా కార్యక్రమాలకి జీవితాన్ని అంకితం చేసిన వారిని చూస్తె వారు ఎక్కువగా పెద్దలే కనిపిస్తారు. పాతికేళ్ళు కూడా లేని యువతి పెళ్లి ఆలోచనలకు గుడ్ బై చెప్పి మరీ మురికివాడల పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేయడం అరుదుగా మాత్రమే చూస్తాం. అలంటి అరుదైన అమ్మాయి రోజీ.
-ఎస్. సత్యబాబు

Monday, November 2, 2009

విశ్వరూపం


ఉద్యోగ అవకాశాల విషయంలో మహిళలు సమ ప్రాతినిధ్యం పొందుతున్నారా? ఈ ప్రశ్న ఎవరినైనా వేస్తే పిచ్చివాడా అన్నట్టు చూస్తారు. అసలు అవకాశాలన్నీ వాళ్ళవే అంటారు. కావాలంటే చూడు అంటూ చందా కొచ్చేర్ నో మరొక కార్పొరేట్ ఉద్యోగిని నో చూపిస్తారు. కాని అసలు వాస్తవం అది కాదని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

-ఎస్. సత్యబాబు

Sunday, November 1, 2009

ఆర్ట్ అండ్ కల్చర్


ఎన్ని రకాలుగా చెప్పిన ప్రేక్షకుల ఆదరణ కోసమే. హిందీ సినిమా ప్రమోషన్ కోసం నానా తంటాలు పడుతోంది. ఒక ఆర్టిస్ట్ తుం మిలే సినిమా లోని నటులను కాన్వాస్ పైకి ఎక్కించడం కొత్త తరహ ప్రమోషన్ కావచ్చు.
-ఎస్. సత్యబాబు

సన్నిధి



బోలెడన్ని మంచి అలవాట్లు... మనం మర్చిపోతున్నాం. దేవుడి పేరిట వాటిని ఆచరించి అలవాటుగా మార్చుకోవడమే మాలధారణ కు ప్రేరణ. అయ్యప్ప మాలతో మొదలై వేంకటేశ్వర , శివ, భవానీ మాలలు ధరించే ఆచారం పెరుగుతోంది. మంచిని పూర్తిగా వదులుకోలేని మనిషి మనసులోని అలవాటుని ఇది చూపుతోంది.

-ఎస్. సత్యబాబు

సందేశం

ఆదర బాదర కంచం ముందు కూర్చోవడం ఏదో తిన్నామని పించి లేచిపోవడం. ఎన్ని కష్టాలనైనా భరించేది ఆ చిన్ని బొజ్జ కోసమే కదా. తృప్తిగా భోంచేసి దాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించడం, మన వారితో ముచ్చట్లాడడం... అంత కు మించిన ఆనందం ఎలా దొరుకుతుంది? వనభోజనంలో దానికి సమాధానం దొరుకుతుంది.
-ఎస్. సత్యబాబు

Thursday, October 29, 2009

పిట్ట గోడ


నాలుగు గోడల మధ్య కూర్చుంటే తెలిసే విషయాలకన్నా గోడ దాటితే తెలిసేవే బాగుంటై. మొట్ట మొదటి సారిగా ఈ కాలంకి రాసా.

-ఎస్. సత్యబాబు

Wednesday, October 28, 2009

రిపోర్టర్స్ డైరీ


వైద్యం పేదవాడికి చేరువ కావాలని అందరూ కోరుకుంటున్నారు. కాని నకిలీ వైద్యులు చేరువవుతున్నారు. ఆయుర్వేదం అంటే ఒక అద్భుతం. దాన్ని నడిరోడ్డు మీద అవమానించడం, అది చూస్తూ మనం ఊరుకోవడం సరైన పనేనా... ఫుట్ పాత్ మీద బ్లాంకెట్లు అమ్మొచ్చు. చాక్లెట్లూ అమ్మొచ్చు. కాని వైద్యం పేరిట మోసాన్ని కాదు.

-ఎస్. సత్యబాబు

స్మృతి కధలు


గాంధీ భవన్ కి వెళ్లి ఆ భవనంతో వై ఎస్ కి ఉన్నఅనుభందం రాసా. అనుకోకుండా అది స్మృతి కధలుగా మారింది.

-ఎస్. సత్యబాబు

Monday, October 26, 2009

విశ్వరూపం


వరదల వల్ల విద్యార్ధుల కు కలిగే నష్టాన్ని పూడ్చడానికి రెడ్డీస్ ఫౌండేషన్ కు చెందిన మహిళలు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. వాటికి మా వంతు తోడ్పాటే ఈ కధనం. కొన్నివారాల అనంతరం విశ్వరూపం పేజీ కి రాసాను. సరిత కి ( సబ్-ఎడిటర్) పాపం ఉపాధి కోల్పోయింది ఈ ఒక్క రోజుకి.

-ఎస్. సత్యబాబు

Sunday, October 25, 2009

స్మృతి కధలు


పెద్ద బావగారికి వై ఎస్ తో కాస్తో కూస్తో అనుబందముంది. అదే ఈ సారి స్మృతి కధ.

-ఎస్.సత్యబాబు

Friday, October 23, 2009

పరిచయం


చిన్నప్పుడు నేను ఎన్ ఎస్ ఎస్ లో చాల సార్లు పార్టిసిపేట్ చేశాను. బిస్కెట్స్, సమోసాలు ఎంజాయ్ చేశాను. అంతే. అంతకు మించి దాని స్ఫూర్తి ఏమిటో దాని ద్వారా సమాజానికి ఎంత మేలు చేయవచ్చో... తెలియదు. కాదు. తెలియజేయలేదు. నా టీచర్లు గాని, పేరెంట్స్ గాని. పద్మ గారిని కలిసినపుడు ఇలాంటి టీచర్ నా చిన్నతనంలో దొరికుంటే ఎంత బాగుణ్ణు... అనిపించింది. ఆమె గురించి ఈ కధనం లో చెప్పడం ద్వారా నా చిన్నతనంలో ఎన్ ఎస్ ఎస్ కు చేసిన ద్రోహానికి కొంతవరకు ప్రాయశ్చిత్తం చేసుకున్నానేమో...

-ఎస్. సత్యబాబు

Wednesday, October 21, 2009

రిపోర్టర్స్ డైరీ


మనిషి మనసును గుర్తించనపుడు ఉన్నంత ఆనందంగా ఎపుడూ ఉండలేదేమో... ఇపుడు అదే మనిషికి గుదిబండ అవుతోంది. అది ఎదిగితే ఒక సమస్య, ఎదగకపోతే మరో సమస్య. మానసికంగా పరిణితి చెందని కొందరు వ్యక్తుల గురించి రాసేటప్పుడు నాకో సందేహం. అసలు నా మనసు ఎదిగిందా అని?
-ఎస్. సత్యబాబు

స్మృతి కధలు


వై ఎస్ ఆర్ స్మృతి కధల్లో నా వంతుగా మరొకటి.
-ఎస్. సత్యబాబు

Tuesday, October 13, 2009

లైఫ్ స్టైల్


బోనులో ఉన్నప్పుడు వాటిని ఆడిస్తాం. బయట అవి కనబడితే తోక జాడిస్తాం. జంతువులంటే మనిషికి ఒక్కో సారి వినోదం. ఒక్కో సారి ప్రమాదం. సినిమాల్లో చూసే అడవి అంటేనే మనకు భయం. అలాంటిది రోజుల తరబడి అడవుల్లోనే ఉంటూ వన్యప్రాణులను కెమెరా లో నిక్షిప్తం చేసున్న ఒక ఫోటో గ్రాఫర్ గురించిన కధనం ఇది. జీవితంలో అధిక భాగం కుటుంబానికి దూరంగా వన్యప్రాణులకు దగ్గరగా ఉండే వెంకట్ ఈ అభిరుచి గురించి వైద్య వృత్తిని కూడా వదులుకున్నారు. ఫండే కు రాస్తున్న వార్త కధనాల్లో రెండవ అధ్యాయానికి బ్రేక్. ఇదే చివరిది. మళ్ళీ ఎపుడు రిస్టార్ట్ చేస్తానో...

ఎస్. సత్యబాబు

Thursday, October 8, 2009

సినిమా


ఫిట్ నెస్ కధనాలు రాసి చాల కాలమైంది. సినిమా పేజీలో గత వారం నుంచి రాస్తున్న ఫోకస్ కోసం హీరోయిన్ ఫిట్ నెస్ మీద రాసాను. వారితో ఫిట్ నెస్ ట్రైనింగ్ చేయించిన చంద్ర శేఖర్ వాళ్ల గురించి చెప్పిన విషయాలే ఈ కధనం.

-ఎస్. సత్యబాబు

Wednesday, October 7, 2009

పేరెంటింగ్


పిల్లలకి ఎన్నో నేర్పుతున్నాం, ఒక్క మానవత్వాన్ని తప్ప. మనిషిగా బ్రతకడానికి, మనిషి అని పిలిపించుకోవడానికి కావలసిన మానవత్వాన్ని తప్ప. మనం నేర్పడం మరిచిపోయినా ఒక్కో సారి పరిస్థితులే నేర్పుతాయి. కనీసం అవి నేర్పెటప్పుడైన మనం మేలుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఊళ్ళను ముంచెత్తిన గడ్డు పరిస్థితుల్లో... పిల్లలని సేవోన్ముఖులను చేయాలని చెప్పడమే ఈ కధనం ఉద్దేశ్యం.

-ఎస్.సత్యబాబు

Monday, October 5, 2009

విశ్వరూపం


నిజంగా ... ఒక్కోసారి భయం వేస్తుంది. కొంతమంది ధైర్యాన్ని చూసి. వాళ్లు ఎదుర్కున్న పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటే. మనమేగాని అలాంటి పరిస్థితి లో ఉండి ఉంటే... అనే ఆలోచన నిజంగా భయ పెడుతుంది. మంచినీళ్ళు తాగినంత తేలికగా ప్రాణాలు తీసేసే తీవ్రవాదులు మనకు ఎదురు కాకుండా ఉండాలనే కదా కోరుకుంటాం... ఒక వేళ ఎదురైనా మనలని ఏమీ చేయకుండా వదిలితే చాలనుకుంటాం. అంతే గాని వాళ్ళని చంపడం అనే ఆలోచన కలలో కూడా మనకి రాదు. అందుకే ఓ కాశ్మీరీ అమ్మాయి ఇపుడు దేశం ద్రష్టిలో హీరోయిన్ అయింది. ఆమెని సముచితంగా గౌరవించక తప్పని పరిస్థితిని ప్రభుత్వానికి తెచ్చింది. అదే ఈ కధనం.
-ఎస్. సత్యబాబు

Sunday, October 4, 2009

రిపోర్టర్స్ డైరీ

పిచ్చుక ఓ గొప్ప స్నేహశీలి. నిరాడంబర జీవి. అంతే కాదు గొప్ప ఆర్కిటెక్ట్ కూడా. దాని గూడు అది కట్టుకునే తీరు చూస్తె తెలుస్తూంది. చిన్న వయసులో పిచ్చుకల సందడిని చూస్తూ ఆనందించిన వాడిగా... అవి కనుమరుగు అవుతుంటే... ఇలా -అక్షరాలా -భాధ పడుతున్నా.
-ఎస్. సత్యబాబు

Friday, October 2, 2009

ముందుజాగ్రత్త


పుస్తకంలో మరో పేజీ. ఇప్పటిదాకా రాయని ముందుజాగ్రత్త పేజీ. నాకు ఇన్సూరెన్స్ వ్యాపారం లో ఉన్న అనుభవం ఉపయోగపడింది. నిర్మలారెడ్డి బై లైన్ పక్కన చోటు దక్కింది. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదు. బీమా అందించే ధీమాని మించిన ధైర్యం లేదు.

-ఎస్. సత్యబాబు

Thursday, October 1, 2009

సినిమా


మరో సారి సినిమా పేజి లో కనిపించాలనుకున్న. నా లుక్ మార్చుకోవదానికో, లక్ మార్చుకోవడానికో మరి. రాసిన కధనం కూడా అలాంటిదే. లక్ ను మార్చే లుక్ కోసం హీరోలు లుక్ మార్చుకుంటున్న వైనం పైన. ఒకప్పటిలా యాక్షన్ తో కాకున్నా ఇలాగన్నజనాలను మెప్పిద్ద్దాము అనుకునే తాపత్రయం అర్ధం చేసుకోదగినదే.

-ఎస్. సత్యబాబు

Tuesday, September 29, 2009

విశ్వరూపం



భారత్ లో బాలికల పరిస్థితి ప్రపంచీకరణ మార్పులకు అనుగుణంగా ఉందా... విద్య, వైద్య వంటివి వారికి అందాల్సిన రీతిలో అందుతున్నాయా...ఈ విషయాలపై ప్లాన్ ఇండియా రూపొందించిన రిపోర్ట్ గురించి ఓ వార్త ఇది.
-ఎస్. సత్యబాబు

స్మృతి కధలు


స్మృతి కధలు శేర్షిక కింద మరో వై ఎస్ సహచరుని జ్ఞాపకాలతో ఈ కధనం.

-ఎస్. సత్యబాబు

Sunday, September 27, 2009

ఫండే లైఫ్ స్టైల్


మూర్తిరాజు గురించిన కధనం రెండో పేజి ఇది.

ఎస్. సత్యబాబు

ఫండే


గాంధీ మార్గం గురించి మనం రోజూ చదువుతూనే ఉన్నాం. మన రాజకీయనేతల పుణ్యమాని. మహాత్ముడిని తలవని నేత లేడనేది ఎంత నిజమో, ఆయన మార్గంలో నడిచే ఉద్దేశ్యం ఉన్ననేతలు ఇపుదేవరూ లేరనేదీ అంతే నిజం. ఊపిరి వున్నంతవరకూ గాంధీ బాట లోనే అంటున్న ఓ గొప్ప నేత మూర్తిరాజు. ఆయన గురించి రాసానని చెప్పడం కన్నా గాంధీ ఎంతో గురించి తెలుసుకున్నాను అని అంతే మనసుకు తృప్తిగా ఉంటోంది.

-ఎస్. సత్యబాబు

Tuesday, September 22, 2009

స్మృతి కథలు

ఒక వ్యక్తి బ్రతికున్నప్పుడు కంటే ఆయన లేనపుడే ఆ జ్ఞాపకాలు బాగా బ్రతుకుతాయి. అందులో సందేహం లేదు. మన మధ్య లేని వ్యక్తిని గురించి మనస్పూర్తిగా మాట్లాడతాం. ఆ మాటలు వినడానికే కాదు చదవడానికి కూడా బాగుంటై. అదీ వై ఎస్ లాంటి ప్రముఖుని గురించైతే ఇంకా బాగుంటై. వై ఎస్ గురించి ఆయన ను రాజకీయాల లోకి తీసుకువచ్చిన ఓ పెద్దాయన చెప్పిన స్మృతులే ఈ కధనం.
ఎస్. సత్యబాబు