Thursday, December 31, 2009

సెల్ప్ చెక్


కానుకలు ఇవ్వడం కొందరికి బాగుంటుంది. తీసుకోవడం మరి కొందరికి బాగుంటుంది. ఇచ్చి పుచ్చుకోవడం చాలామందికి బావుంటుంది. ఇలా బావుండే విషయాన్ని మరింత బావుండేలా చేసుకోవడం అందరికీ బావుంటుంది. కానుకలివ్వడం కూడా ఒక కళ అనేదే ఈ సెల్ఫ్ చెక్ చెప్పే విషయం.

-ఎస్. సత్యబాబు

Wednesday, December 30, 2009

రిపోర్టర్స్ డైరీ

చేసింది చెప్పుకోకూడదని కొందరు అంటారు. కాని తలచుకోకూడదని ఎవరూ అనరు. అందుకే నేను ఈ సంవత్సరం లో రాసిన కధనాలు, వాటి వాళ్ళ కొంత మందికి జరిగిన మేలు... ఇలా తలచుకున్నాను. వెళ్ళిపోతున్న రెండు వేల తొమ్మిది కి వీడ్కోలు పలుకుతూ అది నా వ్రుత్తికి చేసిన మేలు కూడా తలుచుకున్నా.
విలేఖరి తలుచుకుంటే అది లేఖ అవుతుందో, డైరీ లో ఒక పేజి అవుతుందో...
-ఎస్. సత్యబాబు

Monday, December 28, 2009

ఫండే

సేవామార్గం పట్టిన వారిని మనం చాల గొప్పగా చూస్తాం. నోటికొద్దీ పోగిదేస్తాం. కాని వారి నుంచి మనం స్ఫూర్తి పొందాలన్న విషయం తెలిసో తెలియకో మర్చిపోతూ ఉంటాం. స్ఫూర్తి పొందిన వారంతా మదర్ తెరిస్సాలే కానక్కర్లేదు. చిన్ని చిన్ని పనులతోనే మేము సైతం అంటూ సేవానందాన్ని స్వంతం చేసుకోవచ్చు. అదే ఈ కధనం.
-ఎస్. సత్యబాబు

సిటీ


హైదరాబాద్ ని ఇలా ఎప్పుడూ చూడలేదు. ఇలా ఎప్పుడూ చూడకూడదు కూడా. ప్రత్యేకమో, సమైక్యమో గాని... ఈ వాదాలు, వివాదాల నేపధ్యంలో... నగరంలో నూతన సంవత్సర స్వాగత సన్నాహాల్లో లోపించిన హుషారు నాలాంటి వేడుకల ప్రియులు గతంలో చూడనిది. అందుకే నేను పరిస్తితిని ప్రతిబిబించేల మా సిటీ పేజి కి ఈ కధనం రాసాను.

-ఎస్. సత్యబాబు

Saturday, December 26, 2009

రిపోర్టర్స్ డైరీ


మరపు మానవ సహజం. గతం గతః అనుకోకపొతే వర్తమానం అనుభూతించలేం. భవిష్యత్తుని స్వాగతించలేం. ఐతే పాత లోని విషాదాన్ని పట్టుకుని వేలాడ్డం ఎంత తప్పో, ఆ విషాదం నేర్పిన పాఠాలను మర్చిపోవడం అంతేతప్పు కూడా. సునామీ నేర్పిన పాఠాలను నేర్చుకున్న మత్స్యకారుల ను కలిసాను...

-ఎస్. సత్యబాబు

Friday, December 25, 2009

రిపోర్టర్స్ డైరీ


కెమెరాలు పట్టుకుని ప్రకృతి దృశ్యాలు ఫోటోలు తీస్తాం. ఫ్రెండ్స్ ని బంధువులను వీలున్నప్పుడల్లా క్లిక్ మనిపిస్తాం. కాని అసలు జీవితంలో ఫోటో తీయిన్చుకోగలమా ,ఫోటో తీస్తే తాము ఎలా ఉంటామో కూడా తెలియని వాళ్ళు మన మధ్యే ఉన్నారు. దీనంగా ఉన్నారు. మౌనంగా ఉన్నారు. వారి దీన వదనాలని ఒక్కసారి కెమెరాలో బంధిస్తే... వాళ్ళెంత దివ్యంగా ఉంటారో... ఆ ఆనందం ఎంత అందంగా ఉంటుందో... ఎన్ని ప్రక్రుతి ద్రుశ్యాలకన్న మిన్నగా ఉంటుందో... అది చవి చూసిన వారికే అర్ధమవుతుంది. ఇది చదివితే మీకూ అర్ధమవుతుంది.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


గుండు చేయించుకోవడం అనేది చాల మంది వెంకన్న భక్తులకు మొక్కు తీర్చుకోవడం. సహజంగా మొక్కులన్నీ మనవి మనమే మొక్కుకుంటాం. ఐతే చిన్న పిల్లల మొక్కులు మాత్రం వాళ్ళు కాకుండా మనమే మొక్కుకుంటాం. వారికి నచ్చో, నచ్చకున్నాకరకు చేతుల మగవాళ్ళ వొళ్ళో కూర్చుని గుక్క పెడుతూ గుండు చేయిన్చుకోవలసిందే. కనీసం మహిళ క్షురకుల పేరిట వారికి ఇపుడో లాలన లభిస్తోంది. తిరుమల వెళ్ళినపుడు మహిళా క్షురకులతో మాట్లాడాను.

-ఎస్. సత్యబాబు

Sunday, December 20, 2009

సెల్ఫ్-చెక్

పెడా వ్యాయామాలు చేసేస్తున్నాం. అందులోనుంచి ఎంత ప్రతిఫలం పొందుతున్నాం? అసలు ఆనందించకుండా చేసే పని ఏదైనా సరైన రిసల్ట్ ఇస్తుందా... ఒక్క సారి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మంచిది కదా...
-ఎస్. సత్యబాబు

Thursday, December 17, 2009

పరిచయం

ఎప్పుడూ విజయం సాధించిన వారి గురించే మాట్లాడతాం. అదీ సాధించిన
తర్వాతే మాట్లాడటం. ఒక్కసారి విజయ సాధన కోసం అష్టకష్టాలు పడుతున్న వారితో కూడా మాట్లాడితే... ఇలా వుంటుంది.
-ఎస్. సత్యబాబు

Tuesday, December 15, 2009

మై ఫ్రెండ్


ఎవ్వరూ లేరు అనిపించే ఒక భయంకరమైన ఒంటరితనంలో ఒకే ఒక తోడు మనకి నేస్తమవుతుంది. ఉప్పగా రుచిన్చినా దానితో మన తీయని స్నేహాన్ని మనం ఎప్పటికీ వదులుకోలేం. నిజం. కన్నీటి విలువ తెలియాలంటే... హోదా పేరుతొ, నామోషి కి భయపడో... దాన్ని దూరం చేసుకున్న వాళ్ళని అడగాలి.

-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


ఇంటి భాద్యత కాస్త నువ్వు కూడా మొయ్యాలి అని తండ్రో తల్లో చెప్పినపుడు... చెట్టంత ఎదిగినా, పని చేయగల సామర్ధ్యం ఉన్న వాళ్ళు కూడా మంచి ఉద్యోగం వస్తే నువ్వు అడక్కుండానే నేను భాద్యత తీసుకుంటా అంటూ తప్పించుకుంటారు. ఆ మంచి ఉద్యోగం అంత తేలికగా రాదు. వచ్చేటప్పటికి తనకో కుటుంబం ఏర్పడకపోదు.

మాధవికి ఎవరూ భాద్యత అప్పగించలేదు. ఇంటి పరిస్థితి చూసి తనే తీసుకుంది. ఇంతా చేసి మాధవి వయసు పన్నెండేల్లె.

-ఎస్. సత్యబాబు

Monday, December 14, 2009

రిపోర్టర్స్ డైరీ


నెల నెలా జీతం అందుకుంటున్నప్పుడు మనందరం చాల ఆనందిస్తాం. అప్పులు, లోన్లు, వాయిదాల చెల్లింపులు... ఇవన్నీ కట్టేసి హమ్మయ్య అని హ్యాపీగా ఊపిరి తీసుకుంటాం. ఐతే నెలంతా పడిన కష్టానికి వచ్చే ఆ ప్రతిఫలం ఇచ్చే ఆనందం సంగతెలా ఉన్నా... అందులోనుంచి చాల చిన్న మొత్తాన్ని వెచ్చిస్తే వచ్చే గొప్ప ప్రశాంతతను ఇపుడు కొంతమంది కనిపెట్టారు. ఆ కొంతమంది దగ్గరనుంచి ఇంకా కొంతమంది... నేర్చుకుంటూనే ఉంటారు.

-ఎస్. సత్యబాబు

Thursday, December 10, 2009

పిట్టగోడ


జాక్సన్ చిత్రపటానికి వేలంపాటలో అత్యధిక ధర పలికింది. పాప్ సంగీత ప్రపంచాన్ని మకుటంలేని మహారాజుగా ఎంతోకాలం ఏలిన ఒక మ్యూజిక్ మాస్టర్ పట్ల పలికిన అభిమానమది.
-ఎస్. సత్యబాబు

Wednesday, December 9, 2009

మిస్టరీ


ఒక తీవ్రవాది చనిపోయాడా బ్రతికి ఉన్నాడా అనేది నిజానికి అంత చర్చనీయాంశం కాదు. కాని ఆ తీవ్రవాది బిన్ లాడెన్ కావడమే ప్రపంచానికి పెద్ద విషయం అయింది. ఆ మిస్టరీ ఎపుడు వీడుతుందో...

-ఎస్. సత్యబాబు

Tuesday, December 8, 2009

రిపోర్టర్స్ డైరీ


చదువుకున్న టైములో నేనెప్పుడూ కాలేజీ నుంచి రాగానే ఏదో పెద్ద కష్ట పడిపోయినట్టు ఫ్రెండ్స్ షికార్లు అనే వాడ్ని. హాస్టల్ లో ఉండి చదువుకుంటూ సాయత్రం పూట నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాలనే ఆలోచన ఆ విద్యార్ధిని లకు వచ్చినందుకు అభినందిన్చాలనిపించింది. అదే చేశా.

-ఎస్. సత్యబాబు

Monday, December 7, 2009

విశ్వరూపం


హైదరాబాద్ మేయర్ గ మహిళఎంపికైంది. ఆమెతో కాసేపు ముచ్చట్లు.

-ఎస్. సత్యబాబు

Thursday, December 3, 2009

రిపోర్టర్స్ డైరీ


తిరుపతి దేవుడు ఎందరికో ఇష్ట దైవం. చిన్న పిల్లలు కూడా అంతే. ఎందరికో ఇష్టమైన వారు. ఐతే మన ఇష్ట దైవం ఎదుటే మన కెంతో ఇష్తులైన చిన్నారులు అష్ట కష్టాలు పడుతుంటే చూడగలమా... తిరుమలలో నిరుపేద బాలలు యాచాకులుగా, బాలకార్మికులుగా ... కనపడుతుంటే కలిగిన స్పందనే ఇది.

-ఎస్. సత్యబాబు

మై హాబిట్


కొత్త శీర్షిక ఇది. కొన్ని అలవాట్లు ఎందుకు అవుతాయో ఎందుకు మనతో పాటు జీవితాంతం ప్రయానిస్తాయో మనకే తెలియదు. వాటిలో చాల ఆసక్తికరమైనవి కూడా ఉంటై. నోటికీ కంటికీ ఒకే సారి పని చెప్తూ నేను చేసుకున్న ఒక అలవాటే రీడ్ వైల్ ఫుడ్. తింటూ చదవడం. చాలామందికి ఇదే అలవాటట. నేను రాసింది చూసాక చెప్పారు.

-ఎస్. సత్యబాబు

Wednesday, December 2, 2009

సినిమా


సినిమా వాళ్లు ఎవరినీ పనులు చేసుకోనీయరు. ఇంకా మాట్లాడితే ఎవరి పని వాళ్ళని చేసుకోనీయరు. మోడల్స్ వాళ్ళే, మూవీస్ లో వాళ్ళే. ప్రకటనల్లో వాళ్ళే, పోలిటిక్స్ లో వాళ్ళే. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవడమే తెలిసిన తారలే కనపడుతున్నారు. వాళ్ళేమి చేసినా చూడబుల్ గానే ఉంటుంది కాబట్టి మనం చూసేస్తున్నాం వల్లేమో ఏది పడితే అది చేసేస్తున్నారు. రాంప్ మీద తారల హంగామా గురించే ఈ కధనం...

-ఎస్. సత్యబాబు