Friday, April 23, 2010

పరిచయం


దుస్తులతో లోపాలని కప్పుకుని, ముఖాన అబద్దపు నవ్వు పులుముకుని, అరువు తెచ్చుకున్న మర్యాదలతో, మాటలతో విజయాలు సాధిస్తున్నాం అనుకుంటూ ఒక పిచ్చివాళ్ళ స్వర్గాన్ని సృష్టించుకుంటూ...

ఎవరిని చీత్కరించు కుంటున్నాం? ఆడ మగ తేడాలు తెలిసేలా ప్రపంచం ఉందా? అసలు సంపూర్ణ స్త్రీతత్వం, మూర్తీభవించిన పురుషత్వం మావి అంటూ చెప్పే దమ్ము ఎంత మందికి ఉండి? అలాంటపుడు తాము ఆడ కాదు మగా కాదు అని ధైర్యంగా చెప్పుకుని తిరిగే వారిని ఎందుకు ఎగతాళి చేస్తున్నాం?

-ఎస్. సత్యబాబు

స్పెషల్


పొదుగు కోసుకుని పాలు తాగడం అంటే ఇదే. మన కడుపు నింపుతున్నాం తప్ప ఒక కడుపుకోతకు కారణం అవుతున్నాం అని అనుకోవడం లేదు. ఈ భూమ్మీద పుట్టిన ప్రతి జీవికి ఆ భూమి విలువ తెలుసు. తెలివిగల మనిషికి తప్ప. అందుకే కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నాడు.

-ఎస్. సత్యబాబు

విశ్వరూపం


నాన్న అంటే నమ్మకం... అమ్మ అంటే నిజం... నిన్నటి మాట. ఇపుడు అమ్మ అంటే కూడా... కేవలం నమ్మకం అనే స్థితికి వచ్చేసిందా... సరోగసి పద్దతిలో ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే తల్లులు పెరుగుతున్నారు. తొమ్మిది నెలలు మోయడం, కాళ్ళతో తన్నడం, పెగుతెన్చుకుని పుట్టడం... వీటిలో ఎలాంటి మార్పూ లేదు. ఇవన్నీ ఒక అమ్మకంగా మారడం తప్ప...

-ఎస్.సత్యబాబు

Friday, April 16, 2010

మై సెంటిమెంట్


నవ్వులు పూయించే శివారెడ్డి... బిజీ జీవితంలో పది... మనలో కొందరం మరచిపోతున్న చక్కని విషయాన్ని గురుతు చేస్తున్నారు. వేల్లోస్తానమ్మ.... ఈ పదంలో ఎంత అమ్మ ప్రేమ ఉంది మరెంత నమ్మకముంది... అదే సెంటిమెంట్. అమ్మ పట్ల ఉండాల్సిన కమిట్ మెంట్.

-ఎస్.సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ

గాలి కూడా చొరబడని విధంగా అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్ మెంట్స్ కట్టుకోవడంలో నగర జీవితాలు ఇరుకవుతోన్న తీరు కనపడుతుంది. నాగరికత కోసం, నాగరిక జీవనం కోసం ఎంత ఇరుకుగా ఐనా బ్రతకడానికి మనిషి రెడీ అవుతాడు.
ఐతే నమ్మకాల విషయంలో మాత్రం ఎంత విశాలంగా మారతాడో...
-ఎస్. satyababu

రిపోర్టర్స్ డైరీ

ఒక సిటీలో ఉంటూ ఆ సిటీకి అలవాటు పడ్డం వేరు... ఆ సిటీని ఇష్టపడడం వేరు. అలవాటు పడ్డాం కాబట్టి ఉండడం వేరు ఇష్టపడి వుండడం వేరు. హైదరాబాద్ ని ఇష్టపడిన వారిలో అక్కడే ఉండడానికి మాత్రం ఇష్టపడని వారు ఉంటారు. అలాంటి వారిలో ఒకడిగా నేనున్నాను. ఈ సిటీని ఇష్టపడుతూనే... ఇక్కడ ఉండడానికి కష్టపడుతున్నాను. ఈ సిటీ గురించి వచ్చినన్ని బుక్స్ మరే సిటీ మీద ఐన వచ్చి ఉంటాయా...
-ఎస్.సత్యబాబు

మై సెంటిమెంట్


సత్తా ఉందా... ఈ ప్రశ్నను వోటర్లకు వేస్తూ రాజకీయాలలోకి వచ్చారు లోక్ సత్తా నాయకులు జయప్రకాశ్ నారాయణ. రాజకీయాలను మార్చే సత్తా ఆయనకు ఉందని వోటర్లు ఇంకా నమ్మినట్టు లేదు. ప్రజల సెంటిమెంట్ మీద గేమ్స్ ఆడుకునే అలవాటు లేని నేతగా జయప్రకాశ్... తనకు కూడా ఎటువంటి సెంటిమెంట్లు లేవంటున్నారు.

-ఎస్. సత్యబాబు

Monday, April 5, 2010

మై సెంటిమెంట్


ప్రత్యర్థులను సెంటిమెంట్స్ లేకుండా నిర్దాక్షిణ్యంగా

నరికి పారేసే బొబ్బిలి బ్రహ్మన్న ను కదిలిస్తే అంతా సెంటిమెంటే.

-ఎస్. సత్యబాబు

స్పందన


సందేహం వద్దు అంటూ రాసిన కధనానికి వచ్చిన స్పందనే ఇది. -సందేహం లేదు- మరో సారి జాబ్ శాటిస్ ఫ్యాక్షన్ ఇచ్చిన స్టోరి.
-ఎస్. సత్యబాబు

Friday, April 2, 2010

రిలేషన్ షిప్స్


పౌడర్లు, స్నో లు, క్రీం లు, లిప్ స్టిక్ లు... ఇంకా ఏమేమి పూయాలి? ఎన్ని చేస్తే ఈ దేహం ధగ ధగ లాడుతుంది? ఎన్ని పూస్తే కాంతులీనుతుంది? అన్నీ చేసేస్తున్నాం? ఈ రక్తమాంసాల ఆస్థి పంజరం మీద ఎంతో ప్రేమ పెంచుకుంటున్నాం... సరే. ఉన్నప్పుడు ఎన్ని చేసినా మన దేహం సాటిలేనిదిగ మారదు. పోయాక ఒక్కటి చేస్తే చిరకాలం మన శరీరం చిరంజీవిగా మారుతుంది. చివరిగా ఒక్కటి చేస్తే మన శరీరం తన జన్మకు సార్ధకత పొందుతుంది. అదే... మరణానంతరం... శరీరదానం. వైద్య పరిశోధనలకు వీలుగా చేసే ఓ గొప్ప త్యాగం. అలాంటి త్యాగాన్ని కలుద్దాం రండి.

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ




అందం అంటే ఏమిటి? వికలాంగులకు అందం ఉండదా.. అందం ప్రధానమైన వృత్తులు, ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యం ఉండదా...


-ఎస్. సత్యబాబు

పరిచయం


నోరు ఉంది కదా అని ఎడాపెడా వాగేస్తుంటారు కొందరు. అవసరం ఉన్న చోట కూడా మూగనోముతో విసుగు పుట్టిస్తుంటారు మరికొందరు... పుట్టుకతో పలుకుకు నోచుకోని, వినికిడి శక్తి లేని మనుష్యులది దీనికి భిన్నమైన ప్రపంచం. ఆ ప్రపంచమే తనకు కావాలంటారు అనురాధ. ఎడా పెదా వాగినా... మూగనోము పట్టినా అన్నీ ఆ ప్రపంచం కోసమే అంటారు...

-ఎస్. సత్యబాబు

మై సెంటిమెంట్


టీవీ చూసే అలవాటు ఉన్నవారికి ఝాన్సీ ఎవరో చెప్పనక్కర్లేదు. కాని ఆమె సెంటిమెంట్స్ గురించి తప్పకుండా చెప్పాలి...

-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


మంచిపని. ఎండాకాలంలో ఎందేగొంతులు తడపాలనే ఆలోచనతో చల్లని నీరు ఉచితంగా అందివ్వడం చాలా మంచిపని. చలివేంద్రాలు రోడ్ పక్కగా ఏర్పాటు చేస్తారు. మండే ఎండల్లో ఏర్పాటు చేసిన ఆ గుడారాలలో నీళ్ళు పోసేందుకు మనుషులను పెడతారు. అలా పెట్టిన వారిలో ఒక వృద్దురాలు కూడా ఉండడం అన్యాయం అనిపించింది. ఒక రాజకీయనాయకుడు ఏర్పాటు చేసిన చలివెంద్రంలో ఆ పార్టీ కార్యకర్త తన తల్లిని ఉంచాడు. పైసా ఖర్చు చేయకుండా ముసలమ్మను మండుటెండలో నిలబెట్టి వందలమందికి నీళ్ళు పోయమనడం ఎంత అన్యాయం? అదే రాసాను. దానికి రిసల్ట్ కనిపించింది. ఆ మామ్మ కు విముక్తి లభించింది. నిజంగా నేను చేసింది కూడా మంచిపనే. కాదంటారా?

-ఎస్.సత్యబాబు

సెల్ఫ్ చెక్


తలవెంట్రుకల నుంచి మొదలుపెట్టి... దేహంలో ఇందు-అందు అనే సందేహం లేకుండా ఎందెందు వెతికినా అన్నట్టు ప్రవహించే చెమట...అంటే చాలామందికి మంట. సమ్మర్లో ఆ మంట మరింత. అవగాహనా ఉంటె దాన్ని మేనేజ్ చేయడం ఈజీ.

-ఎస్. సత్యబాబు

సెల్ఫ్ చెక్


సెలవు రోజు అనగానే... ఏదో తెలియని సంతోషం. హమ్మయ్య అనే ఫీలింగ్. వీక్ అంతా రొటీన్ వర్క్ తో అలసిపోయిన మనసుకు అలాంటి ఫీలింగ్ అవసరమే. ఐతే సెలవు రోజు కూడా ఒక విలువైన జీవితంలోని అతి విలువైన రోజే. దాన్ని యధాలాపంగా గడిపేయడం కాకుండా సద్వినియోగం చేయడం మన చేతిలోనే ఉంది...

-ఎస్. సత్యబాబు