Saturday, November 20, 2010

చౌరస్తా


నువ్వు ఎంత గోప్పతన్నాన్ని అయిన ప్రదర్శించవచ్చు. కాని మానవత్వం అనేది దానికి జత కాకపొతే ఆ ప్రదర్శన ఎప్పటికీ గొప్పది కాదు. జపాన్ నేర్చుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం అంటూ లేని రోజు రావచ్చేమో... కాని మరో వైపు ఆ దేశం నేర్చుకోవలసిన కనీస మానవ ధర్మాల చిట్టా చాంతాడులా పెరిగి పోతోంది. అందులో మొదటిది వృద్దుల పట్ల చూపవలసిన భాద్యత.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


కర్ర పుచ్చుకుంటే గాని బుర్రని పని చేయించ లేము. ప్రతి మనిషీ ఇక్కడికి వచ్చింది నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్షా అనుకుంటూ బ్రతికేయడానికి కాదు.. ఎదుటి వారి ఆకలి ని తడిమి... దానిని తీర్చడానికి. ఆ ఆకలి ఏదైనా కావచ్చు. పొట్టకి సంభందించిందో... జ్ఞానానికి సంభందించిందో, ప్రేమకు సంభందించిందో... ఏదైనా సరే మన వద్ద ఉన్న దానిని అది కరువైన వారికి పంచడమే మానవ ధర్మం. సుఖాలను మరిగిన మనిషి భాధ్యతలను మరచిపోకుండా దేవుడు చూస్తున్నాడు. అవసరమైనపుడు కర్ర పుచ్చుకుంటాడు. మనిషి బుర్ర సరిగా పనిచేసేలా చేస్తాడు.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


పెళ్లి... చాలా మందిని ఏకకాలంలో సంతోషపెట్టే భయపెట్టే విషయం. మనిషికి మనిషి తొడు అవసరం. అది ఎప్పటికీ ఉండాలి అంటే పెళ్లి అనే భంధమూ అవసరం. కాని ప్రపంచం ఒక గ్రామంగా మారిపోతూ ఈ భందాన్ని బలహీనంగా మార్చేస్తోంది.. శతదినోత్సవాల నుంచి అర్ధ శతదినోత్సవాలకి, అక్కడ నుంచి పావు శతదినోత్సవాలకి పడిపోతున్న సినిమాల లాగానే వైవాహిక భంధం కూడా చిక్కి పోతోంది. పదేళ్ళు కలిసి కాపురం చేయడం కూడా వేడుక చేసుకునే విషయంగా మారిన పరిస్థితుల్లో... డెబ్బై సంవత్సరాల ఈ దాంపత్యం నుంచి నేర్చుకోవలసింది ఎంతో... ఎంతెంతో... అందుకే ఈ పెద్దల మాట పెళ్ళికి, నవదంపతులకు చద్దన్నం మూట.
-ఎస్. సత్యబాబు

పరిచయం


మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. మానుగా మారితే వంగదు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మన సాంకేతిక సంతర్పణ పుణ్యమా అని పర్యావరణానికి అవుతున్న గాయం ఎన్ని -మొక్క-లు నాటితే -మాను- తుందో... లీల రెడ్డి ఇంటింటికీ తిరిగి మరీ మొక్కలు పంచుతున్నారు. మీ పిల్లల్లా చూసుకోండి అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు. లక్ష మొక్కల నోము పెట్టుకున్నారట ఆమె. ఇలాంటి మొక్కవోని నోములే ప్రమాదకరమైన మానులా మారిన కాలుష్యాన్ని వంచేవి.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


యుద్ధం. ఆ పదమే చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇక యుద్దరంగంలో ఉన్నవారికి శక్తి ఇంటి పేరు అవుతుంది. దేశభక్తి వారి వంటి పేరుగా అంటిపెట్టుకుంటుంది. అందుకేనేమో... సైనికులను గౌరవించడానికి ఎన్ని పదాలైన సరిపోవు. పదాల గారడీ కన్నా, మాటలతో మాయ చేయడం కన్నా... చేతలతో వారిపైన ఉన్న గౌరవాన్ని చాటడానికి ఎం చేయాలి? ఇక్కడ ఒక నలుగురు చేతలే సమాధానం.
- ఎస్. సత్యబాబు

చౌరస్తా


నేరం చేసిన వాడు చట్టానికి చిక్కలి. శిక్షకు గురి కావాలి. అప్పుడే జనానికి పోలీసుల మీద, ప్రభుత్వం మీద మొత్తంగా వ్యవస్థ మీద నమ్మకం ఏర్పడుతుంది. లేకపోతే ఆ నమ్మకం ఏర్పడకపోవడం మాత్రమే కాదు... రేపు నేను నేరం చేసినా తప్పిన్చుకోవచ్చుననే నమ్మకం పెరిగిపోతుంది. అది సమాజానికి ప్రమాదం. ఒక సీరియల్ కిల్లెర్ ఇప్పటికీ దొరకక పోవడం అంటే ప్రమాద ఘంటిక మొగినట్టే.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


రోగం చెడ్డది. దానికి పాప పుణ్యాలు లేవు. దయ దాక్షిణ్యాలు లేవు. ఇవన్నీ లేక పోయినా పర్లేదు. దానికి బీదా గొప్ప తేడా కూడా లేదు. అదే పెద్ద సమస్య. ఈ విషయం మనకి తెలుసు. ఎన్ని ఆరోగ్యశ్రీలు వచ్చినా నిరుపేదను కాపాడలేవనీ తెలుసు. కాని రాజేష్ కి దీనితో పాటే తన వంతుగా చేయాల్సినది కూడా తెలుసు. అదే చేస్తున్నాడు. అనాధ రోగులను అక్కున చేర్చుకుంటున్నాడు. నేటి కుర్రాళ్ళకు తోటి మనిషి భాధలకు స్పందించడం తెలుసు అని నిరూపిస్తున్నాడు.
-ఎస్. సత్యబాబు

రిలేషన్ షిప్స్


అమ్మను చూడడానికే వంతులు వేసుకునే దరిద్రపు రోజులివి. ఇక అవ్వను చూడాలి అంటే... మా వల్ల కాదని తేల్చి చెప్పేస్తారు. ఒకప్పుడు నూరేళ్ళు బతకడం అంటే ఎంతో గొప్ప. ఇప్పుడు వయసు పెరుగుతుంటే భయం. ఇంకా బతకవలసి వస్తుందేమో... పిల్లల చీత్కారాలు పడవలసి వస్తుందేమో అని ఆందోళన. ఒక బామ్మ గారు నూట ఆరేళ్ళు బతికారు. కాదు కాదు ఆమె కుటుంబ సభ్యులే ఆమెను శతక విజేతను చేసారు. అవ్వకు జై. అనుభందాలకు జై.
-ఎస్. సత్యబాబు

వానకతలు


ఒక్కసారిగా వాన వచ్చి మీద పడితే... తలారా స్నానం ఇలా చేయాలిరా భడవా... అని నేర్పినట్టు ఉంటుంది . అమ్మ లాంటిదే వాన కూడా. అన్నం పెట్టినా... నెత్తి మీద ఆప్యాయంగా మొట్టినా... అమ్మకు సాటిలేదు. వానకూ సాటి లేదు.
-ఎస్.సత్యబాబు

పరిచయం


కాసేపు మాట్లాడకుండా నోరుమూసుకో... అంటే తెగ గింజు కుంటాం. అసలు మాట్లాడకుండా ఉంటే ఎలా? అడగక పొతే అమ్మ ఐనా పెట్టదు అంటారు... మరి మాటకు నోచుకోని వారి పరిస్తితి? పుట్టుకతోనే మాట చచ్చిపోయిన వారి సంగతేమిటి? వారి హక్కుల గురించి ఎవరు మాట్లాడతారు? మూగ వ్యక్తిని భర్తగా మార్చుకున్న నస్రీన్ మూగ భాష నేర్చుకున్నారు. అంత కాదు వారి గుండెల్లోని ఆవేదనను కూడా తెలుసుకున్నారు. అందుకే ఆమె మాట్లాడుతున్నారు. మూగ వాళ్ళ తరపున పోట్లాడుతున్నారు...
-ఎస్.సత్యబాబు

Thursday, November 4, 2010

రిపోర్టర్స్ డైరీ


వంటింటి నుంచి బయటకు వస్తే... విశాలప్రపంచం దర్శనమిస్తుంది. ఆడదానిగా మాత్రమే కాదు ఒక వ్యక్తిగా కూడా తనను తానూ ఆవిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ పని ఇందిర చేసారు. భర్త, పిల్లల సేవలో గడుపుతూ... గడప దాటని మహిళ గొప్ప ఇల్లాలు అనిపించుకోవచ్చు. కాని ఆమె జీవితం గొప్పది అనిపించుకోదు.
ఇదే ఇందిర తన షార్ట్ ఫిలిం లో చెప్పారు. తనూ చేసి చూపారు.
-ఎస్. సత్యబాబు

పెరెంటింగ్


భగవంతుడు తలరాత రాస్తాడట. దాన్ని మన చేతి రాతతో మార్చగలమా... చిన్నపిల్లలకు చక్కని దస్తూరి వచ్చేల చేస్తే అది వారిని వృద్దిలోకి తీసుకేల్తుందట. నవతరపు రాతనిపుణులు చెప్తున్న మాట ఇది.
-ఎస్. సత్యబాబు

రిపోర్టర్స్ డైరీ


విలేఖరిగా భాద్యతలు నిర్వహించడం మొదలుపెట్టి దాదాపు పదేళ్ళు కావస్తోందేమో... ఎన్నో సార్లు ఎంతో మందికి మనస్సు చివుక్కు మనిపించేవి, నా మీద కోపం కలిగించేవి, కొండకచో పగను పుట్టించేవి కూడా రాసుంటాను... అలాగే దీనికి పూర్తీ విరుద్దమైన భావాలు ఇతరులలో కలిగించేవి కూడా రాసుంటాను. అలాగే నాకు తృప్తిని ఇచ్చేవి, అసంతృప్తిని మిగిల్చేవి... లాంటివి కూడా ఎన్నో రాసుంటాను. ఏదైనా రాసి మాత్రమే దాని ఫలితాన్ని చవి చూడడం అలవాటైన నాకు ఈ సారి ఒక వింతైన అనుభవం... రాయనందుకు, అసలు రాయాలనే ఆలోచనే నాకు వచ్చినందుకు.... నేను మనస్పూర్తిగా భాధ పడ్డ అంశం ఇది. మన స్థిమితం లేని ఒక పిచ్చి తల్లి కి ఎలా క్షమాపణలు చెప్పాలో....
-ఎస్. సత్యబాబు