Thursday, August 20, 2009

రిపోర్టర్స్ డైరీ


నవనాగరీకులం మనమంతా. సున్నితం, సెన్సిటివ్ నెస్ మనసంతా. ప్రపంచంలోని విషయాలన్నీ తెలుసుకుంటాం. ఎడా పెడ విశ్లేషించి పారేస్తుంటాం. కాని సమస్య మనదైన రోజున బేర్ బేర్ మంటాం. అంతటి కష్టం ఎవరికీ రాకూడదంటూ బెంగపడి పోతుంటాం. ఎందుకంటే మనమంతా నవనాగరీకులం. ఐతే దీనికి భిన్నంగా కొందరుంటారు. అ అంటే పక్కన న్నం తప్ప మరేమీ లేదనే వారు. కష్టమే జీవిత అభీష్టం అన్నట్టుగా ఉండేవారు. వారికి ప్రపంచం గురించి తెలీదు. వారి ప్రపంచం లో వారుంటారు. మాటల్లో, చేతల్లో ఎక్కడా సున్నితత్త్వం లేనట్టు ఉండే వీరికి తాము బ్రతకడం మాత్రమే తెలుసు. తమవార్ని బ్రతికించుకోవడం మాత్రమే తెలుసు. అదెలాగో తెలుసుకోవలసిన అవసరం ఇపుడు మనకుంది.
-యస్. సత్యబాబు

No comments: