Sunday, March 7, 2010

రిపోర్టర్స్ డైరీ


నాన్న చివరి రోజులు నాకు బాగా గురుతున్నై. తన పిల్లలతో సహా ఎన్నిటినో ఆయన మరిచిపోయేలా చేసిన వ్యాధి పేరు ఏమిటో అప్పట్లో చిన్నవాడినైన నాకు తెలియదు. వృధ్యాప్యం లో ఉన్నవారిని ఆప్యాయంగా పలకరించే ఈ మరపు వ్యాధికి మన డాక్టర్లు ఇప్పటివరకూ మందు కనిపెట్టారో లేదో కాని బోలెడన్ని పేర్లు మాత్రం కనిపెట్టారు. అల్జీమర్స్, డిమెన్ షియా వంటివి వాటిలో కొన్ని. మలిదశ జీవితాన్ని మరింత సంక్లిష్టంగా మలిచే ఈ వ్యాధి బారిన పడిన తల్లిని, అలాంటి ఎందరో తల్లుల్ని మామూలు మనుష్యులుగా చేయడానికి ఒక మహిళ చేస్తున్న ప్రయత్నం... ఆమెను మరచిపోలేని వ్యక్తిగా మార్చుతోంది.

-ఎస్. సత్యబాబు

No comments: