Tuesday, June 30, 2009

విశ్వరూపం


ఒక మహిళ భార్యగా, ప్రేయసిగా పురుషుని ఆదేశాలకు లోబడే ఉండాలా... అక్కర్లేదు అని నిరూపిస్తున్న నటి కత్రినా కైఫ్ గురించిన సమాచారం ఇది. పెద్దగ కష్టపడకుండానే రాసే ఇలాంటి కధనాల వల్ల మనసుకు తృప్తి సంగతేమో గాని బైలైన్ మాత్రం లభిస్తోంది. జై విశ్వరూపం. జై మాధవన్నయ్య.

-యస్. సత్యబాబు

రిపోర్టర్ డైరీ


ఈ పేజీకి నేను రాసిన రెండో ఐటెం ఇది. పాత తరగతి పుస్తకాలను సేకరించి అవసరమైనవారికి ఉచితంగా అందజేస్తున్న విద్యార్ధుల గురించిన కధనం ఇది. కొత్త పేజి కదా కొత్త కొత్తగ ఉంది. పాతబడే లోపే వీలున్నన్ని కధనాలు రాసేయాలి. ఆరంభ శూరత్వమవుతుందా... ఏమో.

యస్. సత్యబాబు

Friday, June 26, 2009

రిపోర్టర్ డైరీ


రామ్ గారి ఆలోచనకి నా ఐడియా కొంచెం తోడై మొత్తానికి ఈ రిపోర్టర్ డైరీ మొదలైంది. ఎపుడో రామ్ గారు రాయమన్న స్టొరీ ఇది. ఇప్పటికి పట్టాలేక్కింది. అందుకే దేనికైనా టైం రావాలంటారు. చెవిటి మూగ వంటి లోపాలను పట్టించుకోకుండా జీవితాన్ని ఆశవాహద్రుక్పధంతో నడిపిస్తున్న ఓ కాఫీ డే ఉద్యోగిది ఈ కధనం. నాతొ పాటు చాలామంది నేర్చుకోవలసిన లక్షణం అది.

-యస్. సత్యబాబు

Tuesday, June 23, 2009

రిలేషన్ షిప్స్

చిన్న వార్త. పెద్ద కధనమైంది. ఎందరినో కదిలించింది. మా సిటీ పేజీలో వచ్చిన ఒక క్రైమ్ వార్తను చూసి రాసిన ఈ కధనం... ముగ్గురు అక్కచెల్లెళ్ళు ఒకే కుటుంబానికి కోడళ్ళుగా వెళ్లి పడిన కష్టాలు. ఏడు నెలల్లోనే తిరిగి వచ్చిన కూతుర్ల ను చూసి తల్లితండ్రులు పడుతున్న ఆవేదన... స్టొరీ నేను ఇష్టపడి చేసింది. కాని ఆ పల్లెటూరు స్వయంగా వెళ్లి రాస్తే ఇంకా బాగుండేది.
-యస్. సత్యబాబు

Saturday, June 20, 2009

విశ్వ రూపం

ఎంత బాగుందో కదా ఈ ఫోటో... ఇదే ఫీలింగ్ ఈ స్టొరీ రాయించింది. సూది దూరే సందిస్తే చాలు స్టొరీ అల్లెయడానికి. అదే పని చేశాను నేను కూడా. మహిళా పోలీస్ ప్రస్థానం, పురోగమిస్తున్న తీరు... ఈ కధనంలో వివరించాను. విశ్వరూపంలో వారానికో ఐటెం ఇవ్వడం బాగుంది. బయటకు వెళ్లకున్నా ఏదో ఇలా - నెట్టు - కొచ్చేయడం కూడా బాగుంది.
-యస్. సత్యబాబు

Saturday, June 13, 2009

ఆర్ట్ అండ్ కల్చర్


మొన్న ఎవరో జర్నలిస్టు మిత్రుడొకరు అడిగారు... ఏమిటీ సోనియా, అమితాబ్ అంటూ ఏవేవో రాస్తున్నావ్ అని. రాసే చేయి చదివే కన్ను ఊరుకోదని సమాధానం చెప్పా. అన్నే ఫ్రాంక్ అనే యూదు జాతీయురాలు బాల్యంలో పడిన కష్టాలను డైరీల్లో రాసుకుందట. వాటి ప్రదర్శనకు సంభందించిన వచ్చిన న్యూస్ ఐటెం ఇది. మొత్తానికి నా పరిస్థితి నేను రాసే కొన్ని వార్తల ద్వారా నేనే చెప్పుకుంటున్నట్టు ఉంది.

-యస్. సత్యబాబు

Wednesday, June 10, 2009

జెంటిల్ మెన్


ప్రతీ సారి మనకు నచ్చిన వార్తలు రాయడం కుదరదు. అందులో సందేహం లేదు. కాని లక్కీగా జెంటిల్ మెన్ కు రాసిన వన్నీ నాకు నచ్చినవే. అందరికీ తెలిసిన అమితాబ్ ను మరింత లోతుగా తెలియ చెప్పాలి అనుకున్నా. తనను తానూ ఎంత మాత్రం జెంటిల్మెన్ గ చెప్పుకోవడం ఇష్టపడని ఒక వ్యక్తి ఇతరుల్లోని జెంటిల్మెన్ ను వెలికితీయడం విశేషమే కదా...

-యస్. సత్యబాబు

ఆర్ట్ కల్చర్

నా ఫిట్ నెస్ పేజి స్థానంలో వచ్చిన ఆర్ట్ కల్చర్ పేజి ఇది. దీనికి ఐటెం ఇమ్మన్నప్పుడు చాలసేపు ఆలోచించి, చించి ఒక అప్ కమింగ్ ఆర్టిస్ట్ ని పరిచయం చేశాను. సింపుల్ గ చెప్పాలంటే కొండను తవ్వాను ఎలుకను పట్టాను. అంతే.
-యస్. సత్యబాబు

Sunday, June 7, 2009

రివ్యూ


ఒక సీనియర్ విలేఖరి రాసిన టి వి మీడియా విశేషాల పుస్తకం ఫై నేను రాసిన రివ్యూ ఇది. తొలిసారిగా చేసిన సమీక్ష. బావుందని ఆ విలేఖరి అన్నారు. అందుకు కాకపొఇనా పుస్తకాలు చదివే స్థాయి నుంచి వాటి పై రివ్యూ రాసే స్థాయి కి వచ్చి నందుకైన నేను ఆనంద పడవలసినదే.
-యస్. సత్యబాబు

Saturday, June 6, 2009

పరిచయం


ఈ కధనాన్ని ౩ వ పేజి లోకి కూడా కొనసాగించాము. దాని ఫలితమే ఈ రెండో పోస్ట్.

-యస్. సత్యబాబు

పరిచయం


అందుకే రిపోర్టింగ్ ని నేను ఇష్ట పడేది. ములుగు మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామం లో జ్యోతిరెడ్డి అనే మహిళ చేస్తున్న పర్యావరణ సేవ గురించిన కధనం ఇది. పల్లెలు, అక్కడి పరిసరాలు ఆనందించడానికి నాకు ఈ కధనం అవకాశాన్ని ఇచ్చింది. స్పందన కూడా బావుంది. అందుకే రిపోర్టింగ్ ని నేను ఇష్టపడేది. అయితే కింద ఇచ్చిన గింజ కధనం నాది కాదు. -యస్. సత్యబాబు

Monday, June 1, 2009

పరిచయం స్పందన

కొన్ని వార్తలు రాసేటప్పుడు సెల్ఫ్ సాటిస్ ఫాక్షన్ ఇస్తాయి. కొన్ని రాసాక బోలెడంత గుర్తింపుని జాబ్ సాటిస్ ఫాక్షన్ ఇస్తాయి. రెండో తరహా ఆనందాన్ని అందించిన కధనమిది. మా ఇంటికి రా అమ్మ అనే శీర్షికన నేను రాసిన కధనం తో ఇద్దరు తల్లులను వారి పిల్లలు రా అమ్మ అంటూ గుర్తుపట్టి తీసుకువెళ్ళారు. అరుదుగా మాత్రమె మనకు దక్కే కొన్ని సంత్రుప్తులు ఇవి. వీటిని తరచుగా దక్కించుకోవాలంటే చేయవలసింది ఏమిటో నాకు ఇపుడు అర్ధమైనట్టే ఉంది.
-యస్.సత్యబాబు